iDreamPost
android-app
ios-app

వాటర్ బాటిల్ ఎంత వరకు గ్యారెంటీ? నీళ్లు ఎన్నాళ్లకు పాడవుతాయి?

  • Published Mar 16, 2024 | 12:20 PM Updated Updated Mar 16, 2024 | 12:20 PM

Water Bottle: ఈ మద్య ఏదైనా పనిపై బయటకు వెళ్తే వాటర్ బాటిల్ కొనడం కామన్ అయ్యింది. అయితే ఈ వాటర్ బాటిల్ లో నీరు ఎంత ఎప్పటి వరకు సురక్షితం.

Water Bottle: ఈ మద్య ఏదైనా పనిపై బయటకు వెళ్తే వాటర్ బాటిల్ కొనడం కామన్ అయ్యింది. అయితే ఈ వాటర్ బాటిల్ లో నీరు ఎంత ఎప్పటి వరకు సురక్షితం.

  • Published Mar 16, 2024 | 12:20 PMUpdated Mar 16, 2024 | 12:20 PM
వాటర్ బాటిల్ ఎంత వరకు గ్యారెంటీ? నీళ్లు ఎన్నాళ్లకు పాడవుతాయి?

ప్రస్తుతం సమ్మర్ సీజన్ నడుస్తుంది. ఎండలు భగ భగమంటున్నాయి. ఎండవేడితో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. బయట ఎండ వేడి తట్టుకోలే చాలా మంది చల్లని పానియాల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే కూల్ డ్రింగ్స్, మంచినీళ్లు ప్లాస్టీక్ బాటిల్స్ లో లభిస్తున్నాయి. సామాన్యు నుంచి సంపన్నుల వరకు బయట ప్రయాణాలు చేస్తే వాటర్ బాటిల్ కొని తాగేస్తుంటారు. సాధారణంగా నదిలో పారే నీరు ఎప్పటికీ స్వచ్చంగా, శుభ్రంగానే ఉంటుంది.. మరి మూసి వేసిన వాటర్ బాటిల్ నీరు ఎప్పటి వరకు సురక్షితంగా ఉంటుంది.. ఆ నీరు ఎప్పుడు చెడిపోతుంది? దాని గురించి నిపుణులు కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. అవి ఏంటో తెలుసుకుందాం.

సాధారణంగా వాటర్ బాటిల్ కొన్ని తర్వాత చాలా మందికి దానిపై ఉండే గడువు తేదీ చూడటం అలవాటు. అయితే వాటర్ బాటిల్ లోని నీటిని దాని ప్యాకింగ్ తేదీ నుంచి రెండు సంవత్సరాల వినియోగించవొచ్చు. అయితే వాటర్ బాటిల్ ప్లాస్టీక్ అన్న విషయం తెలిసిందే. బాటిల్ లో ప్లాస్టీక్ నెమ్మదిగా నీటిలో కరగడం ప్రారంభమైన రెండేళ్ల తర్వాత ఆ నీరు పాడయ్యే అవకాశం ఉందని తాగడానికి పనికి రాదని శాస్త్రవేత్తలు అంటున్నారు. వాస్తవానికి వాటర్ బాటిల్ పై ఉండే తేది వాటర్ గురించి కాదు.. ఆ బాటిల్ గురించిన తేదీ అని అర్థం అంటున్నారు. వర్డ్ స్కూల్ ఆప్ పబ్లిక్ రీసెర్చ్ నివేదిక ప్రకారం పంపు నీటిని ఆరు నెలల పాటు నిల్వ చేయవొచ్చు. ఆ నీటిని ఉపయోగించవొచ్చు. కాకపోతే కార్పోనేటెడ్ పంపు నీరు నెమ్మదిగా రుచి మారుతుంది.

How much is the water bottle guaranteed

ఆరు నెలల పాటు నిల్వ చేసిన నీటి నుంచి గ్యాస్ నెమ్మదిగా బయటకు వెళ్లిపోతుంది. గాలిలో ఉండే కార్బన్ డయాక్సైడ్ నీటిలో కలిసి కొద్దిగా ఆమ్లంగా తయారవుతుంది. అయితే కంటైనర్లను ఆరు నెలల పాటు చల్లని, పొడి, చీకటి ప్రదేశాల్లో ఉంచితే ఆ నీటి రుచి మారే అవకాశం ఉండదు. నీటిని పావుగంట సేపు మరిగించి ఆ తర్వాత చల్లబర్చిన నీటిని నిల్వ చేయవొచ్చు.  కాచి చల్లార్చిన నీరు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వాటర్ బాటిల్ లో నీటిని ఎప్పటికప్పుడు తాగేస్తే చాలా మంచిదని అంటున్నారు. మరీ ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.