iDreamPost
android-app
ios-app

బాగా టెన్షన్‌లో ఉన్నప్పుడు అస్సలు తినకండి! తింటే ఏమవుతుందంటే..?

  • Published Jun 18, 2024 | 9:47 PM Updated Updated Jun 19, 2024 | 10:15 AM

Junk Food, Health News: ప్రస్తుతం ఉరుకులు పరుగుల జీవితంలో ప్రతి చిన్న విషయానికి కంగారు, టెన్షన్‌ పడిపోతున్నారు.. అయితే.. టెన్షన్‌లో ఉన్న సమయంలో మాత్రం కొన్ని ఆహార పదార్థాలు తినకూడదు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Junk Food, Health News: ప్రస్తుతం ఉరుకులు పరుగుల జీవితంలో ప్రతి చిన్న విషయానికి కంగారు, టెన్షన్‌ పడిపోతున్నారు.. అయితే.. టెన్షన్‌లో ఉన్న సమయంలో మాత్రం కొన్ని ఆహార పదార్థాలు తినకూడదు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Jun 18, 2024 | 9:47 PMUpdated Jun 19, 2024 | 10:15 AM
బాగా టెన్షన్‌లో ఉన్నప్పుడు అస్సలు తినకండి! తింటే ఏమవుతుందంటే..?

కొంతమందికి విచిత్రమైన అలవాట్లు ఉంటాయి. బాధలో ఉన్నప్పుడు కొంతమంది చాలా ఎక్కువ తినేస్తుంటారు. అలాగే కొంతమందికి టెన్షన్‌లో ఎక్కువ ఫుడ్‌ కావాలి. అయితే.. మనం బాగా టెన్షన్‌లో ఉన్న సమయంలో కొన్ని ఫుడ్స్‌ను అస్సలు తినొద్దు. ప్రస్తుతం బిజీబిజీ లైఫ్‌తో ప్రతి చిన్న విషయానికి కూడా టెన్షన్‌ పడిపోతుంటారు.. అలా టెన్షన్‌లో ఉన్న సమయంలో సమోసాలు, బర్గర్లు తింటే మంచిది కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సాధారణంగా టెన్షన్‌లో ఉన్న సమయంలో కొంతమంది ఆకలి వేస్తుంది.. ఆ సమయంలో ఎక్కువ జంక్‌ ఫుడ్‌ తినేందుకు చాలా మంది ఇష్టపడుతున్నారని పలు సర్వేల్లో తేలింది.
అయితే.. అలా టెన్షన్‌లో ఉన్న సయమంలో లేదా ఆందోళనకు గురవుతున్న టైమ్‌లో జంక్‌ ఫుడ్‌ తినడం వల్ల ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. బౌల్డర్‌లోని కొలరాడో యూనివర్సిటీలో జరిపిన అధ్యయనం ప్రకారం.. అధిక కొవ్వు ఉండే ఆహరం తీసుకుంటే పేగుల్లో బ్యాక్టీరియాకు అంతరాయం కలిగిస్తుంంది, అది మన మూడ్‌లో మార్పులుచేస్తుంది. మొదడులోని రసాయనాలను ప్రభావితం చేసి.. మరింత ఆందోళనకు గురి అయ్యేలా చేస్తోందని అధ్యాయనంలో తేలింది. అధిక కొవ్వు గల ఆహారం మెదడులోని జన్యవులను మార్చగలదని కొలరాడో యూనివర్సిటీ ఫ్రొపెసర్‌ క్రిస్టోఫర్‌ లోరీ చెప్పారు.
ఎక్కువ కొవ్వు వల్ల మనలో ఆందోళన మరింత పెరుగుతుంది. మెదడులో ఆందోళన స్థితికి ఈ అధిక కొవ్వే కారణం అవుతుంది. అధిక కొవ్వు ఆహారం న్యూరోట్రాన్స్మిటర్‌ సెరోటోనిన్‌ ఉత్పత్తి, సిగ్నలింగ్‌లో పాల్గొన్న మూడు జన్యువుల్లో మార్పుతో ఒత్తిడి, ఆందోళన ముడిపడి ఉంటుంది.  కొవ్వు మంచిదని కాదని.. అన్ని మానేస్తా అంటూ కూడా కుదరదు. కొవ్వులో కూడా మంచి కొవ్వు, చెడు కొవ్వు ఉంటాయి. చేపలు, ఆలివ్‌ నూనె, వంటివి మంచి కొవ్వులు కిందికి వస్తాయి. ఇవి మెదడకు ఒత్తిడి తగ్గిస్తాయి. మరి ఇక నుంచి టెన్షన్‌లో ఉన్న సమయంలో ఫాస్ట్‌ ఫుడ్‌, జంక్‌ ఫుడ్‌ తినకుండా మీ ఆరోగ్యాన్ని మరే కాపాడుకోండి.