Venkateswarlu
Venkateswarlu
బ్రిటన్‌లో ఓ అద్భుతమైన సంఘటన చోటుచేసుకుంది. 114 ఏళ్ల క్రితం మూతపడ్డ ఓ మెడికల్ షాపు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇన్నేళ్ల తర్వాత దాన్ని ఓపెన్ చేశారు. ఆ మెడికల్ షాపులో ఉన్న వస్తువుల్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ మెడికల్ షాపు 1880లో ప్రారంభమైంది. దీన్ని బ్రిటన్‌కు చెందిన విలయమ్ వైట్ అనే వ్యక్తి ప్రారంభించాడు. తన ఇంట్లోని ఓ గదిలో ఆ మెడికల్ షాపును పెట్టుకున్నాడాయన. అయితే, ప్రారంభమైన 30 ఏళ్లకే మెడికల్ షాపు మూతపడింది.
విలియమ్ చనిపోయిన తర్వాత షాపును నడిపేవారు లేక.. 1909లో దాన్ని మూసేశారు. తర్వాత ఆ ఇంటిని వేరే వాళ్లకు అమ్మేశారు. ఇక, అప్పటినుంచి దాన్ని ఎవరూ తెరవలేదు. కానీ, 80 ఏళ్ల క్రితం ఆ షాపు గురించి విలియమ్ మనవరాలు బయటి ప్రపంచానికి చెప్పింది. 1987లో ఆమె ఆ మెడికల్ షాపు గురించి మాట్లాడింది. అయినా అప్పుడు దాన్ని ఎవరూ తెరవలేదు. కానీ, ఆ మెడికల్ షాపు గురించి తెలుసుకున్న ఓ ఆర్గనైజేషన్ తాజాగా, ఆ మెడికల్ షాపును తెరిచింది.
దాన్ని ప్రదర్శన కోసం ఉంచింది. అందులో జార్లు, మందులు నిండి ఉన్న సీసాలు, బరువు తూచే మిషిన్, ఓ పాత టైప్ రైటర్ మొదలైనవి అందులో ఉన్నాయి. అయితే, ఆ మెడికల్ షాపులో ఉన్న కొన్ని మందులు అత్యంత ప్రమాదకరమైనవని తేలింది. ప్రస్తుతం ఆ మెడికల్ షాపుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరి, బ్రిటన్‌లో 114 ఏళ్ల క్రితం మూతపడ్డ మెడికల్ షాపును మళ్లీ తెరవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.