iDreamPost
android-app
ios-app

ఇలాంటి అరటి పండు తింటున్నారా? ఆ యముడు కూడా మిమ్మల్ని తీసుకెళ్లలేడు!

  • Published Apr 01, 2024 | 5:51 PM Updated Updated Apr 01, 2024 | 5:51 PM

తినే ఆహారపదార్ధలలో అనేక రకాల ప్రోటీన్స్, ఉంటాయని అందరికి తెలిసిందే. ఫ్రూట్స్ లో ముఖ్యంగా అరటిపండు వలన ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి. అయితే మీరు ఎలాంటి అరటిపండ్లను తింటే ఆయుష్షు పెరుగుతుందో తెలుసా..

తినే ఆహారపదార్ధలలో అనేక రకాల ప్రోటీన్స్, ఉంటాయని అందరికి తెలిసిందే. ఫ్రూట్స్ లో ముఖ్యంగా అరటిపండు వలన ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి. అయితే మీరు ఎలాంటి అరటిపండ్లను తింటే ఆయుష్షు పెరుగుతుందో తెలుసా..

  • Published Apr 01, 2024 | 5:51 PMUpdated Apr 01, 2024 | 5:51 PM
ఇలాంటి అరటి పండు తింటున్నారా? ఆ యముడు కూడా మిమ్మల్ని తీసుకెళ్లలేడు!

శరీరానికి పోషకాలను అందించడంలో.. కూరగాయలతో పాటు.. పండ్లు కూడా ముఖ్య పాత్రను పోషిస్తాయి. అయితే, వీటి అన్నిటిలో అరటిపండు శరీరానికి మేలు చేయడంలో ఎలాంటి పాత్ర పోషిస్తుందో అందరికి తెలుసు. మన దేశంలో నిత్యం అత్యధికంగా పండించే పంటలలో అరటి పంట ఒకటి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వారు వరకు అందరికి.. అరటి పండ్లు మేలు చేస్తూనే ఉంటాయి. పైగా మిగిలిన పండ్లతో పోల్చుకుంటే.. అరటి పండ్లు కాస్త తక్కువ ధరకే లభిస్తాయి. అంతేకాకుండా ఇవి శరీరానికి మంచి ఎనర్జీని కూడా ఇస్తాయి. ఇవన్నీ అందరికి తెలిసిన విషయమే అయితే, అసలు విషయం ఏంటంటే .. మచ్చలు ఉన్న అరటిపండ్లు తినొచ్చా లేదా అని. దాని గురించి తెలుసుకుందాం.

అరటి పండ్లు అతి మధురంగా ఉంటాయి కాబట్టి .. వీటిని ఇష్టపడని వారంటూ ఉండరు. కానీ చాలా మంది మాత్రం తొక్కను చూసి పండు తినాలా వద్దా అని డిసైడ్ అవుతూ ఉంటారు. అంటే అరటి పండు పైన ఉన్న తొక్క మంచి రంగులో.. నిగనిగలాడుతుందంటే.. పండు బావునట్లు.. వాటిపై కొంచెం చిన్న చిన్న మచ్చలు ఉన్నా కూడా.. అవి కుళ్లిపోయినట్లు భావిస్తారు. వాటిని తినడానికి కూడా ఇష్టపడరు. పైగా వాటిని తినడం వలన ఆరోగ్యం పాడవుతుందని భావిస్తారు. కానీ అవన్నీ ఒట్టి అపోహలు మాత్రమేనని .. వాటిలో ఏ వాస్తవం లేదని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అసలు నల్ల మచ్చలు ఎందుకు వస్తాయంటే.. కేవలం అవి ఎక్కువగా మగ్గడం వలెనే అలా నల్ల మచ్చలు వస్తాయని చెబుతున్నారు. అవి శరీరానికి ఎటువంటి హాని కలిగించవని.. ఆ నల్లని మచ్చలు టీఎన్ఎఫ్ ఫ్యాక్టరీకి సంకేతమని ఓ రీసెర్చ్ లో తేలింది.

Banana

అంటే ఇవి.. ట్యూమర్ నికోటర్ నికోటిన్ ఫ్యాక్టర్ అని చెబుతారు. దాని అర్ధం ఏంటంటే.. రక్తంలోని క్యాన్సర్ కణాలను నియంత్రించడంలో ఇవి సహాయపడతాయని అర్ధం. ఇంకా పూర్తిగా చెప్పాలంటే బాగా మగ్గిన అరటిపండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు నిండుగా ఉంటాయి. కాబట్టి వాటిని తినడం వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయని నిపుణులు అంటున్నారు. అలాగే జీర్ణక్రియను వేగవంతం చేయడానికి అరటి పండుకు మించిన ఔషధం మరొకటి లేదు. వీటిలో పొటాషియం, విటమిన్ సి, విటమిన్ బీ6, మెగ్నీషియం, మాంగనీసు, రాగి, బయోటిన్ వంటి విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి . కాబట్టి, మచ్చలున్న అరటిపండ్లు తినడం మంచిది కాదు అన్న అపోహలు వదిలేసి.. అందరు మగ్గిన అరటిపండ్లు తింటే.. ఏ అనారోగ్యం మిమ్మల్ని ఏమి చేయలేదన్నమాట. మరి, ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.