యుద్ధంలో అమరుడయ్యాడని పరమవీర చక్ర! చైనా నుంచి తిరిగి వచ్చిన మేజర్ కథ!

భారత్, చైనాల మధ్య యుద్ధంలో శత్రువులతో పోరాడి అమరుడయ్యాడని ఓ మేజర్ కు అప్పటిలో ప్రభుత్వం పరమవీర చక్రన్ని ప్రకటించింది. కానీ, అంత చనిపోయారనుకున్న ఆ మేజర్ చైనా నుంచి తిరిగి స్వదేశానికి వచ్చాడు. అయితే నేడు ఆయన జన్మదినం సందర్భంగా.. ఆయన జీవితగాథను, ధైర్య సాహసాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

భారత్, చైనాల మధ్య యుద్ధంలో శత్రువులతో పోరాడి అమరుడయ్యాడని ఓ మేజర్ కు అప్పటిలో ప్రభుత్వం పరమవీర చక్రన్ని ప్రకటించింది. కానీ, అంత చనిపోయారనుకున్న ఆ మేజర్ చైనా నుంచి తిరిగి స్వదేశానికి వచ్చాడు. అయితే నేడు ఆయన జన్మదినం సందర్భంగా.. ఆయన జీవితగాథను, ధైర్య సాహసాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

భారతదేశ స్వాతంత్య్రం కోసం దశాబ్ద కాలంలో ఎందరో మహానుభావులు పోరాటం చేశారు. ఇక తమ పోరాట పటిమను, తెగువను చూపించడామే కాకుండా.. భారత దేశ స్వాతంత్రం కోసం ఎంతోమంది వీరనారిమణులు తమ ప్రాణాలను సైతం ఆర్పించారు. అయితే ఇలా పవిత్రమైన భారతమాత కోసం ఎందరో మహానభావులు ప్రాణత్యాగం చేయడంతో.. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఇక భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది మొదలు.. మన దేశం భూభాగాన్ని ఆక్రమించుకోవాలని పొరుగు దేశమైన చైనా పెద్ద ఎత్తునే ఆలోచనలు చేసింది. ఈ క్రమంలోనే.. 1962 లో చైనా, భారత్ పై దాడికి కూడా దిగింది. అయితే ఈ యుద్ధంలో భారత సైనికుల కంటే.. చైనా సైనికులు కంటే తక్కువగానే ఉన్నారు. అయినప్పటికీ పొరుగు దేశమైన చైనా జవాన్లను మన దేశ సైనికులు చుక్కలు చూపించారు. ఇక ఈ యుద్ధంలో భారీ నష్టాన్ని కలిగించారు. అయితే ఈ యుద్ధంలో అమరుడైన ఓ సైనికుడికి.. భారత ప్రభుత్వం ‘పరమవీర చక్ర‘ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అలాగే ఆ సైనికుడి కుటుంబ సభ్యులు కూడా అతడికి అంత్యక్రియలు నిర్వహించారు. కానీ, అందరూ చనిపోయారని భావించిన ఆ భారత సైనికుడు మరణాన్ని తప్పించుకొని తన స్వదేశానికి తిరిగి వచ్చాడు. ఇంతకి ఆ వీర సైనికుడు మరెవరో కాదు.. అతడే ‘మేజర్ ధన్ సింగ్ థాపా’. నేడు ఆయన జన్మదినం సందర్భంగా.. ఆయన జీవితగాథను, ధైర్య సాహసాలను గురించి తెలుసుకుందాం.

భారత లెఫ్టినెంట్ కల్నల్.. ‘ధన్ సింగ్ థాపా‘. ఈయన 1928, ఏప్రిల్ 10వ తేదీన సిమ్లాలో జన్మించారు. అతని తల్లిదండ్రులది నేపాలీ మూలాలు. 1/8 గూర్ఖా రైఫిల్స్ బెటాలియన్‌లో భాగం కావడంతో.. 1949 ఆగస్టు 28న సైన్యంలో ధన్ సింగ్ థాపా ప్రయాణం ప్రారంభమైంది. ఇక 1962లో చైనా, భారత్ యుద్ధం సమయంలో.. మేజర్ ధన్ సింగ్ పాంగోంగ్ సరస్సుకు ఉత్తరాన ఉన్న సిరిజాప్ వ్యాలీలో ఒక ప్లాటూన్‌కు నాయకత్వం వహిస్తున్నారు.కాగా, అక్కడ ఉన్న మిలిటరీ పోస్ట్ చుషుల్ ఎయిర్‌ఫీల్డ్ రక్షణకు చాలా ముఖ్యమైనది. అయితే.. భారత్, చైనాల మధ్య సరిహద్దు వివాదం అనేది 1950లో నుంచి కొనసాగుతోంది. ఇక ఆ వివాదం కాస్త 1962 నాటికి.. రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. కాగా, ఈ యుద్ధంలో మేజర్ ధన్ సింగ్ లడఖ్‌లోని ఫార్వర్డ్ పోస్ట్ ‘సిరిజాప్’ కి కమాండర్‌గా ఉన్నాడు. ఇక ప్రభుత్వ నివేదిక ప్రకారం.. 1962, అక్టోబర్ 21 తేదీ తెల్లవారుజామున చైనా సైనికులు.. ఫిరంగులు , మోర్టార్లతో భారత్ పోస్ట్‌పై పెద్ద ఎత్తున బాంబుల దాడి చేయడం ప్రారంభించారు. అప్పుడు మేజర్ ధన్ సింగ్ నాయకత్వంలో.. భారతీయ సైనికులు, శత్రువుల కంటే చాలా తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ, దాడిని ఎదురించి.. శత్రువులకు భారీ నష్టాన్ని కలిగించారు. ఇలా చైనా రెండోసారి కూడా దాడి చేసి చైనా తమ ప్రణాళికల్లో విఫలమయ్యింది.

ఇక మూడవసారి దాడి చేసే సమయంలో.. చైనా పదాతిదళానికి సహాయం చేయడానికి ట్యాంకులు కూడా రంగంలోకి దిగాయి. అయితే, అప్పటికే భారత సైనికుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. దీంతో మేజర్ ధన్ సింగ్ పట్టు వదలకుండా చివరి క్షణం వరకు పోరాడుతూనే ఉన్నాడు. కానీ, చైనా సైనికులు పోస్ట్ ను స్వాధీనం చేసుకున్న సమయంలో.. మేజర్ ధన్ సింగ్ చాలా మంది చైనా జవాన్లను తన చేతులతో సంహరించాడు. అలా చివరకు ధన్ సింగ్ ను శత్రువులు బంధించే ముందు వరకు అతను శత్రువులతో పోరాడి సంహరిస్తునే ఉన్నాడు. అయితే ఆ యుద్ధంలో మరణించరని అనుకున్న మేజర్ మేజర్ ధన్ సింగ్ ను.. చైనా సైనికులు బంధించారు. కానీ, ఈ విషయం భారత సైన్యానికి తెలియలేదు. పైగా పోస్ట్‌పై విధ్వంసక దాడి తర్వాత.. గూర్ఖా సైనికులందరూ అమరులయ్యారని భావించారు. ఇక ప్రభుత్వ నివేదిక ప్రకారం.. మేజర్ ధన్ సింగ్ థాపా కుటుంబం అతనికి అంత్యక్రియలను కూడా చేసింది. అలాగే భారత ప్రభుత్వం ధన్ సింగ్ మరణానంతరం.. పరమవీర చక్ర ఇవ్వనున్నామని ప్రకటించింది. కాగా, ఈ పరమ వీర చక్రం అనేది భారతదేశంలో త్రివిధ దళాలలో పనిచేసే సైనికులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం కావడం విశేషం.

కాగా, రెండు దేశాల మధ్య యుద్ధం ముగిసిన తర్వాత.. చైనా ప్రభుత్వం యుద్ధ ఖైదీల జాబితాను భారత్ కు పంపింది. అయితే ఆ జాబితాలో.. ధన్ సింగ్ పేరు కూడా ఉంది. ఇక జాబితాలో ఆయన పేరు కూడా ఉండటంతో.. అతని కుటుంబం ఎంతగానో సంతోషించింది. ఇక ధన్ సింగ్ చైనా దేశం చెరా నుంచి విడుదలై భారతదేశానికి 1963 మే 10 న చేరుకున్నాడు. అప్పుడు ధన్ సింగ్ కు ఆర్మీ ప్రధాన కార్యాలయంలో ఘనంగా స్వాగతం పలికారు. అంతేకాకుండా.. మేజర్ ధన్ సింగ్ అప్పటికి కూడా ఇంక సైన్యంలో భాగంగానే ఉన్నాడు. ఈ క్రమంలోనే.. అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చేతుల మీదుగా మేజర్‌ ధన్ సింగ్ కు పరమవీరచక్ర అవార్డును ప్రదానం చేశారు. ఇక కొంతకాలానికి లెఫ్టినెంట్ కల్నల్‌గా ధన్ సింగ్ థాపా పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత ధన్ సింగ్ 77 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు 2005, సెప్టెంబర్ 5న మరణించారు. మరి, భారత్ చైనా మధ్య యుద్ధంలో పోరాడి, ప్రభుత్వం చేత పరమవీరచక్ర అవార్డును పొందిన మేజర్ ధన్ సింగ్ థాపా పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments