iDreamPost
android-app
ios-app

పీరియడ్స్ బ్లడ్ అశుద్ధమా? ఆడవారిపై 3 రోజులు ఇన్ని రూల్స్ ఎందుకు?

  • Published Apr 10, 2024 | 6:50 PM Updated Updated Apr 10, 2024 | 6:50 PM

Womens Life Style: రుతుస్రావం సమయంలో మహిళలు ఇళ్ల లోపలికి ప్రవేశించకూడదని, అలాగే ఇంట్లో ఓ మూలనా కూర్చోవలని, దేనిని ముట్టాకూడదని నియమలు తరతరాలుగా పాటిస్తున్నారు. అయితే, ఈ నియమ నిబంధనలను ఎందుకు పెట్టారు..? ఎవరు పెట్టారు..? అనే సందేహాలు చాలామందిలో రేకెత్తిస్తుంటాయి. అయితే ఇలా మహిళలకు ఋతుస్రావం సమయంలో పెట్టిన నియమాల వెనుక కొన్ని శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. మరి అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Womens Life Style: రుతుస్రావం సమయంలో మహిళలు ఇళ్ల లోపలికి ప్రవేశించకూడదని, అలాగే ఇంట్లో ఓ మూలనా కూర్చోవలని, దేనిని ముట్టాకూడదని నియమలు తరతరాలుగా పాటిస్తున్నారు. అయితే, ఈ నియమ నిబంధనలను ఎందుకు పెట్టారు..? ఎవరు పెట్టారు..? అనే సందేహాలు చాలామందిలో రేకెత్తిస్తుంటాయి. అయితే ఇలా మహిళలకు ఋతుస్రావం సమయంలో పెట్టిన నియమాల వెనుక కొన్ని శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. మరి అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Published Apr 10, 2024 | 6:50 PMUpdated Apr 10, 2024 | 6:50 PM
పీరియడ్స్ బ్లడ్ అశుద్ధమా? ఆడవారిపై 3 రోజులు ఇన్ని రూల్స్ ఎందుకు?

భారతదేశంలోని చాలామంది హిందువులు తరతరాలుగా ఎన్నో నియమ నిబంధనలు పాటిస్తూ వాటికి కట్టుబడి జీవిస్తుంటారు. అసలు నియమా నిబంధనలు, కట్టుబాట్లు లేనిదే ఏ మనిషి సమాజంలో జీవించలేడు. మరి అలాంటి నియమ నిబంధనల్లో స్త్రీ బహిష్టు కూడా ఒకటి. ఒక స్త్రీ బహిష్టు అయ్యే సమయంలో.. ఇంట్లోకి రాకూడదాని, ఓ మూలన కూర్చొవలని నియమాన్ని తరతరాలుగా పాటిస్తున్న విషయం తెలిసిందే. అసలు స్త్రీలలో రుతుక్రమం అనేది సహజమైన ప్రక్రియ. ఇలా ప్రతి మహిళ జీవన విధానంలో భాగమైన రుతుస్రావ ప్రక్రియ గురించి పురాతన కాలం నుంచి.. అనేక నమ్మకాలు, ఆచారాలు కొనసాగుతునే ఉన్నాయి. ఇక రుతుస్రావం సమయంలో.. ఆ స్త్రీకి ఎలాంటి సౌకార్యలు కల్పించకుండా.. అంటరాని తనంగా భావిస్తుంటారు.అంతేకాకుండా..భారతదేశంలో టెక్నాలాజీ అభివృద్ధి చెందుతున్న కాలంలో కూడా ఇప్పటికి.. ఓ మహిళ ఋతుస్రావం సమయంలో చాలామంది అపవిత్రంగానే చూస్తుంటారు. అసలు ఓ మహిళ ఋతుస్రావం సమయంలో ఇంట్లోకి రాకూడదని, మూలన కూర్చోవలనే నిబంధనలు ఎందుకు పెట్టారు..? ఎవరు పెట్టారు..? అనే సందేహాలు చాలామందిలో రేకెత్తిస్తుంటాయి. అయితే ఇలా మహిళలకు ఋతుస్రావం సమయంలో పెట్టిన నియమాల వెనుక కొన్ని శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. మరి అవి ఏంటో తెలుసుకుందాం.

రుతుస్రావం సమయంలో మహిళలు ఇళ్ల లోపలికి ప్రవేశించకూడదని, అలాగే ఇంట్లో ఓ మూలనా కూర్చోవలని, దేనిని ముట్టాకూడదని నియమలు పాటిస్తుంటారు. అయితే, ఈ నియమ నిబంధనలను ప్రస్తుత కాలంలో కూడా చాలా ఇళ్లలో పాటిస్తుంటారు. మరి అలాంటి రుతుస్రావం సమయంలో.. స్త్రీకి ఎలాంటి సౌకర్యం కల్పించకుండా.. దూరంగా ఉంచి అపావిత్రంగా భావిస్తుంటారు. అలాంటి సమయంలో మహిళలు సరైన సౌకర్యాలు లేక తరతరాలుగా పాటిస్తున్న నియమ నిబంధనలను పాటించలేక చాలా సతమతమవుతారు. ఇప్పటికి ఈ నిబంధనలు ఎవరు పెట్టారురా బాబు అంటూ.. చాలా ఇళ్లలో తిట్టుకుంటారు. కానీ, నిజానికి రుతుస్రావం సమయంలో మహిళలకు పెట్టే నిబంధనల వెనుక కొన్ని శాస్త్రీయ కారణాలు ఉన్నాయి.

ఎందుకంటే.. సాధారణంగా ఋతుస్రావం సమయంలో స్త్రీ శరీరంలో చాలా హార్మోన్లు మారుతాయి. దీని వల్ల ఆమెకు చిరాకు, కోపం వస్తుంది. ఆమె మనసు ప్రతికూలతతో నిండిపోయి ఉంటుంది. ఆ సమయంలో మహిళలు సాధారణ రోజు కంటే మనస్సు కొద్దిగా భిన్నంగా ఉంటుంది. అప్పుడుు వంటగదిలో నిల్చోని వంట చేయడం, ఇంట్లో ఉన్న పనులు చేయడం చాలా కష్టంగా ఉంటుంది. అయితే అలా మహిళలు ఇబ్బంది పడకూండా.. విశ్రాంతి తీసుకోవడానికి వంటింటికి రావద్దని చెప్పేవారు. అలా విశ్రాంతి తీసుకోవడం వలన మహిళలో కాస్తా ప్రశాంతంతా లభిస్తుందని, అలసట, చీరాకు వంటి నుంచి కొంత ఉపశమనం లభిస్తుందనే కారణంతో.. మహిళలకు ఇంటికి రాకూడదని, ఓ మూలానే కూర్చొవాలని, ఏ వస్తువులను ముట్టుకోకూడదని కొన్ని నియమ నిబంధనలు పెట్టేవారు.

అయితే ఆ నియమాలు కాస్త.. మూఢనమ్మకాలుగా భావించి నాటి నుంచి నేటి వరకు స్త్రీని రుతుస్రావం సమయంలో అపవిత్రంగానే చూస్తున్నారు. నిజానికి ప్రతి స్త్రీలలో అది ఒక సహజంగా జరిగే ప్రక్రియ. అలాంటి సహజ ప్రక్రియను అపవిత్రంగా.. అంటరానితనంగా భావించడం చాలా తప్పు. హిందూ సంప్రదాయాల్లో ఉన్న నియమ, నిబంధనలు ధర్మంగా.. ఆచారించడం మంచిందే. కానీ, ఇలా మూఢనమ్మకాలతో.. లేని పోని అపోహాలకు పోవడం ఎంతవరకు సరియైనది కాదనీ, చాలామంది నిపుణులు చెబుతున్నారు.