Keerthi
Alcohol: సాధారణంగా మద్యం తాగిన, ఎక్కువ మోతాదులో తాగిన ఆరోగ్యం పాడవుతుందనే విషయం అందరికి తెలిసిందే. కానీ, దీర్ఘకాలికంగా మద్యం తాగినవారు ఒక్కసారిగా తాగడం మానేస్తే ఎంత ప్రమాదమో తెలిస్తే షాక్ అవుతారు.
Alcohol: సాధారణంగా మద్యం తాగిన, ఎక్కువ మోతాదులో తాగిన ఆరోగ్యం పాడవుతుందనే విషయం అందరికి తెలిసిందే. కానీ, దీర్ఘకాలికంగా మద్యం తాగినవారు ఒక్కసారిగా తాగడం మానేస్తే ఎంత ప్రమాదమో తెలిస్తే షాక్ అవుతారు.
Keerthi
ఈరోజుల్లో మద్యం తాగని వారంటూ ఎవరూ ఉండరు. ఎందుకంటే.. ప్రస్తుత సమాజంలో పెద్దవాళ్ల దగ్గర నుంచి చదువుకుంటున్న విద్యార్థుల సైతం ఈ మద్యన్ని సేవించడం కామన్ అయిపోయింది. సరదాగా ఫ్రెండ్స్ తో బర్త్ డే పార్టీలని, వివాహ వేడుకలని మొదలుపెట్టిన ఈ మద్యపానం చివరికి బానిసలు గా మారే స్థాయికి మార్చేస్తుంది. ముఖ్యంగా ఈ మద్యపానం ఊబిలో పడినవారు బయటపడటం చాలా కష్టం. కానీ, కొంతమంది మాత్రం ఈ ఆల్కాహాల్ తాగడం వలన కలిగే నష్టాలను తెలుసుకొని, వెంటనే మానియాలని అనుకుంటారు. ఈ క్రమంలోనే.. చాలా ఏళ్లపాటు మద్యం సేవించేవారు ఒక్కసారిగా మందు తాగడం మానేస్తారు. అయితే ఇలా ఏళ్ల తరబడి మద్యం తాగినవారు హఠాత్తుగా తాగడం మానేయడం వల్ల అనేక ఆనారోగ్య సమస్యలకు దారితీస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందువల్ల ఒక్కసారిగా మద్యం మానేయడం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ మద్యం ఒక్కసారిగా మానేయడం వలన కలిగే ప్రమాదాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా మద్యం తాగిన, ఎక్కువ మోతాదులో తాగిన ఆరోగ్యం పాడవుతుందనే విషయం అందరికి తెలిసిందే. కానీ, దీర్ఘకాలికంగా మద్యం ఎక్కువగా తాగిన వారు ఆ మద్యం మూత్రం రూపంలో బయటకు పోతుందని అపోహ పడతారు. అయితే నిజానికి ఆ ఆల్కహాల్ తాగిన తర్వాత అది పొట్టలో నుంచి నేరుగా చిన్న పేగులోకి వెళ్తుంది. అక్కడ అల్డిహైడ్స్ అనే ఒక రసాయనంగా విడిపోతుంది. అయితే ఇది చాలా హానికరమైనది. పైగా ఇది పొట్ట నుంచి పేగుల్లోకి, అక్కడ్నించి రక్తంలో కలిసిపోయి నేరుగా కాలేయానికి చేరుతుంది. కాగా, అక్కడ కాలేయంలో పేరుకుపోయి కాలేయ పనితీరును ఈ అల్డిహైడ్ దెబ్బతీస్తుంది. అంతేకాకుండా.. తరుచు మద్యం తాగి అలవాటు ఉన్నవారికి కాలేయంపై మచ్చలు ఏర్పడతాయి. అవి కాలేయ పనితీరును మారుస్తాయి. ఈ క్రమంలోనే.. లివర్ సిరోసిస్, ఫ్యాటీ లివర్ డిసీజ్ వంటి సమస్యలకు కారణం అవుతాయి. దీంతో పాటు శరీరంలో శక్తి కోల్పోవడం డీహైడ్రేషన్ బారిన పడటం, పచ్చ కామెర్లు రావడం, రక్తపు వాంతులు అవ్వడం, కండరాలు బలహీనంగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఇక మద్యం సేవించడం వలన ఎన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయో, అలాగే హఠాత్తుగా దానిని మానేసిన కూడా అదే స్థాయిలో అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే.. హఠాత్తుగా మద్యాన్ని తాగడం మానేసినా దాని వల్ల దెబ్బతిన్న కాలేయం మళ్లీ ఆరోగ్యంగా మారడానికి చాలా సమయం పడుతుందట. అంతేకాకుండా.. ఈ ఆల్కహాలో మానేసిన తర్వాత చాలవరకు.. మానసికంగా, శారీరకంగా చిన్నచిన్న ప్రభావాలకు గురవుతారని చెబుతున్నారు.దీనినే ‘విత్ డ్రాయల్ సిండ్రోమ్’ అని పిలుస్తారు.దీని వలన ఆల్కహాల్ హఠాత్తుగా మానేసిన వారిలో.. టెన్షన్ గా అనిపించడం, అలసటగా అనిపించడం, వణుకు రావడం, మెంటల్ గా తీవ్ర డిప్రేషన్ కు లోనవుతుంటారు. దీన్నే మానసిక సమస్య అని కూడా అంటారు. పైగా దీనికి వైద్యుల వద్ద చికిత్స ఉంది. ఆ చికిత్స తీసుకుంటే ఈ లక్షణాలు ఏవీ రాకుండా ఉంటాయి. ముఖ్యంగా.. ఈ మద్యం తాగడం మానేసిన వారికి చెవుల్లో తమను ఎవరో పిలుస్తున్నట్టు వినిపించడం వంటి భ్రాంతులు కూడా కలుగుతాయి. ఇవన్నీ మానసిక సమస్యలేనని వీటికి తగిన చికిత్స తీసుకుంటే సాధారణ జీవితాన్ని గడపవచ్చని వైద్యులు చెబుతున్నారు.