iDreamPost
android-app
ios-app

మురిపిండి ఆకు.. కిడ్నీలో రాళ్లను ఇట్టే కరిగించే దివ్య ఔషధం!

కొన్ని ఔషధ మొక్కలు మన చుట్టూనే ఉన్నా.. గుర్తించలేని పరిస్థితి. కానీ ఇవి అద్భుతమైన ఫలితాలు ఇస్తుంటాయి. అలాంటి వాటిలో ఒకటి మురిపిండి, కుప్పింట. ఈ ఆకులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

కొన్ని ఔషధ మొక్కలు మన చుట్టూనే ఉన్నా.. గుర్తించలేని పరిస్థితి. కానీ ఇవి అద్భుతమైన ఫలితాలు ఇస్తుంటాయి. అలాంటి వాటిలో ఒకటి మురిపిండి, కుప్పింట. ఈ ఆకులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

మురిపిండి ఆకు.. కిడ్నీలో రాళ్లను ఇట్టే  కరిగించే దివ్య ఔషధం!

ప్రకృతిలో మనకు తెలియని ఎన్నో ఔషధ మొక్కలు ఉన్నాయి. పెరట్లోనో లేక రోడ్డు మీదో తరచుగా కనిపిస్తుంటాయి. కలుపు మొక్క, పనికి రానివి లేదా పిచ్చి మొక్కలుగా అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. కానీ మన ఒంట్లో ఉండే ఎన్నో రోగాలకు చెక్ పెడతాయని తెలియక.. చిన్న చిన్న వ్యాధులకు, రోగాలకు కూడా పెద్దాసుపత్రులకు వెళ్లి.. జేబులకు చిల్లులు పెట్టుకుంటాం. రోజూ మన కంటికి కనబడుతున్నప్పటికీ.. గుర్తించలేని అజ్ఞానులం. కానీ ఆయుదర్వేద వైద్యంలో అద్భుతమైన ఫలితాలను అందిస్తున్నాయి ఈ మొక్కులు. వాటిల్లో ఒకటి మురిపిండి. ఇది ఓ రకమైన ఔషధ మొక్క. దీని శాస్త్రీయ నామం ఎకలైఫా ఇండిక. సంస్కృతంలో విశ్వ రూపి అని కూడా పిలుస్తుంటారు. దీనికి కూడా పలు నామాలున్నాయి. కుప్పింట, హరిత మంజరి, మగబీర అనే పేర్లు కూడా వీటివే.

కుప్పింటాకు, మురిపిండిలో విటమిన్ ఏ, సీ, కె, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటి ఆకులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. రోగనిరోధక శక్తి మెరుగుపరిచే శక్తి ఈ మొక్కుకు ఉంది. శరీరంలో రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి తోడ్పడుతుంది. దురద, దద్దర్లు, గజ్జి, తామర వంటి చర్మ సమస్యలకు చెక్ పెడుతుంది. వీటి ఆకులను మొత్తగా నూరి లేపనంగా రాస్తే మంచి ఫలితం ఉంటుంది. చాలా మందిని వేధిస్తున్న సమస్య గురక. ఈ సమస్యను చెక్ పెట్టేస్తుంది హరిత మంజరి. రసాన్ని రెండు మూడు డ్రాప్స్ తీసుకుంటే.. మంచి ఫలితం ఉంటుంది. కుప్పింటాకు తెల్ల రక్తకణాల ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది, మొత్తం రోగనిరోధక పనితీరును ప్రోత్సహిస్తుంది. అలాగే వీటి వేర్లతో పళ్లను తోమితే దంతాలు నిగనిగలాడుతుంటాయి. చిగుళ్ల నుండి కారే రక్తాన్ని కూడా అరికడుతుంది.

జ్వరం, వాంతులు, కఫం లాంటి వ్యాధులకు ఆయుర్వేద ముందుగా ఉపయోగిస్తారు. ఫిడ్స్ వంటి వ్యాధులను నివారిస్తుంది మురిపిండి. ఇది కంటి సమస్యలను మెరుగుపరుస్తుంది. మలబద్దకం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఈ ఆకుల రసాన్ని తాగితే మంచి ఫలితం అవుతుంది. కడుపులో ఉన్న నులిపురుగులు కూడా మాయం అవుతాయి. ఈ ఆకుల రసాన్ని కీళ్ల నొప్పులు ఉన్న చోట రాయడం వల్ల పెయిన్స్ ఇట్టే మాయం అవుతాయి. అలాగే అవాంఛిత రోమాలతో ఇబ్బంది పెడుతుంటారు చాలా మంది. వ్యాక్స్ ఇతర పద్ధతులు వచ్చినా.. శాశ్వత నివారణ లేదు. కానీ వీటి రసాన్ని వాడితే అద్భుతమైన ఫలితాలు చూడొచ్చట. శ్వాసకోశ సంబంధిత సమస్యలను కూడా చెక్ పెడుతుంది.

మురిప్పిండి ఆకులు రసాన్ని నుదుటిపై రాసుకోవడం వల్ల తలనొప్పి కూడా మాటుమాయం అవుతుందట. అలాగే కామెర్లకు చక్కని ఔషధంలా పనిచేస్తుంది. పక్షవాతంతో ఉన్నవారికి కుప్పింటాకు అద్భుతంగా పనిచేస్తుంది. పాము, తేలు కరిచిన వాళ్లకు కూడా ఈ ఆకు రసాన్ని రాయడం వల్ల ఉపశమనం కలుగుతుందని ఆయుర్వేదం చెబుతుంది. వీటి వేర్లు ఉబ్బసం వ్యాధిని తరిమికొడతాయట. కాలేయం, మూత్రపిండాలను శుభ్రపరచడానికి ఉపయోగపడుతుందట. నిత్యం ఆకు రసాన్ని తీసుకుంటే ఉంటే.. శరీరంలో మలినాలను బయటకు పంపించేస్తుంది. అలాగే ఈ మధ్య కాలంలో ఈ ఆకులు పొడి రూపంలో కూడా లభిస్తున్నాయి. వీటితో టీ చేసుకుని కూడా తాగొచ్చు మంచి ఫలితం ఉంటుంది.