iDreamPost
android-app
ios-app

Ration Rice: అమాయకంగా రేషన్ బియ్యం అమ్మేసుకుంటున్నారా? మీరు నష్టపోతున్నట్టే!

  • Published Mar 11, 2024 | 3:10 PM Updated Updated Mar 15, 2024 | 12:35 PM

మన దగ్గర చాలా మంది రేషన్‌ బియ్యం తినడాన్ని చీప్‌గా చూస్తారు. కానీ వాటిలో బోలేడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట. ఈ విషయాన్ని స్వయంగా జాతీయ పోషకాహార సంస్థే వెల్లడించింది. ఆ వివరాలు..

మన దగ్గర చాలా మంది రేషన్‌ బియ్యం తినడాన్ని చీప్‌గా చూస్తారు. కానీ వాటిలో బోలేడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట. ఈ విషయాన్ని స్వయంగా జాతీయ పోషకాహార సంస్థే వెల్లడించింది. ఆ వివరాలు..

  • Published Mar 11, 2024 | 3:10 PMUpdated Mar 15, 2024 | 12:35 PM
Ration Rice: అమాయకంగా రేషన్ బియ్యం అమ్మేసుకుంటున్నారా? మీరు నష్టపోతున్నట్టే!

రాకెట్‌ యుగంలో కూడా చాలా దేశాల్లో ఆకలి చావులు నమోదవుతుండటం సిగ్గు చేటు. ఇక మన దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీపీఎల్‌ కుటుంబాలకు ఆహార భద్రత కల్పించడం కోసం.. చాల తక్కువ ధరకు ప్రతి నెల రేషన్‌ బియ్యాన్ని అందిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం రూపాయికిక కిలో రేషన్‌ బియ్యం ఇస్తుంది. అయితే మన దగ్గర చాలా మంది ఈ బియ్యాన్ని తీసుకుంటారు.. కానీ వండరు.. తినరు. తర్వాత వీటిని బ్లాక్‌ మార్కెట్‌లో 6-10 రూపాయలకు కిలో చొప్పున అమ్ముకుంటారు. కారణం.. ఒకలాంటి వాసన వస్తుంది.. అన్నం మెత్తగా అవుతుంది.. పురుగులుంటాయని చాలా మంది రేషన్‌ బియ్యాన్ని తినడానికి ఇ‍ష్టపడరు. అదుగో అలాంటి వారికి జాతీయ పోషకాహార సంస్థ(ఎన్‌ఐఎన్‌) షాకింగ్‌ విషయం వెల్లడించింది. రేషన్‌ బియ్యం పోషకాల గని అని చెప్పుకొచ్చింది.

పేదలకు ఆహార భద్రత కల్పించే లక్ష్యంతో గతేడాది ఏప్రిల్‌ నుంచి ఫోర్టిఫైడ్‌ బియ్యాన్ని రేషన్ డీలర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో ఎక్కువ శాతం జనాలు రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారని అనేక నివేదికలు వెల్లడించాయి. వర్గాల వారిగా చూసుకుంటే చిన్నారుల్లో 67 శాతం, యువతలో 57 శాతం, గర్భిణుల్లో 52శాతం రక్తహీనత ఉన్నట్టు జాతీయ కుటుంబ సర్వే నివేదిక తెలపింది. అయితే ఆ సమస్యను ఫోర్టిఫైడ్‌ బియ్యంతో అధిగమించొచ్చని ఎన్‌ఐఎన్‌ వెల్లడించింది. ఎన్‌ఐఎన్‌ డైరెక్టర్‌ డాక్టర్ హేమలత నేతృత్వంలో శాస్త్రవేత్తల బృందం ఈ మేరకు ఓ రీసెర్చ్ పత్రాన్ని ఇటీవల విడుదల చేసింది.

NIN about ration rice stores

పోషక విలువలు పెంచేందుకు ఆహారానికి కృత్రిమ విటమిన్లు కలిపి బలవర్థకం చేయడాన్నే ఫోర్టిఫైడ్‌ అంటారు. ఈ విధానంలో బియ్యాన్ని పిండిగా మార్చి.. దానికి ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, విటమిన్‌ బి-12 వంటి విటమిన్లు, పోషకాలు కలిపి ఆ పిండిని తిరిగి బియ్యం రూపంలో మార్చుతారు. ప్రతి 99 కిలోల రేషన్ బియ్యానికి ఒక కిలో ఫోర్టిఫైడ్‌ బియ్యం కెన్నెల్స్‌ కలుపుతారు. ఆ తర్వాత ఈ బియ్యాన్ని సంచుల్లో నింపి వాటిని ఎఫ్‌సీఐ గోడౌన్‌లలో భద్రపరిచి.. అనంతరం రేషన్‌ దుకాణాలకు తరలిస్తారు.

ఈ బియ్యాన్ని తింటే విటమిన్లు అందటమే కాకుండా రక్తహీనత సమస్య నుంచి కూడా బయటపడవచ్చు అంటున్నారు నిపుణులు. అలానే ఈ బియ్యం తినడం వల్ల చిన్నపిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే వీటిని ప్రభుత్వ హాస్టళ్లు, అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజన పథకాల కోసం పంపిణీ చేస్తున్నట్లు ఎన్‌ఐఎన్‌ వెల్లడించింది. మరి ఇన్ని పోషకాలున్నాయని తెలిసిన తర్వాత కూడా రేషన్‌ బియ్య కాకుండా సాధారణ బియ్యం తింటే రోగాలు కొనితెచ్చుకున్నట్లేనని నిపుణలు అంటున్నారు.