nagidream
సౌత్ వారు ఎక్కువగా గేదె పాలు వాడతారు. ఆవు పాలు పెద్దగా వాడరు. కానీ ఉత్తరాది రాష్ట్రాల వారు మాత్రం పాలు ఎక్కువగా వాడతారు. అందులో మళ్ళీ ఆవు పాలే ఎక్కువగా వినియోగిస్తారు. దీనికి గల కారణాలు ఏంటి? ఈ వ్యత్యాసం వెనుక ఉన్న చరిత్ర ఏంటి? అని తెలిపే పూర్తి కథనం మీ కోసం.
సౌత్ వారు ఎక్కువగా గేదె పాలు వాడతారు. ఆవు పాలు పెద్దగా వాడరు. కానీ ఉత్తరాది రాష్ట్రాల వారు మాత్రం పాలు ఎక్కువగా వాడతారు. అందులో మళ్ళీ ఆవు పాలే ఎక్కువగా వినియోగిస్తారు. దీనికి గల కారణాలు ఏంటి? ఈ వ్యత్యాసం వెనుక ఉన్న చరిత్ర ఏంటి? అని తెలిపే పూర్తి కథనం మీ కోసం.
nagidream
దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తరాది, పశ్చిమ రాష్ట్రాల వారు ఎక్కువగా పాలు వినియోగిస్తుంటారు. వీటిలో ఎక్కువగా ఆవు పాలను వినియోగిస్తారు. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తరాది, పశ్చిమ రాష్ట్రాల వారు పాలను, ముఖ్యంగా ఆవు పాలను ఎక్కువగా వినియోగించడానికి చాలా కారణాలు ఉన్నాయి. వీటిలో ఆవుల్లో రకాలు, వారి ఆహారపు అలవాట్లు, సంప్రదాయంగా వస్తున్న ఆచారం వంటి కారణాలు ఉన్నాయి.
ఆహారపు అలవాట్లు అనేవి అక్కడ ప్రాంతాల్లో దొరికే ముడి పదార్థాల మీద ఆధారపడి ఉంటుంది. చారిత్రాత్మకంగా పాల సామర్థ్యం అనేది దక్షిణాది రాష్ట్రాల్లో తక్కువ కాబట్టి తక్కువ పాలను వినియోగించడం సాంప్రదాయ ఆహారపు అలవాటుగా మారింది. అందుకే వెన్న, పన్నీర్, జున్ను పాల పదార్థాలతో చేసే ఫుడ్ వైరైటీలు వంటివి మనకు లేవు. మరోవైపు దక్షిణాదిలో అనాదిగా ఎక్కువగా బియ్యం ఆధారిత ఆహారం మాత్రమే ఎక్కువగా తినేవారు. అలానే మిల్లెట్ ఫుడ్స్ ఎక్కువగా తినేవారు. కూరగాయలు, మసాలా దినుసులు వంటివి సౌత్ లో ఎక్కువగా వాడతారు. దక్షిణాది వారి ఆహారపు అలవాట్లు వేరే. పాలు, పన్నీర్, జున్ను వంటి పాల ఉత్పత్తుల నుంచి వచ్చే ప్రోటీన్స్ ని ఇష్టపడరు. చేపల్లో అనేక రకాల ప్రోటీన్లు ఉండడం చేత దక్షిణాది వారు వీటిని ఎక్కువగా తింటారు. పాల కంటే కూడా చేపల ద్వారానే ప్రోటీన్స్ ని తీసుకుంటారు. అలానే దక్షిణాది వాళ్ళు నాన్ వెజ్ ఎక్కువగా తింటారు.
ఎస్ఏఎస్ అనే జాతీయ సర్వే తెలిపిన వివరాల ప్రకారం.. దక్షిణాదిలోనే ఎక్కువగా నాన్ వెజ్ ప్రియులు ఉన్నారు. 98.5% మాంసాహారులతో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఒడిశా, ఝార్ఖండ్ రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాలన్నీ 97 శాతానికి పైగా నాన్ వెజ్ తింటున్నారు. అయితే దీనికి విరుద్ధంగా గుజరాత్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాలు 40 శాతం కంటే తక్కువగా నాన్ వెజిటేరియన్స్ ఉన్నారు. దీనికి కారణం.. నార్త్ లో కొన్ని రాష్ట్రాలకు సముద్రంలోకి వెళ్లేందుకు అనుమతి లేదు. అందుకే నార్త్ వాళ్ళు చేపలకు ప్రత్యామ్నాయంగా ప్రోటీన్స్ కోసం పాల మీద, పాల ఉత్పత్తుల మీద ఆధారపడ్డారు. ప్రోటీన్స్ కోసమే పాలకు పరిమితమయ్యారు. కానీ ఇప్పుడు చాలా ప్రాంతాల్లో చికెన్, మేక మాంసం, గొడ్డు మాంసం వంటివి తింటున్నారు.
కానీ దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే తక్కువే. దక్షిణాది వారు ఎక్కువగా నాన్ వెజ్ ప్రియులు అయిన కారణంగా.. పాలు మరియు పాల ఉత్పత్తుల అవసరం అనేది ఎక్కువగా ఏర్పడలేదు. కేవలం మజ్జిగ తాగడానికి, పెరుగన్నానికే పాలను ఉపయోగిస్తారు. అయితే వేడి వాతావరణాన్ని తట్టుకునేందుకు ఆవు పాలను పిల్లలకు ఇస్తారు. ఆవు పాలను మజ్జిగ, పెరుగు కింద మార్చుకుంటారు. సౌత్ ఇండియన్స్ తో పోలిస్తే నార్త్ మరియు వెస్టర్న్ ఇండియన్స్ ఎక్కువగా పాలు, పాల ఉత్పత్తులు వినియోగించడానికి కారణం.. వారు మాంసం, చేపలు వంటి నాన్ వెజ్ ఐటమ్స్ తక్కువగా తినడం. పాలు మరియు పాల ఉత్పత్తుల్లో చక్కెర అయినటువంటి లాక్టోజ్ ని ఉత్తర, పశ్చిమ రాష్ట్రాల వారు జీర్ణించుకోగలుగుతారు. సౌత్ ఇండియన్స్ విషయానికొచ్చేసరికి జీర్ణించుకోలేరు. అందుకే పాలను తక్కువగా వినియోగిస్తారు. నార్త్ వాళ్ళు పాల మీగడను ఎక్కువగా వినియోగిస్తారు.
ఉత్తరాది రాష్ట్రాల్లో పాల వినియోగం ఎక్కువే. ముఖ్యంగా ఆవు పాల వినియోగం ఎక్కువ. దీనికి కారణం వారు అనాదిగా పశుపోషకులుగా ఉంటూ వస్తున్నారు. పశుపోషణ మరియు పాడి పరిశ్రమలో భాగమవ్వడం అనేది అనాదిగా వస్తున్న సంప్రదాయం. మరోవైపు ఉత్తర భారతదేశం, పశ్చిమ భారతదేశంలో పాల ఉత్పత్తి చేసే ఆవులు, గేదెలు ఎక్కువ. ఈ కారణంగానే వీరి ఆహారపు అలవాట్లు అనేవి పాల మీద ఆధారపడ్డాయి. అందుకే ఎక్కువగా ఆవులను మేపుతుంటారు. మరోవైపు నార్త్ లో సారవంతమైన నదీ మైదానాలు ఎక్కువగా ఉన్న కారణంగా.. అక్కడి వారు పశువుల పెంపకానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఆవుల సంరక్షణ కోసం ప్రత్యేకంగా ఒక కులాన్ని సృష్టించుకున్నారు. మరోవైపు దక్షిణాది ప్రజలు, పాల గురించి ఎటువంటి చరిత్ర లేదు. దక్షిణాదిలో పోల్చుకుంటే ఆవుల పెంపకం అనేది ఉత్తరాదిన ఎక్కువ. డెయిరీ ఫార్మ్స్ ఎక్కువగా అక్కడే ఉంటాయి.
గేదె పాలు, ఆవు పాలు వినియోగం ప్రకారం ఎలా చూసుకున్నా గానీ దక్షిణాది రాష్ట్రాల కంటే ఉత్తరాది, పశ్చిమ రాష్ట్రాల్లోనే ఎక్కువ. అయితే సౌత్ ఇండియాతో పోలిస్తే నార్త్ ఇండియాలో ఎక్కువగా ఆవు పాల ఉత్పత్తులు వినియోగించడానికి కారణం వాతావరణం. దక్షిణాది రాష్ట్రాల్లో చూసుకుంటే.. ఇక్కడ వేడి, తేమ వాతావరణం కారణంగా దక్షిణాది ఆవులు తమ శరీరంలో కొవ్వుని నిల్వ చేసుకోలేవు. కాబట్టి పాల ఉత్పత్తి తక్కువ. దక్షిణాది ఆవులు రోజుకు 5 లీటర్ల పాలు మాత్రమే ఇస్తాయి. అదే ఉత్తరాది, పశ్చిమ రాష్ట్రాలకు చెందిన ఆవులు ఐతే రోజుకు 10 నుంచి 20 లీటర్ల వరకూ పాలిస్తాయి. మన ఆవులు తక్కువ పాలు ఇవ్వడం వల్ల గేదె పాలను వినియోగిస్తారు. అది కూడా మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తక్కువే.
ఎక్కువ పాల దిగుబడి ఇస్తుందన్న కారణంగానే కాకుండా ఇతర కారణాల వల్ల కూడా ఆవు పాలను నార్త్ వాళ్ళు ఎక్కువగా వినియోగిస్తారు. ఆవు పాలతో పోలిస్తే గేదె పాలలో 100 శాతం అధికంగా కొవ్వు ఉంటుంది. అలానే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. అందుకే నార్త్ వాళ్ళు ఆవు పాలను ఎక్కువగా వినియోగిస్తారు. ఎందుకంటే వారి ఆహారపు అలవాట్లు అనేవి మొదటి నుంచీ కూడా పాల మీదనే ఆధారపడి ఉన్నాయి కాబట్టి. గేదె పాల కంటే ఆవు పాలు ఎక్కువ నిల్వ సామర్థ్యం కలిగి ఉండడం వల్ల ఆవు పాలను ఎక్కువగా వినియోగిస్తారు. ఆవు పాలలో తక్కువ కొవ్వు, అధిక ప్రోటీన్ ఉండడం.. ఆ పాలను వెన్న లేదా నెయ్యి రూపంలో మార్చి దాచుకునే అలవాట్లు లేని కారణంగా మన దక్షిణాది రాష్ట్రాల్లో ఆవు పాల వినియోగం తక్కువగా ఉంటుంది. అలానే పాలతో చేసే ఉత్పత్తులు ఎక్కువగా తినరు కాబట్టి నిల్వ ఉంచుకోవాల్సిన అవసరం ఉండదు. ఎప్పటికప్పుడు కాఫీ, టీ తాగడానికి, పెరుగు కోసం ఐతే గేదె పాలు ఎలాగూ ఉన్నాయి. పైగా ఆవులతో పోలిస్తే గేదెలు ఎక్కువ పాలు ఉత్పత్తి చేస్తాయి. ఈ కారణంగా ఆవు పాలు సౌత్ ఇండియన్స్ తక్కువగా వాడతారు. సౌత్ ఇండియన్స్ కి టీ, కాఫీలు తాగే అలవాటు ఎక్కువగా ఉండడం వల్ల గేదె పాలు ఎక్కువగా తాగుతారు.
ఆవు పాలతో పోలిస్తే గేదె పాలలో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. కానీ క్యాలరీలు, కొవ్వు ఎక్కువగా ఉంటాయి. ఎముకల బలానికి, దంత ఆరోగ్యానికి, హృదయనాళ ఆరోగ్యానికి, బరువు పెరగడానికి గేదె పాలు తోడ్పడతాయి. గేదె పాలలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. అలానే మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు ఉంటాయి.
ఇక ఆవు పాలలో కూడా అనేక రకాల ఖనిజాలు, ప్రోటీన్లు, కాల్షియం ఉంటాయి. ఆవు పాలలో కొలెస్ట్రాల్ అధికంగా, కొవ్వు తక్కువగా ఉంటుంది. ఎముకల బలానికి, దంత ఆరోగ్యానికి, పిల్లల్లో ఊబకాయాన్ని తగ్గించడానికి, థైరాయిడ్ వ్యాధుల నుంచి రక్షించడానికి, హృదయనాళ ఆరోగ్యానికి ఆవు పాలు ఎంతగానో మేలు చేస్తాయి.
సౌత్ మినహాయిస్తే దేశంలో మిగతా ప్రాంతాల్లో, అలానే మిగతా దేశాల్లో ఒక ఆవు రోజుకు 15 నుంచి 20 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తుంది. అయితే ఏ ప్రాంతంలో అయినా గేదె మాత్రం రోజుకు 7 నుంచి 11 లీటర్ల పాలు మాత్రమే ఇస్తుంది. ఈ లెక్కలను దృష్టిలో పెట్టుకునే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఆవుల డెయిరీలను రన్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆవు పాల ఉత్పత్తి మొదటి స్థానంలో ఉంటే.. గేదె పాల ఉత్పత్తి రెండవ స్థానంలో ఉంది. 2023 లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఆవు పాల ఉత్పత్తి 143 మిలియన్ మెట్రిక్ టన్నులైతే.. గేదె పాల ఉత్పత్తి 75 మిలియన్ మెట్రిక్ టన్నులు మాత్రమే. గేదె పాల వినియోగం అనేది ప్రపంచంలో చాలా దేశాల్లో పెద్దగా ఉండదు. అయినప్పటికీ ప్రపంచ దేశాల్లో ఆవు పాల తర్వాత ఎక్కువగా ఉత్పత్తి అయ్యేది గేదె పాలే.
సాంప్రదాయ పెరుగు, కాటేజ్ జున్ను, పన్నీర్, కోవా, నెయ్యి వంటివి చేయడానికి గేదె పాలు తగినవి. ఎందుకంటే గేదె పాల నుంచి చిక్కని మీగడ వస్తుంది. ఇక ఆవు పాలలో మీగడ తక్కువగా ఉంటుంది. ఆవు పాలతో పెరుగు, స్వీట్స్, చీజ్ వంటివి తయారు చేస్తారు. దక్షిణాసియా దేశాలైన ఇండియా, పాకిస్తాన్ దేశాల్లో.. అలానే ఇటలీలో గేదె పాల వినియోగం ఎక్కువ. ఐతే ప్రపంచవ్యాప్తంగా మాత్రం ఎక్కువగా వాడేది ఆవు పాలే. మరి మీరు ఏ పాలను ఇష్టపడతారు? ఆవు పాలా? గేదె పాలా? మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.