iDreamPost
android-app
ios-app

మగపిల్లలని మాత్రమే కాటేసే భయంకరమైన వ్యాధి..! వివరాలు ఇవే!

Duchenne Muscular Dystrophy: కొన్ని రకాల వ్యాధుల గురించి తెలుసుకున్నప్పుడు చాలా విచిత్రం అనిపిస్తుంది. తాజాగా ఓ వ్యాధి కేవలం మగపిల్లలకు మాత్రమే వస్తుందట. ఇక ఆ వ్యాధి వచ్చిందో అంతే సంగతులు.  దీనికి సరైనా చికిత్స కూడా అందుబాటులో లేదని పలువురు వైద్యులు చెబుతున్నారు.

Duchenne Muscular Dystrophy: కొన్ని రకాల వ్యాధుల గురించి తెలుసుకున్నప్పుడు చాలా విచిత్రం అనిపిస్తుంది. తాజాగా ఓ వ్యాధి కేవలం మగపిల్లలకు మాత్రమే వస్తుందట. ఇక ఆ వ్యాధి వచ్చిందో అంతే సంగతులు.  దీనికి సరైనా చికిత్స కూడా అందుబాటులో లేదని పలువురు వైద్యులు చెబుతున్నారు.

మగపిల్లలని మాత్రమే కాటేసే భయంకరమైన వ్యాధి..! వివరాలు ఇవే!

ప్రస్తుతం సమాజంలో అనేక రకాల వింత వ్యాధులు వెలుగులోకి వస్తున్నాయి. ఎప్పుడు చూడని, వినని వ్యాధులు పేర్లు వినిపిస్తోన్నాయి. అయితే కొన్నిటికి చికిత్స ఉండగా, మరికొన్నిటి మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో ఔషధాలు లేవు. ఇక కొన్ని రకాల వ్యాధుల గురించి తెలుసుకున్నప్పుడు చాలా విచిత్రం అనిపిస్తుంది. తాజాగా ఓ వ్యాధి కేవలం మగపిల్లలకు మాత్రమే వస్తుందట. ఇక ఆ వ్యాధి వచ్చిందో అంతే సంగతులు.  దీనికి సరైనా చికిత్స కూడా అందుబాటులో లేదని పలువురు వైద్యులు చెబుతున్నారు. ఇంతకీ ఈ వ్యాధి  ఏమిటి?, దాని వివరాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం…

మగపిల్లలకు మాత్రమే సోకే ఆ వ్యాధి పేరు డుచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ. దీనినే పీడియాట్రిక్ న్యూరోమస్కులర్ డిజార్డర్ అని కూడా ఈ వ్యాధిని పిలుస్తారు. ఇది ఒక జన్యుపరమైన వ్యాధి అని వైద్యులు చెబుతున్నారు. అంటే పుట్టుకతోనే ఈ వ్యాధి అనేది పిల్లల్లో వస్తుంది. అయితే కొందరికి వెంటనే ఈ వ్యాధి లక్షణాలు కనిపించగా, మరికొందరికి మాత్రం ఆలస్యంగా వెలుగుకి వస్తాయి. ఈ వ్యాధి ఎక్కువగా మగ పిల్లల్లో వస్తుందని వైద్యులు చెబుతున్నారు. వారిని ఈ డుచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ అనే  వ్యాధి ప్రభావితం చేస్తుంది. ఇక ఈ వ్యాధి సోకిన వారికి  కండరాల్లో బలహీనత ఏర్పడుతుంది. అంతేకాక ఈ వ్యాధి తీవ్రమైతే కాళ్లు చచ్చుపడతాయని వైద్యులు చెబుతున్నారు.  నాలుగు ఏళ్ల  వయస్సు నుంచి ఈ వ్యాధి  వస్తుంది.  అంత చిన్న వయస్సులో సోకిన ఆ వ్యాధి ఊహకందని విధంగా వేగంగా వ్యాప్తి చెందుతుంది. పలు జన్యు పరమైన లోపాలు, వంశపారపర్యంగా మగపిల్లలో సంభవించే నాడీ కండరాల రుగ్మతగా వైద్యులు తెలిపారు.

ఇక ఈ వ్యాధి సోకిన పిల్లలు తీవ్రమైన కండరాల బలహీనతకు లోనవుతారు. అంతేకాక నడవలేకపోవడం, శ్వాసకోశ సమస్య వంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలోనూ ఇద్దరు అన్నదమ్ములు ఈ వ్యాధి బారిన పడటం సంగతి తెలిసింది. ఆ సమయంలోనే ఈ డుచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ అనే వ్యాధి గురించి వెలుగులోకి వచ్చింది. ఎక్కడ ఇతర దేశాల్లో కనిపించే ఈ వ్యాధి తెలంగాణలో కనిపించడంతో అందరీలోనూ తీవ్ర ఆందోళనలు రేకెత్తించాంది.

ఇక ఈ వ్యాధి గురించి తెలుసుకుంటే అనేక ఆసక్తికర విషయాలు ఉన్నాయి. ఇటీవలే ఈ వ్యాధి సోకిన తెలంగాణకు చెందిన ఇద్దరు సోదరులు నాలుగేళ్ల పాటు  అందరీ పిల్లల మాదిరిగానే చాలా సాధారణంగా ఉన్నారు. చక్కగా ఆడుతూ పాడుతూ, చలాకీగా ఉండేవారు. అయితే అకస్మాత్తుగా ఒకసారి పెద్ద అబ్బాయి శారీరకంగా బలహీనంగా మారడం ప్రారంభమైంది. దీంతో ఆ పిల్లాడి తల్లిదండ్రులు వైద్యులను సంప్రదించగా అసలు విషయం తెలిసి..షాకయ్యారు.

ఇది జన్యుపరమైన వ్యాధి అని చెప్పడంతో..వెంటనే వారి చిన్న కుమారుడికి కూడా పరీక్షలు చేయించారు. దీంతో ఇద్దరూ సోదరులు ఈ మస్కులర్ డిస్ట్రోపీ వ్యాధి బారిన పడ్డట్లు వైద్యులు తెలిపారు.  ఒకే తల్లి కడుపులో పుట్టిన పిల్లలకు ఈ వ్యాధి సోకే అవకాశం 99 శాతం ఉంటుందని డాక్టర్లు తెలిపారు.  ఈ వ్యాధి సోకిన పిల్లలు యుక్త వయస్సుదాటి జీవించడం కష్టమేనని వైద్యులు తెలిపారు. ఈ వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ యాక్టర్ అవసరాల శ్రీనివాస్ కూడా ఈ వ్యాధిపై అవగాహన కల్పించే ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. మరి.. ఈ విచిత్రమైన వ్యాధి గురించి మీ  అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.