iDreamPost
android-app
ios-app

Netflix: నెట్ ఫ్లిక్స్‌కి అడిక్ట్ అయ్యారా? అయితే.. చావును కొనుక్కొచ్చుకున్నట్టే!

  • Published Feb 15, 2024 | 3:48 PM Updated Updated Feb 15, 2024 | 3:48 PM

నెట్‌ఫ్లిక్స్‌ వాడుతున్నారా.. గంటల తరబడి ఆ ప్లాట్‌ఫామ్‌లోనే ఉంటున్నారా.. అయితే మీరు చావును కొనితెచ్చుకున్నట్లే అంటున్నారు నిపుణులు. ఎలా అంటే..

నెట్‌ఫ్లిక్స్‌ వాడుతున్నారా.. గంటల తరబడి ఆ ప్లాట్‌ఫామ్‌లోనే ఉంటున్నారా.. అయితే మీరు చావును కొనితెచ్చుకున్నట్లే అంటున్నారు నిపుణులు. ఎలా అంటే..

  • Published Feb 15, 2024 | 3:48 PMUpdated Feb 15, 2024 | 3:48 PM
Netflix: నెట్ ఫ్లిక్స్‌కి అడిక్ట్ అయ్యారా? అయితే.. చావును కొనుక్కొచ్చుకున్నట్టే!

ఈమధ్యకాలంలో సినిమాలు చూసే విధానం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు కొత్త చిత్రాలు చూడాలంటే.. థియేటర్‌కు వెళ్లాలి.. లేదంటే టీవీల్లోకి వచ్చే వరకు ఎదురు చూడాలి. మరి ఇప్పుడో.. బోలేడు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఇక సినిమాలు రిలీజ్‌ అయిన నెల రోజుల్లోగా అవి ఓటీటీల్లో స్ట్రీమ్‌ అవుతున్నాయి. వీటిల్లో సినిమాలు మాత్రమే కాక వెబ్‌ సిరీస్‌లు, సీరియల్స్‌ కూడా అందుబాటులో ఉంటున్నాయి. దాంతో చాలా మంది మూవీ లవర్స్‌ ఈ ఓటీటీ యాప్‌లకు అడిక్ట్‌ అవుతున్నారు. ఎంతలా అంటే.. కొందరు ఏదైనా వెబ్‌ సిరిస్‌ చూడ్డం మొదలు పెట్టారంటే.. నిద్ర మానుకుని మరీ వాటిని పూర్తి చేస్తున్నారు. ఈక్రమంలో నెటిఫ్లిక్స్‌ వాడితే చస్తారు అని హెచ్చరిస్తున్నారు కొందరు టెక్‌ నిపుణులు. ఎందుకు అంటే..

మిగతా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌తో పోలిస్తే.. నెట్‌ఫ్లిక్స్‌ కొంచెం విభిన్నంగా ఉంటుంది. అమెజాన్‌, ఇతర ఓటీటీల ప్లాట్‌ఫామ్‌లతో పోలిస్తే.. నెట్‌ఫ్లిక్స్‌లో వెబ్‌ సిరీస్‌లు, సినిమాలు ఎక్కువ మొత్తంలో అందుబాటులో ఉంటాయి. మరీ ముఖ్యంగా కొరియన్‌ సిరీస్‌లు వంటివి నెట్‌ఫ్లిక్స్‌లోనే ఎక్కువగా ఉండి.. ప్రేక్షకులను కట్టి పడేస్తుంటాయి. మన చుట్టూ ఉన్న వారిలో ఎందరో నెట్‌ఫ్లిక్స్‌లోని వెబ్‌ సిరీస్‌లకు అడిక్ట్‌ అయిన వారు ఉన్నారు.

అయితే ఆయా సిరీస్‌లు, సినిమాలు ఆసక్తికరంగా ఉండటం వల్లే మనం వాటికి అడిక్ట్‌ అవుతున్నాం అని అనుకుంటున్నాం. కానీ నివేదికలు మాత్రం అది వాస్తవం కాదంటున్నాయి. నెట్‌ఫ్లిక్స్‌ వాడే అల్గారిథమ్‌, విభిన్నమైన సైకాలాజికల్‌ థియరీస్‌ వల్లనే మనం దానికి అడిక్ట్‌ అవుతున్నాం అని వెల్లడిస్తున్నాయి. నెటిఫ్లిక్స్‌లో బింజ్‌ వాచింగ్‌ అంటే నిర్విరామంగా.. గంటల తరబడి వెబ్‌ సిరీస్‌లు చూసే విధంగా వాళ్లు వేర్వేరు సైకలాజీలు వాడతారని నివేదికలు వెల్లడిస్తున్నాయి.

నెట్‌ ఫ్లిక్స్‌ వాడితే ఎందుకు చనిపోతున్నారు..

ఇక నెట్‌ఫ్లిక్స్‌ వాడితే ఎందుకు చనిపోతారు అంటే.. ఈ బింజ్‌ వాచింగ్‌ వల్లనే అంటున్నాయి నివేదికలు. గంటల తరబడి వీడియో స్ట్రీమింగ్‌ యాప్‌లు చూసేవారు ఎలా మృత్యువాత పడుతున్నారో అనేక నివేదికలు వెల్లడించాయి. అమెరికన్‌, బీఎంఎస్‌ సర్వే ప్రకారం.. 29 ఏళ్ల లోపు వారు 17.5 గంటలు నిర్విరామంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో సిరీస్‌లు చూస్తున్నారట. ఇలా గంటల తరబడి సిరీస్‌లు చూసే వారు.. అందుకు తగ్గట్టుగా స్నాక్స్‌, జంక్‌ ఫుడ్‌ వంటివి రెడీగా పెట్టుకుని.. అలా సోఫాలోనో ఎక్కడో సెటిల్‌ అవుతారు.

అలా గంటల తరబడి కదలకుండా కూర్చోవడం, పడుకోవడం వల్ల శారీరక శ్రమ లేకుండా పోతుంది. దీని వల్ల కాళ్లలో వాపు రావడం, బీపీ, షూగర్‌ వంటి సమస్యలు తలెత్తి చివరకు హార్ట్‌ ఎటాక్‌కు దారి తీసి.. మృత్యువాతపడుతున్నారు. ఇక నెటఫ్లిక్స్‌ చూసేవారిలో నిద్రలేమి సమస్య విపరీతంగా పెరిగిపోతుంది అని నివేదికలు వెల్లడిస్తున్నాయి. వారు నిద్రపోవాలంటే స్లిపింగ్‌ పిల్స్‌ వాడాల్సిన పరిస్థితి. ఇలా గంటల తరబడి సిరీస్‌లు చూడటం వల్ల విద్యార్థులు, ఉద్యోగం చేసే వారిలో ఏకాగ్రత తగ్గడం.. అది వారి కెరీర్‌పై ప్రభావం చూపడం వంటివి జరుగుతున్నాయి అని నివేదికలు వెల్లడిస్తున్నాయి.

ఇక రెండు గంటల కన్నా ఎక్కువ సమయం ఇలా వీడియో స్ట్రీమింగ్‌ సైట్లను చూసే వారికి రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి అని నివేదికలు వెల్లడించాయి. బీపీ, నిద్రలేమి, గుండెపోటు వంటి సమస్యలతో మృత్యువాత పడుతన్నారని చెప్పుకొచ్చాయి. ఈ క్రమంలో తాజాగా నెట్‌ఫ్లిక్స్‌ సీఈఓ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తమకు ప్రధాన శత్రువు నిద్రే అంటున్నాడు.. అంటే నిద్ర అనేది ఎంత ప్రభావం చూపుతోందో అర్థం చేసుకోవచ్చు.

Netflix addict issue

నెట్‌ఫ్లిక్స్‌ వాడే టెక్నిక్స్‌..

ఇలా గంటల తరబడి వెబ్‌సిరీస్‌లు చూడటానికి కారణం మనకు వాటి మీద ఉన్న ఆసక్తి అని అనుకుంటాం.. కానీ అది నిజం కాదని.. అందుకు నెట్‌ఫ్లిక్స్‌ ప్లే చేసే కొన్ని స్టంట్స్‌ అని నివేదికలు వెల్లడిస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్‌లో ఏదైనా సిరీస్‌ చూస్తుండగా.. అది అయిపోయే సమయంలో వచ్చే సౌండ్‌ మనల్ని దీనికి అడిక్ట్‌ చేస్తుంది అంటున్నారు నిపుణులు. సిరీస్‌ చూస్తూ మనం నిద్రపోతున్నా.. ఆ పార్ట్‌ ఎండింగ్‌లో వాళ్లు సాధారణంగా వాడే 80 డీబీ సౌండ్‌ బదులు 120 డీబీ సౌండ్‌ ప్లే చేస్తారు. దీని వల్ల నిద్ర నుంచి ఉలిక్కిపడి లేస్తాం.

అలానే ఆటోప్లే బటన్‌ పెట్టకుండా.. నెక్స్ట్‌ బటన్‌ని రైట్‌ సైడ్‌ పెట్టి.. ఎక్కువ ఆలోచించుకునే సమయం ఇవ్వదు. కేవలం 5 సెంకడ్ల సమయం మాత్రమే పెడతారు. మనం తర్వాతి పార్ట్‌ చూడాలా వద్దా అని నిర్ణయించుకునేలోపే అది ప్లే అవుతుంది. ఆ తర్వాత మనం ఆలోచించలేం. దాన్ని చూడటంలో నిమగ్నం అవుతాం.

దీనితో పాటు మూడు డీప్‌ ఎమోషన్స్‌ని సిరీస్‌ ప్రారంభంలో కానీ.. చివర్లో కానీ ఉండేలా చూసుకుంటారు. అవే సెక్స్‌, వయోలెన్స్‌, సస్పెన్స్‌. వీటిని సిరిస్‌ ప్రాంరభంలోనో.. చివర్లోనే ఉండేలా చేయడం వల్ల మనం ఆ సిరీస్‌లను కంటిన్యూగా చూస్తూనే ఉంటాం. ఇంక ఇవే కాక మనకు తెలయని అనేక రకాల సైకాలాజీలు ప్రయోగించి.. ఆ ప్లాట్‌ఫామ్‌ మీదకు వెళ్లేలా చేసి.. నెట్‌ఫ్లిక్స్‌ మనల్ని అడిక్ట్‌ చేస్తుంది అంటున్నాయి నివేదికలు.

ఎలా బయటపడాలంటే..

మరి ఈ అలవాటు నుంచి ఎలా బయటపడాలంటే.. ఆటో ప్లే బటన్‌ని ఆఫ్‌ చేసి ఉంచాలి. మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. రోజుకు గంట, 2 గంటలు మాత్రమే చూడాలి. అంతకంటే ఎక్కువ సమయం చూడాలి అనుకుంటే సమస్యలు కొని తెచ్చుకోవడం మాత్రమే అని గుర్తించి.. ఎలాగోలా ఆ అలవాటు నుంచి బయటపడాలి అంటున్నారు. లేదంటే.. మన చావుకు మనమే స్వయంగా ఆహ్వానం పలికినట్లు అవుతుంది అంటున్నారు నిపుణులు.

Netflix addict issue

అయితే ఇక్కడ నెట్‌ఫ్లిక్స్‌దే తప్పు అనడం లేదు. అది కేవలం తన యూజర్లను ఆకట్టుకోవడం కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి బెస్ట్‌ కంటెంట్‌ని తీసుకొస్తుంది. నెట్‌ఫ్లిక్స్‌ అనే కాకుండా మిగతా ప్లాట్‌ఫామ్‌లన్ని ఇదే లక్ష్యంతో పని చేస్తాయి. కానీ ఓటీటీల్లో సినిమాలు, సిరీస్‌లు చూసే ప్రేక్షకుడికి తన మీద తనకు కంట్రోల్‌ ఉండాలి. దేనికి ఎంత సమయం కేటాయించాలి.. అతిగా చూస్తే కలిగే అనర్థాల గురించి అవగాహన ఉండటమే కాక.. మన మైండ్‌ను ఎలా కంట్రోల్‌ చేసుకోవాలి అనే దాని గురించి తెలిసి ఉండాలి అంటున్నారు నిపుణులు. మరి మీరు కూడా ఇలానే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు అడిక్ట్‌ అయ్యారా.. మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.