iDreamPost
android-app
ios-app

ముళ్ల వంకాయతో బట్టతలపై వెంట్రుకలు మొలవాల్సిందే..!

పొలాల గట్లపై, చెరువు గట్లపై ముళ్లతో పొదలా పెరిగే మొక్క ముళ్ల వంకాయ. వీటిని నేల ములక, రాము ములక, కంటకారి, నేల వాకుడు అని కూడా పిలుస్తుంటారు. ఈ కాయలను కూర వండుకుని తింటారు. పిచ్చిమొక్కలా ఉంటే కాయలో మాత్రమే కాదు ఆకులు, వేర్లలో కూడా ఎన్నో ఔషధ గుణాలున్నాయి.

పొలాల గట్లపై, చెరువు గట్లపై ముళ్లతో పొదలా పెరిగే మొక్క ముళ్ల వంకాయ. వీటిని నేల ములక, రాము ములక, కంటకారి, నేల వాకుడు అని కూడా పిలుస్తుంటారు. ఈ కాయలను కూర వండుకుని తింటారు. పిచ్చిమొక్కలా ఉంటే కాయలో మాత్రమే కాదు ఆకులు, వేర్లలో కూడా ఎన్నో ఔషధ గుణాలున్నాయి.

ముళ్ల వంకాయతో బట్టతలపై వెంట్రుకలు మొలవాల్సిందే..!

‘ఆహా ఏమీ రుచి అనరా మైమరిచి.. రోజు తినా మరీ మోజే తీరనిది’ అంటూ వంకాయ గురించి అద్భుతంగా వర్ణిస్తుంది మన హీరోయిన్ లైలా. నిజమే మరీ వంకాయ కూరకు ఉండే రుచి అలాంటిది. మార్కెట్‌లో ఎన్నో రకాల వంకాయలు అందుబాటులోకి వచ్చాయి. నల్ల వంకాయలు, గుత్తు వంకాయలు, తెల్లవంకాయలు, పోలవరం వంకాయలు ఇలా చెప్పుకుంటూ పోతే.. బోలెడు వెరైటీలు. వీటిల్లో చాలా రకాలు కొనాల్సిందే.. కానీ ఫ్రీగా దొరికే, పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉండే ముళ్ల వంకాయ గురించి తెలుసా..? ఎక్కడ పడితే అక్కడ పెరుగుతూ.. పొద నుండా ముళ్లతో నిండిపోయి ఉంటుంది. చూసేందుకు పిచ్చి చెట్టు మాదిరి కనిపించి చిన్న చిన్న కాయలు కాస్తుంటాయి. వీటినే ముళ్ల వంగ అనిపిలుస్తుంటారు. సాధారణంగా పల్లెటూళ్లల్లో ఉంటే వాళ్లకు ఈ మొక్కలు పరిచయం చేయనక్కర్లేదు. వీటి కాయలే కాదు.. ఆకులు, వేర్లు ఇలా ప్రతిదీ ఓ ఔషధమే.

ప్రాంతాలను బట్టి దీని ఈ మొక్క పేరు మారిపోతుంది. కొన్ని ప్రాంతాల్లో నేల ములక, రామ ములక, కంటకారి, నేల వాకుడు అని కూడా పిలుస్తుంటారు. బురద నేలలో పెరిగే ఈ మొక్కలకు కాండం, ఆకులు, పువ్వులు, కాయలకు కూడా ముళ్లు ఉంటాయి. ఈ మొక్కను చూడకుండా తొక్కితే ఇక అంతే సంగతులు. అలాగే పట్టుకుంటే కూడా ముళ్లు దిగిపోతుంటాయి. వీటిని చాలా మంది పిచ్చిమొక్క అని పీకేస్తుంటారు.. కానీ ఇందులో ఎన్నో ఔషధగుణాలున్నాయి. ఈ ముళ్ల వంకాయతో కూర, పులుసు, పచ్చడి చేసకుని తింటారు. ఆయుర్వేద నిపుణులు చెబుతున్న ప్రకారం.. ముళ్ల వంగ ఎన్నో వ్యాధులను నయం చేస్తుందట. వాత, కఫం వాటి వాటితో బాధపడుతున్న వారికి కూర వండుకుని తింటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఈ గింజలు చేదుగా ఉండటంతో షుగర్ కంట్రోల్ చేసే శక్తి వీటికి ఉంది.

ప్రతి ఐదుగురు పురుషుల్లో ఇద్దర్ని భయపెట్టే సమస్య బట్టతల. జుట్టు ఊడిపోయి బట్టతల వస్తుంటే దిగులు చెందుతుంటారు. ఏవేవో మందులు, ఆయిల్స్ వాడుతుంటారు. కానీ ఈ ముళ్ల వంగతో బట్టతల సమస్యను అరికట్టవచ్చు. నేల మునగ ఆకులు తీసుకుని.. వాటిని రసం తీసి, కాస్తంత తేనె కలిపి.. జుట్టు రాలిపోతున్న ప్రాంతంలో రాస్తే వెంట్రుకలు రాలిపోవడం ఆగిపోతాయట. అలాగే.. ఈ కాయ గింజలను తీసేసి.. రసం చేసుకుని, మందార పువ్వుల రసంతో కలిపి మర్థనా చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. కేవలం హెయిర్ ఫాల్ మాత్రమే కాదు.. పేను కొరుకుడు, చుండ్రు వంటి సమస్యలను కూడా అరికడుతుందట. అలాగే మూత్రాశయంలో రాళ్లను కరిగించే శక్తి కూడా ఈ మొక్కకు ఉంది. ఈ మొక్క వేర్ల‌ను నీడ‌లో ఎండ‌బెట్టి పొడిగా చేసుకుని ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ పౌడర్ పెరుగుతో కలిపి తీసుకుంటే.. రాళ్ల ఇట్టే కరిగిపోతాయి. మూత్రంలో మంటను కూడా తగ్గిస్తుంది.

పిప్పి ప‌న్నుతో బాధ‌ప‌డుతున్న‌ప్పుడు పండిన ముళ్ల‌ వంగ కాయ‌ల‌ను సేక‌రించి వాటిని కాల్చ‌గా వ‌చ్చిన పొగ‌ను నోటితో పీల్చ‌డం వ‌ల్ల పిప్పిప‌న్ను వల్ల క‌లిగే నొప్పి తగ్గుతుంది. ఈ మధ్య కాలంలో వృద్ధులు, వయస్సులో ఉన్న వ్యక్తులతో సంబంధం లేకుండా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. వైద్యుడి వద్దకు వెళ్లి చికిత్స తీసుకున్నప్పటికీ.. ఇంకా వేధిస్తూనే ఉంటుంది. అలాంటి సమస్యకు చక్కటి పరిష్కారం ఈ మొక్క. ముళ్ల‌ వంగ మొక్క ఆకుల‌ను మెత్త‌గా నూరి దానిలో కొద్దిగా వేడి చేసిన వెన్న‌ను క‌లిపి నొప్పి ఉన్న చోట ఉంచి క‌ట్టుక‌ట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇంతేనా జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలు, కాలేయ సంబంధిత సమస్యలు, దగ్గు,బీపీ వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఇది సీజనల్ వ్యాధులకు ఔషధమని చెప్పొచ్చు. తలనొప్పి, ఒళ్లు నొప్పులను కూడా తరిమికొట్టే గుణాలున్నాయి. రక్తాన్ని శుద్ది చేస్తుంది ఈ నేల ములక. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే… ఈ ప్రయోజనాలను ఐడ్రీమ్ నిర్ధారించలేదు.