iDreamPost

మీ బొడ్డులో దూది ఎప్పుడైనా గమనించారా? ప్రమాదమెంత? మీకు తెలియని నిజాలు!

మానవ శరీరంలో పొట్టపై లోతుగా ఉండే ప్రాంతం నాభి. ఇప్పుడు దీని చుట్టూ టాటూలు వేయించుకోవడం, అలాగే రింగ్స్ వంటివి పెట్టుకుంటున్నారు. కానీ చాలా మంది నాభిలో మలిన పదార్థాలు ఉంటాయని గ్రహించరు. మరీ బొడ్డులో ఉన్న ఆ మెత్తని పదార్థం ఏంటీ.. అవి ఎలా చేరుతాయో తెలుసా..?

మానవ శరీరంలో పొట్టపై లోతుగా ఉండే ప్రాంతం నాభి. ఇప్పుడు దీని చుట్టూ టాటూలు వేయించుకోవడం, అలాగే రింగ్స్ వంటివి పెట్టుకుంటున్నారు. కానీ చాలా మంది నాభిలో మలిన పదార్థాలు ఉంటాయని గ్రహించరు. మరీ బొడ్డులో ఉన్న ఆ మెత్తని పదార్థం ఏంటీ.. అవి ఎలా చేరుతాయో తెలుసా..?

మీ బొడ్డులో దూది ఎప్పుడైనా గమనించారా? ప్రమాదమెంత? మీకు తెలియని నిజాలు!

మనిషి పుట్టుకకు ముఖ్యమైనది బొడ్డుతాడు. శిశువుకు,తల్లికి నాభితో కనెక్ట్ అవుతుంది. తల్లిబిడ్డల మధ్య బంధాన్ని ఏర్పరిచే ప్రాంతం బొడ్డు మాత్రమే. అయితే మన శరీరంలో అన్ని భాగాలను పరిశుభ్రం చేసుకుంటారు కానీ.. నాభిపై చాలా మంది దృష్టి సారించరు. కానీ లోతుగా ఉండే నాభిలో వ్యర్థాలు పేరుకుపోతూ ఉంటాయి. పరిశీలన చూస్తే.. మట్టి, దూది లాంటి మెత్తటి పదార్థాలు కనిపిస్తాయి. పర్టిక్యులర్‌గా నాభిని శుభ్రం ఎవరు చేసుకుంటారులే అని అనుకుంటున్నారా..? ఈ చిన్న నిర్లక్ష్యమే జీవాలకు ఆస్కారం అయ్యింది. ఇటీవల చేపట్టిన పరిశోధనలో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. సిడ్నీ విశ్వవిద్యాలయం పరిశోధకులు బొడ్డులో మొత్తని వ్యర్థపదార్థాలపై పెద్ద రీసెర్చే చేశారు. అసలు నాభిలోకి వ్యర్థాలు ఎలా ఏర్పడతాయి.. ఎలా వస్తాయి అన్న దానిపై పరిశోధించి, పరిశీలన చేశారు.

నాభిలో పేరుకుపోయిన మెత్తటి చెత్తని నేవల్ ప్లఫ్ అంటారు. వైద్య పరిభాషల్లో దీన్ని బెల్లీ బటన్ లింట్ అని పిలుస్తారు. సాధారణంగా వెంట్రుకలు ఎక్కువగా ఉన్న పురుషులు, బరువు పెరిగిన వ్యక్తుల నాభిలో వ్యర్థ పదార్ధాలు చేరతాయని పరిశోధన చేసిన డాక్టర్స్ చెబుతున్నారు. బొడ్డులోకి దూది వ్యర్థాలు ఎక్కడి నుండి వస్తాయో తెలుసా..? ఒంటిపై దుస్తుల నుండి అట. దుస్తులు వేసుకున్నప్పుడు నాభిచుట్టూ పేరుకుపోయిన వెంట్రుకలు.. ఫైబర్ ముక్కలను లాక్కొని, నాభిలోకి నిక్షిప్తం చేస్తాయని తేలింది. ఈ పరిశోధన చేయగా..2022లో ఇందుకు డాక్టర్ కార్ల్ క్రస్ జెల్నీకీ నోబల్ బహమతి కూడా లభించింది. నాభిలోకి ఈ చెత్త ఎలా పేరుకుపోతుందో అని తేల్చడానికి కొంత మంది వాలంటీర్లపై ప్రయోగాలు చేశారట ఆయన. బొడ్డుపై వెంట్రుకల నుండే వస్తున్నట్లు గ్రహించారు కార్ల్. అయితే క్షవరం చేసుకోవడం వల్ల ఈ సమస్య రాదని తేలింది.

అలాగే 2009లో వియన్నా యూనివర్శిటీ పరిశోధకుడు జార్జ్ స్టెయిన్ హౌజర్ కూడా ఇదే విషయాన్ని నిర్దారించాడట. జార్జ్.. తనపై తానే ప్రయోగాలు చేసుకున్నాడు. మూడేళ్ల పాటు ఈ దిన చర్య కొనసాగింది. ప్రతి రోజు ఉదయం స్నానం చేసి బొడ్డును శుభ్రపరుచుకునేవాడు. కానీ సాయంత్రం నాభిలో దూదిలాంటి వ్యర్థాలు కనిపించేవి. అలా 500లకు పైగా నమూనాలను సేకరించగా.. వాటి బరువు గ్రాము కూడా తూగలేదు. అయితే ఇక్కడ ఇంకో విషయం గమనించాడు. పాత టీ-షర్ట్స్ వేసుకునేటప్పుడు తక్కువ వ్యర్థాలు నాభిలోకి రావడం గమనించాడు. బహుశా అప్పటికే ఫైబర్ పోగులు పోవడం వల్ల పేరుకుపోయి ఉండకపోవచ్చునన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఈయన కూడా నాభిపై ఉన్న వెంట్రుకలే దుస్తుల నుండి పోగులను తీసుకొని.. బొడ్డులోకి చొప్పిస్తున్నట్లు కార్ల్ చెప్పిన మాటను బలపరిచారు. వెంట్రుకలు హుక్స్‌లా పనిచేస్తాయట. సేవింగ్ చేసుకున్నప్పుడు ఈ సమస్య లేదని తెలిపాడు.

నాభిలో దూదిలాంటి వ్యర్థ పదార్ధాలు చేరడంపై ఈ ఇద్దరు పరిశోధనలు చేస్తే.. ఇంకా ఏమీ ఉండొచ్చు అని ఓ అడుగు ముందుకు వేసి పరిశోధన చేసింది నార్త్ కరోలినా స్టేట్ యూనివర్శిటీ. 2011లో 500 మంది వాలంటీర్ల నుండి నాభిలో వ్యర్థాలను సేకరించి.. పరిశోధన చేపట్టగా.. బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్, సూక్ష్మ జీవులు దర్శనమిచ్చాయట. అయితే ఇది ఎలాంటి బ్యాక్టీరియా అని కనిపెట్టాలనుకున్నారు. మొదట 60 నమూనాల్లో.. 2,368 రకాల బ్యాక్టీరియా కనిపించిందట. ఇందులో ఎక్కువ భాగం కొన్ని జాతులకు చెందినవే. ప్రతి వ్యక్తిలోనూ సాధారణంగా కనిపించే బ్యాక్టీరియా రకం ఏదీ లేనప్పటికీ.. ఈ ప్రయోగంలో పాల్గొన్న వారిలో కనీసం 70 శాతం మందిలో ఎనిమిది రకాల బ్యాక్టీరియా కనిపించిదట. అయితే ఏ రకమైన బ్యాక్టీరియా ఉంటుందో అంచనా వేయడం అసాధ్యం అని తేలింది. బొడ్డులో దూది లాంటి వ్యర్థ పదార్థాలు చేరితే ఎటువంటి ప్రమాదం లేదు. ఎలాంటి భయం అవసరం లేదని వ్యక్తం అయ్యింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి