Dharani
వడదెబ్బ బారిన పడకుండా వేసవిలో చాలా మంది ఓఆర్‌ఎస్‌లు తాగుతుంటారు. అయితే వీటి వల్ల ప్రాణాలకు ప్రమాదం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆ వివరాలు..
వడదెబ్బ బారిన పడకుండా వేసవిలో చాలా మంది ఓఆర్‌ఎస్‌లు తాగుతుంటారు. అయితే వీటి వల్ల ప్రాణాలకు ప్రమాదం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆ వివరాలు..
Dharani
మిగతా కాలాలతో పోలిస్తే.. వేసవిలో ఓఆర్‌ఎస్‌ల వాడకం ఎక్కువవుతుంది. వేసవిలో అధిక వేడి వల్ల శరీరం నీటిని కోల్పోయి.. డీహైడ్రేట్ అవుతుంది. దాంతో చాలా మంది ఓఆర్‌ఎస్‌లు తాగుతారు. అయితే ఈమధ్యకాలంలో చాలా మంది ఓఆర్‌ఎస్‌లు తాగి అనారోగ్యం పాలై ఆస్పత్రిలో చేరుతున్నారని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా ఓఆర్‌ఎస్‌లు అంటే.. వడదెబ్బ తగిలిన సమయంలో తక్షణం ఉపశమనం ఇచ్చే పానీయం. కానీ ప్రస్తుతం అవే జనాల ప్రాణాల మీదకు తెస్తున్నాయంట. దాంతో వైద్యులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కనుక వేసవిలో ఓఆర్‌ఎస్‌లు ఎక్కువగా తాగే వారి ప్రాణాలకు ప్రమాదం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆ వివరాలు..
ప్రస్తుత కాలంలో కావేవీ నకిలీకి అనర్హం అన్నట్లుగా మారింది పరిస్థితి. నీళ్ల దగ్గర నుంచి ప్రతి దాన్ని కల్తీ చేస్తున్నారు. ఇక వీటి జాబితాలోకి ఓఆర్‌ఎస్‌లు కూడా చేరాయి. కొందరు నకిలీ ఓఆర్‌ఎస్‌లు తయారు చేసి మార్కెట్‌లోకి తీసుకొస్తున్నారు. వీటిల్లో షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉంటాయన్నారు వైద్యులు. ఒకవేళ డయాబెటీస్ పేషెంట్లు కనక ఈ నకిలీ ఓఆర్‌ఎస్‌లను తరచుగా తీసుకుంటే.. వారిలో షుగర్ లెవల్స్ ఎక్కువై ప్రాణాపాయం కలగవచ్చని చెప్పారు.
‘‘బ్లడ్ షుగర్‌ను ఇన్సులిన్ ఎనర్జీగా మారుస్తుంది. షుగర్ లెవల్స్ పెరిగినప్పుడు ఎక్కువ ఇన్సులిన్ అవసరం అవుతుంది. కానీ, డయాబెటీస్ పేషెంట్లలో ఇన్సూలిన్ ఉత్పత్తి సరిపోక.. షుగర్ లెవల్స్ ఒక్కసారిగా ఎక్కువైపోతాయి. నకిలీ ఓఆర్‌ఎస్ తీసుకున్నప్పుడు ఇదే జరుగుతోంది. ఓ వైపు షుగర్ లెవల్స్ పెరగడంతో పాటు, మరోవైపు డీహైడ్రేషన్‌కు గురై అనారోగ్యం పాలవుతున్నారు. చివరకు ఇది ప్రాణాల మీదకు తెస్తుంది” అని హెచ్చరిస్తున్నారు వైద్యులు.
ఎండాకాలంలో వడ దెబ్బ బారిన పడకూడదన్న ముందు జాగ్రత్తతో చాలా మంది ఓఆర్‌ఎస్ తాగుతారు. కానీ ఆశ్చర్యంగా దాని వల్లే డీహైడ్రేషన్ బారిన పడుతున్నారని డాక్టర్లు చెబుతున్నారు. నకిలీ ఓఆర్‌ఎస్‌లు బ్లడ్ సెల్స్ నుంచి వాటర్‌ను బయటకు తీసి రక్తనాళాల్లోకి పంపిస్తాయని వైద్యులు వివరిస్తున్నారు. దీనివల్ల ఒంట్లో ఉన్న వాటర్ యూరిన్ రూపంలో బయటకు పోయి డీహైడ్రేషన్ అవుతుందన్నారు. డయేరియా బారిన పడిన పిల్లలకు కూడా తల్లిదండ్రులు లిక్విడ్ ఓఆర్‌ఎస్‌ల పేరిట మార్కెట్‌లో ఉన్న నకిలీ ఓఆర్‌ఎస్‌లను తాగిస్తున్నారని, దీని వల్ల పిల్లల పరిస్థితి మరింత దిగజారుతోందని చెప్పారు. డీహైడ్రేషన్ ఎవరికైనా చాలా ప్రమాదమేనని, డయబెటీస్ పేషెంట్లకు అది మరింత డేంజర్ అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కనుక వేసవిలో ఓఆర్‌ఎస్‌లు తాగే వారు.. డబ్ల్యూహెచ్‌వో ఫార్ములా ప్రకారం తయారు చేసిన వాటిని మాత్రమే వినియోగించాలని సూచిస్తున్నారు.