iDreamPost
android-app
ios-app

ఉప్పు ఎక్కువగా తింటున్నారా.. షుగర్‌ వచ్చే అవకాశం ఉంది

  • Published Nov 03, 2023 | 3:00 PM Updated Updated Nov 03, 2023 | 3:00 PM

సాధారణంగా ఉప్పు ఎక్కువగా తింటే బీపీ వస్తుందని చెబుతారు వైద్యులు. కొందరైతే.. అసలు ఉప్పే వాడొద్దు అంటారు. కానీ తాజా పరిశోధనల్లో ఓ ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. ఉప్పు ఎక్కువైతే.. షుగర్‌ వస్తుంది అంట. ఆ వివరాలు..

సాధారణంగా ఉప్పు ఎక్కువగా తింటే బీపీ వస్తుందని చెబుతారు వైద్యులు. కొందరైతే.. అసలు ఉప్పే వాడొద్దు అంటారు. కానీ తాజా పరిశోధనల్లో ఓ ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. ఉప్పు ఎక్కువైతే.. షుగర్‌ వస్తుంది అంట. ఆ వివరాలు..

  • Published Nov 03, 2023 | 3:00 PMUpdated Nov 03, 2023 | 3:00 PM
ఉప్పు ఎక్కువగా తింటున్నారా.. షుగర్‌ వచ్చే అవకాశం ఉంది

సాధారణంగా పిండి పదార్థాలు, తీపి ఎక్కువగా తింటే షుగర్‌ వ్యాధి వస్తుందని చెబుతారు. అలానే ఉప్పు ఎక్కువగా తింటే.. బీపీ వస్తుందని తెలుసు. కానీ తాజా అధ్యయనాలు.. ఓ ఆసక్తికరమైన వార్త చెప్పాయి. ఉప్పు ఎక్కువగా వినియోగించడం వల్ల బీపీ మాత్రమే కాక.. షుగర్‌ వచ్చే అవకాశం ఉందని వెల్లడించాయి. లండన్‌కు చెందిన సైంటిస్టులు తాజాగా జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. మోతాదుకు మించి ఉప్పు వినియోగిస్తే.. షుగర్‌ వస్తుందని పరిశోధకులు తేల్చిచెప్పారు. కనుక మోతాదు మించితే ప్రమాదం తప్పదు అంటున్నారు. మరి ఇంతకు రోజుకు ఒక వ్యక్తి సగటున ఎంత ఉప్పు వినియోగించాలి అంటే..

ఉప్పు లేకుండా వంటే లేదు..

అన్నేసి చూడు.. నన్నేసి చూడు అని వంటల్లో ఉప్పు ప్రాధాన్యతను చెప్పకనే చెప్పారు. ఎంత ఖరీదైన మసలా దినుసులు వేసినా సరే.. ఉప్పు లేక పోతే ఆ పదార్థం రుచిగా ఉండదు. మన దగ్గర అయితే ఉప్పు లేకుండా వంట చేయడం దాదాపు అసాధ్యం. మన రోజు వారీ జీవితంలో.. కూరలు చప్పగా ఉన్నా.. లేదంటే రుచి కోసమో అని చెప్పి ఎడా పెడా ఉప్పు వాడేస్తుంటాము.

ఇక నిల్వ పచ్చళ్ల సంగతి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. కేజీల్లో ఉప్పు వాడతారు. ఏమంటే ఉప్పు తక్కువైతే పచ్చడి పాడవుతుంది అంటారు. ఇక ప్రాసెస్డ్‌ ఫుడ్‌, బెకరీ ఐటమ్స్‌లో వాడే ఉప్పు సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలా మనం రోజువారి తీసుకునే ఆహారం ద్వారా ఉప్పును తింటున్నాము. అయితే ఇలా మోతాదుకు మించి ఉప్పు తింటే.. బీపీతో పాటు షుగర్‌ కూడా వస్తుంది అంటున్నారు లండన్‌ పరిశోధకులు.

పరిశోధకులు ఏమంటున్నారంటే..

యూకేలోని ‘తులనే’ యూనివర్సిటీ నిర్వహించిన రీసెర్చ్‌లో ఈ షాకింగ్‌ విషయాలు బయటపడ్డాయి. 12 ఏళ్లుగా సుమారు 13 వేల మందిపై జరిపిన అధ్యయనంలో.. మోతాదుకు మించి ఉప్పు వాడే వారిలో టైప్‌-2 డయాబెటిస్‌ వచ్చే రిస్క్‌ అధికంగా ఉంటుందనే విషయం వెల్లడైందన్నారు సైంటిస్టులు. ఉప్పు తక్కువ తీసుకునే వారితో పోలిస్తే, ఎక్కువగా తీసుకునే వ్యక్తుల్లో 13 శాతం, సాధారణంగా తీసుకునే వారిలో 20 శాతం, ఎప్పుడూ ఎక్కువగానే ఉప్పు తినే వారిలో 39 శాతం మందికి టైప్ 2 డయాబెటిస్ వచ్చినట్లుగా ఈ అధ్యయనంలో వెల్లడైంది అన్నారు సైంటిస్టులు.

అందువల్ల ఉప్పు తగ్గిస్తే బీపీ మాత్రమే కాక, మధుమేహం బారిన పడే అవకాశాలు కూడా తగ్గించుకోవచ్చని సైంటిస్టులు తెలిపారు. కొంతమంది ఆహారం తీసుకొనేటప్పుడు టేబుల్ సాల్ట్ వాడతారని దీని వల్ల టైప్ 2 మధుమేహం 40 శాతం పెరిగే అవకాశం ఉందని ఈ పరిశోధనలో తేలిందని తులనే యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. రోజుకు రెండు టీ స్పూన్ల ఉప్పుును తీసుకునే వారిలో డయాబెటిస్ ముప్పు ఎక్కువగా ఉన్నట్టు పేర్కొన్నారు.

ఉప్పుతో డయాబెటిస్ బారిన పడకుండా ఉండాలంటే మాత్రం రోజు 1500 మి.గ్రా లకు మించి ఉప్పు వాడరాదని నిపుణులు సూచిస్తున్నారు. అధికంగా ఉప్పు తీసుకోవడం వల్ల బరువు పెరగడంతో పాటు బీపీ, షుగర్‌ సహా గుండె సంబంధిత సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. కనుక ఉప్పు మోతాదును ఎంత తగ్గించుకుంటే అంత మంచిది అంటున్నారు.