Dharani
చలికాలంలో కొందరు తరచుగా దగ్గు, జలుబు బారిన పడతారు. శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గడమే ఇందుకు కారణం. మరి ఈ ఇబ్బందులను నుంచి తప్పించుకోవాలంటే.. ఏం తినాలో ఇక్కడ తెలుసుకొండి
చలికాలంలో కొందరు తరచుగా దగ్గు, జలుబు బారిన పడతారు. శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గడమే ఇందుకు కారణం. మరి ఈ ఇబ్బందులను నుంచి తప్పించుకోవాలంటే.. ఏం తినాలో ఇక్కడ తెలుసుకొండి
Dharani
చలికాలం వచ్చిందంటే చాలు.. అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఉదయం లేవాలంటే బద్దకం. వెచ్చగా అలానే పడుకోవాలి అనిపిస్తుంది. ఆహారం విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. వేడి వేడిగా కడుపులో ఏదైనా పడితే.. ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఇక చలికాలంలో ఇలాంటి ఎంజాయ్‌మెంట్‌తో పాటు.. దగ్గు, జలుబు, జ్వరం వంటి జబ్బులు తరచుగా వచ్చి చికాకు పెడుతుంటాయి. మరీ ముఖ్యంగా చలి తీవ్రత పెరిగినప్పుడు గాల్లో వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటుంది. రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వారు చలికాలంలో తరచుగా జబ్బు పడతారు. మరీ ముఖ్యంగా దగ్గు, జలుబు విపరీతంగా ఇబ్బంది పెడతాయి. మరీ చలికాలంలో.. ఇలాంటి జబ్బులు దరిచేరకుండా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగానే చాలామంది ఆకుకూరలు తినడానికి ఇష్టపడరు. కానీ ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ అధికంగా ఉంటాయి. ఆకుకూరల్లో ఫోలిక్ ఆమ్లం కూడా అధికంగానే ఉంటుంది. చలికాలంలో వచ్చే వ్యాధులను నివారించాలంటే.. ఆకుకూరలు ఆహారంలో తప్పనిసరిగా భాగం చేసుకోవాలి. ఆకుకూరల విషయానికి వస్తే.. పాలకూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ పెరగడానికి ఇది ఎక్కువగా దోహదపడుతుంది. కాల్షియం స్థాయి ఎక్కువగా ఉండటంతో కండరాల బలోపేతం అవుతాయి.
చలికాలంలో.. ప్రతి రోజు పాలల్లో చిటికెడు పసుపు వేసుకుని తాగితే చలికాలంలో శరీరానికి కావల్సిన వెచ్చదనాన్ని అందిస్తుంది. అజీర్ణం, జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి.
తులసి, అల్లం, లెమన్‌గ్రాస్‌తో చేసిన హెర్బల్ గ్రీన్ టీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రోజుకు రెండుసార్లు ఈ హెర్బల్ టీని తాగితే చాలా మంచిది.
చలికాలంలో నెయ్యి తీసుకోవడం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. నెయ్యితో రోగనిరోధక శక్తి పెరిగి జలుబు, దగ్గు వంటి సమస్యల బారిన పడరు.
నువ్వుల్లో వేడిని పెంచే గుణం ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఐరన్, కాల్షియం, మాంగనీస్, మెగ్నీషియం, కాపర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కనుక చలికాలంలో వీటిని తీసుకోవడం ఎంతో మంచిది.
దానిమ్మ.. ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచడం, గుండె సంబంధిత వ్యాధుల నుంచి శరీరాన్ని కాపాడటంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచి చలికాలంలో ఎక్కువగా వచ్చే శ్వాసకోశ వ్యాధుల నివారణకు అద్భుతంగా పనిచేస్తుంది.
బెల్లంలో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది రక్తహీనతను తగ్గించడంతో పాటు శరీరంలో వేడిని పెంచుతుంది.
ఇందులో విటమిన్ బీ 3, విటమిన్ ఈ వంటి కీలక పోషకాలు ఉంటాయి. మోనో శాచురేటెడ్ ఫ్యాట్స్ సమృద్ధిగా ఉంటాయి. వీటిని రాత్రి నానాబెట్టుకొని ఉదయాన్నే తీసుకోవడం మంచిది.
చలికాలంలో నారింజ, నిమ్మ, బత్తాయి, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లను ప్రతిరోజూ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెరుగుతుంది. ఈ కాలంలో వచ్చే జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది
జొన్నల ద్వారా శరీరానికి పుష్కలమైన కాల్షియం అందుతుంది. దీనివల్ల కండరాలు బిగుసుకుపోకుండా ఉంటాయి. దాంతో పాటు రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ చలికాలంలో జొన్న రొట్టెలు తింటే చాలా మంచిది అంటున్నారు నిపుణులు.