iDreamPost
android-app
ios-app

మహిళల్లో నయా ట్రెండ్! బ్రెస్ట్ సైజ్ తగ్గించుకునేందుకు ఆపరేషన్లు!

అమ్మాయిలు సౌందర్యానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో అందరికీ తెలుసు. అయితే ఈ మధ్య శరీరాకృతి కోసం కూడా మెడిసన్లతో పాటు శస్త్ర చికిత్సలు చేయించుకుంటున్నారు. అలాగే ఇప్పుడు నయా ట్రెండ్ సెట్ చేస్తున్నారు.

అమ్మాయిలు సౌందర్యానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో అందరికీ తెలుసు. అయితే ఈ మధ్య శరీరాకృతి కోసం కూడా మెడిసన్లతో పాటు శస్త్ర చికిత్సలు చేయించుకుంటున్నారు. అలాగే ఇప్పుడు నయా ట్రెండ్ సెట్ చేస్తున్నారు.

మహిళల్లో నయా ట్రెండ్! బ్రెస్ట్ సైజ్ తగ్గించుకునేందుకు ఆపరేషన్లు!

అమ్మాయిలు అందం కోసం విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టడం ఇటీవల కాలంలో పెరిగింది. మేకప్, ఫేషియల్స్ చేయించుకోవడం.. అవసరమైతే ప్లాస్టిక్ సర్జరీల వైపు కూడా మళ్లుతున్నారు. బ్యూటీగా కనిపించేందుకు తమపై ప్రయోగాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు శరీరాకృతి కోసం కూడా విపరీతంగా మెడిసన్స్ వాడటమే కాదు..బేరియాట్రిక్ సర్జరీ వంటివి కూడా చేయించుకుంటున్నారు. ఇప్పుడు ఈ పిచ్చి పీక్స్‌కు చేరుతుంది. ఇప్పుడు అవయవాలకు కూడా ప్రత్యేకమైన ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. ముఖ్యంగా గతంలో బ్రెస్ట్ పెరగడానికి నటీమణులు ఆపరేషన్లు చేయించుకుంటున్నారని వార్తలు వినిపించేవి. కానీ నేడు తగ్గించుకోవడానికి ఆపరేషన్ల బాట పడుతున్నారట ఇండియన్ నారీమణులు.

గడిచిన కొన్నాళ్ల నుండి రొమ్ము సైజు తగ్గించుకునేందుకు శస్త్ర చికిత్సలు చేయించుకుంటున్న మహిళల సంఖ్య నానాటికి పెరిగిందని వైద్యులు చెబుతున్నారట.  2019 నుండి ఇప్పటి వరకు వంద శాతం పెరిగిందని పేర్కొంటున్నారు. బ్రెస్ట్ సైజ్ పెద్దగా ఉన్న మహిళలు దీని వైపు మక్కువ చూపుతున్నారని తేలింది. ఉద్యోగాలు చేస్తున్న మహిళలు ఎక్కువగా ఈ ఆపరేషన్ల వైపు మళ్లుతున్నారని చెబుతున్నారు డాక్టర్స్. సమాజంలో బ్రెస్ట్ సైజ్ పరిమాణం ఎక్కువ ఉంటే వెకిలి చూపులు చూడటం, హేళన చేయడం, బాడీ షేమింగ్ వంటి పరిణామాలు, అవమానాలతో కుంగిపోయిన మహిళలు బ్రెస్ట్ రిడక్షన్ ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. వీటితో తోడు బ్యూటీకి అధిక ప్రాధాన్యతనివ్వడంతో పాటు విదేశీ సంస్కృతి ప్రభావం, ఫ్రీడమ్ ఇవన్నీ కూడా ఈ శస్త్ర చికిత్సలకు పురుడు పోస్తున్నాయని అంటున్నారు.

ఇప్పుడు ప్రతి ఒక్క అమ్మాయి, మహిళా స్వాతంత్ర్యంగా బతుకుతోంది. సమాజంలో కొత్త పోకడలు వచ్చాయి. విదేశీ సంస్కృతి వచ్చి చేరింది. దీంతో చీరలు, కుర్తాలు మానేసి.. టీ షర్టులు, షర్ట్, షార్ట్ టాప్స్ వంటి బిగుతైన దుస్తులు ధరిస్తున్నారు. దీంతో బరువైన ఛాతి కారణంగా.. దీంతో మెడ, భుజం, కొన్ని ప్రాంతాల్లో నొప్పికి దారి తీస్తుంది. ఇదే రొమ్ము తగ్గించే ఆపరేషన్లకు కారణమని అంటున్నారు ఢిల్లీలోని ప్లాస్టిక సర్జన్ డాక్టర్ అమిత్ గుప్తా. అలాగే సోషల్ మీడియా ప్రభావం కూడా వీరిపై పడుతుందని, సోషల్ మీడియాను ఫాలో అయ్యే ప్రతి ఒక్కరు కూడా.. తమ ఫోటోలను అప్ లోడ్ చేస్తున్నారు. దీంతో తమ ఎద అందాలు ఫోటోలో గంభీరంగా కనిపిస్తున్నాయన్న ఉద్దేశంతో కూడా ఈ ఆపరేషన్ల వైపు మొగ్గు చూపుతున్నారని చెబుతున్నారు. అయితే దీని వల్ల తీవ్రమైన దుష్ర్పభావాలు ఉంటాయని కూడా హెచ్చరిస్తున్నా డాక్టర్స్. చనుమొన తిమ్మిరి, నొప్పి రావొచ్చునని, అది శాశ్వతంగా ఉండొచ్చని అంటున్నారు. చాలా వరకు ఈ ఆపరేషన్ జోలికి వెళ్లకపోవడమే మంచిదని సూచిస్తున్నారు.