iDreamPost
android-app
ios-app

Y Chromosome: ఎక్కువగా ఆడపిల్లలే ఎందుకు పుడుతున్నారు? ఇకపై మగజాతి ఉండదా?

  • Published Aug 27, 2024 | 5:28 PM Updated Updated Aug 27, 2024 | 5:43 PM

Y Chromosome, Male Gene, X Chromosome: మగ జెండర్‌ను నిర్ధారించే జన్యువులు కలిగే ఉండే వై క్రోమోజోములు క్షీణించిపోతుండటం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఆడపిల్లలు ఎక్కువగా పెట్టడం, మగ పిల్లలు పుట్టకపోవడానికి ఇదే కారణం.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Y Chromosome, Male Gene, X Chromosome: మగ జెండర్‌ను నిర్ధారించే జన్యువులు కలిగే ఉండే వై క్రోమోజోములు క్షీణించిపోతుండటం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఆడపిల్లలు ఎక్కువగా పెట్టడం, మగ పిల్లలు పుట్టకపోవడానికి ఇదే కారణం.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

  • Published Aug 27, 2024 | 5:28 PMUpdated Aug 27, 2024 | 5:43 PM
Y Chromosome: ఎక్కువగా ఆడపిల్లలే ఎందుకు పుడుతున్నారు? ఇకపై మగజాతి ఉండదా?

గతంలో ఆడపిల్లల సంఖ్య తక్కువగా ఉంది.. పెళ్లి చేసుకోవడానికి పిల్ల దొరకడం లేదని చాలా మంది కుర్రాళ్లు, పెళ్లీడుకొచ్చిన అబ్బాయిల తల్లిదండ్రులు బాధపడేవారు. ఆడ పిల్ల వద్దు అనుకుని, లింగనిర్ధారణ చేయించుకొని అబార్షన్‌ చేయించుకోవడం, పేదరికం ఇలా అనేక కారణాల వల్ల పిల్లల పుట్టుక నిష్పత్తిలో ఆడ పిల్లల సంఖ్య తగ్గుతూ వచ్చింది. కానీ, రాను రాను మగ పిల్లల సంఖ్య తగ్గిపోనుంది. పుట్టే వాళ్లంతా ఆడపిల్లలే పుట్టే రోజులు వస్తాయని తాజా అధ్యాయనం ఓ పిడుగులాంటి వార్త వెలుగులోకి తెచ్చింది. ఇప్పటికే ప్రతి 10 మందిలో ఆరు నుంచి ఏడుగురు ఆడపిల్లలే పుడుతున్నారు. మరికొన్ని సంవత్సరాల్లో ఈ సంఖ్య మరింత పెరిగి.. పూర్తిగా ఆడపిల్లలే పుడతారని, మగ పిల్లలు పుట్టరని అధ్యాయనం వెల్లడించింది.

కారణం ఏంటి?

మగ పిల్లలు పుట్టేందుకు కారణం అయ్యే ‘Y క్రోమోజోమ్‌’ క్షీణిస్తుండటమే ఇందుకు ప్రధాన కారణం. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం నుంచి ఈ Y క్రోమోజోమ్‌ పరిమాణంలో కీణిస్తూ వస్తుంది. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం Y క్రోమోజోములో 900 జన్యువులు ఉంటే.. ఇప్పుడు వాటి సంఖ్య 55కు పడిపోయింది. అలా తగ్గుకుంటూ పోయి.. చివరికి వై క్రోమోజోములు పూర్తిగా అదృశ్యమయ్యే ప్రమాదం ఉంది. అప్పుడు కేవలం ఆడపిల్లలు మాత్రమే పుడుతూ ఉంటారు. ఈ విషయం నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రోసీడింగ్స్‌లో భాగంగా వెల్లడైన అధ్యాయనంలో పేర్కొన్నారు.

Boys

Y క్రోమోజోమ్ అంటే ఏంటి?

పురుషుడి నుంచి విడుదల అయ్యే స్పెర్మ్‌.. మహిళలో ఉండే అండంతో జతకడితే.. ఆ అండం అభివృద్ధి చెంది పిండంగా మారుతుంది. అయితే.. ఆ పిండం ఆడా లేదా మగా అనేది X, Y క్రోమోజోముల వల్ల డిసైడ్‌ అవుతుంది. అండంలో ఎల్లప్పుడూ X క్రోమోజోమ్‌ ఉంటుంది. పురుషుడి నుంచి రిలీజ్‌ అయ్యే స్పెర్మ్‌లో X లేదా Y క్రోమోజోమ్ ఉండవచ్చు. గుడ్డును ఫలదీకరణం చేసే స్పెర్మ్‌లో X క్రోమోజోమ్ ఉంటే ఆడపిల్ల, Y క్రోమోజోమ్ ఉన్నట్లయితే మగ పిల్లాడు పుడతారు. ఆడవారికి రెండు X క్రోమోజోమ్‌లు ఉంటే, మగవారికి ఒక X, ఒక Y క్రోమోజోమ్‌లు ఉంటాయి. X క్రోమోజోమ్ Y క్రోమోజోమ్ కంటే పెద్దది. X క్రోమోజోమ్‌లో దాదాపు 1,000 జన్యువులు ఉంటే, Y క్రోమోజోమ్‌లో కేవలం 55 జన్యువులు మాత్రమే ఉంటాయి. X క్రోమోజోమ్‌లో ఉండే జన్యువులు శిశువు రోగనిరోధక పనితీరు, మెదడు అభివృద్ధి, దృష్టితో సహా అనేక రకాల విధులకు బాధ్యత వహిస్తాయి. Y క్రోమోజోమ్ ప్రధానంగా పురుషుల లైంగిక అభివృద్ధిలో పాల్గొనే జన్యువులను కలిగి ఉంటుంది.

మరి సృష్టి ఎలా నడుస్తుంది?

పురుషుడి వీర్యంలో Y క్రోమోజోమ్‌లోని జన్యువులు క్షీణించిపోతుండటంతో.. రాను రాను ఆడపిల్లలే పుడుతుంటే.. వారు ఎవరిని పెళ్లి చేసుకోవాలి. మగ పిల్లలు లేకుండా ఎలా? అసలు ఈ సృష్టి ఎలా ముందుకు వెళ్తుంది అనేది ఇప్పుడు ప్రధాన సమస్య. ఈ సృష్టి నడవాలంటే.. ఆడా, మగా ఇద్దరు ముఖ్యమే. ఒకరు ఎక్కువా కాదు ఇంకొకరు తక్కువా కాదు. ఇద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా.. మానవ జాతి మనుగడ సాగించలేదు. మరి ఈ Y క్రోమోజోములు తగ్గిపోతుండటంతో మగ పిల్లలు పుట్టడం కూడా తగ్గిపోతుంది. అప్పుడు ఎలా అనే ప్రశ్న అందరిలో ఉత్పన్నం అవుతుంది? దీనిపై ఇంకా పరిశోదనలు జరుగుతున్నాయి..

అయితే.. ఇలాంటి సమస్య మానవుల్లో కంటే ముందు స్పైనీ ఎలుకల్లో కూడా తలెత్తింది. కానీ, తర్వాత తర్వాత వాటిలో కొత్త రకం పురుష లింగాన్ని నిర్దారించే జన్యువు అభివృద్ధి చెందింది. మానవుల్లో కూడా Y క్రోమోజోమ్‌లు క్షీణించిపోతుంటే.. మగ పిల్లలు పుట్టేందుకు కొత్త రకం జన్యువు ఏదైన అభివృద్ధి చెందవచ్చని అభిప్రాయపడుతున్నారు. అయితే.. ఇప్పటికి ఇప్పుడు Y క్రోమోజోములు క్షీణించిపోవడం అంటూ జరగదు. మరో 11 మిలియన్‌ సంవత్సరాలు.. అంటే దాదాపు కోటీ పది లక్షల ఏళ్లు పట్టొచ్చు. కానీ, శాస్త్రవేత్తల్లో మాత్రం ఇది ఆందోళనను రేకెత్తిస్తోంది. మరి ఈ అధ్యాయనంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.