iDreamPost
android-app
ios-app

బీచ్‌లో బీర్ బాటిల్‌తో స్టార్ హీరోయిన్!

బీచ్‌లో బీర్ బాటిల్‌తో స్టార్ హీరోయిన్!

తెలుగు తెరపై మెరిసిన కేరళ ముద్ద మందారం అమలాపాల్. 2009లో మలయాళ సినిమా ద్వారా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ చిన్నది అనతికాలంలో మంచి పేరు తెచ్చుకుంది. తమిళంలో మైనా (తెలుగులో ప్రేమ ఖైదీ పేరుతో డబ్ అయ్యింది) మూవీతో ఆమెకు క్రేజ్ వచ్చింది. వరుసగా తమిళ, మలయాళ సినిమాలతో స్టార్ హోదాను సొంతం చేసుకుని, టాప్ హీరోయిన్ రేంజ్‌కు చేరింది. ఆ తర్వాత తెలుగు పరిశ్రమలోకి తన పాదాన్ని మోపింది. బెజవాడ సినిమాలో నాగ చైతన్య పక్కన నటించి మెప్పించింది. తెలుగులో పస్ట్ సినిమాతో ప్లాప్ మూటగట్టుకున్నప్పటికీ.. అమ్మడి అవకాశాలకు మాత్రం ఏ కొదవ రాలేదు. ఆ వెంటనే మెగా కౌంపౌండ్ హీరోలతో జతకట్టింది. రామ్ చరణ్ పక్కన నాయక్, అల్లు అర్జున్ సరసన ఇద్దరు అమ్మాయిలతో వంటి చిత్రాల్లో మెరిసింది. తమిళ, మలయాళ పరిశ్రమలను బ్యాలెన్స్ చేస్తూ సినిమాలు చేస్తూ వస్తుంది.

ఆ సమయంలోనే ప్రముఖ దర్శకుడు ఎల్. విజయ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. ఆ తర్వాత రఘవరన్ బీటెక్ వంటి హిట్ చిత్రాల్లో నటించింది. మూడు పరిశ్రమలను చుట్టేస్తూ సినిమాలు చేసుకుంటూ పోతోంది. తెలుగులో నానితో జెండాపై కపిరాజులో చివరి సారిగా కనిపించింది. అయితే 2017లో మనస్పర్థల కారణంగా విజయ్‌తో విడిపోయిన అమలా పాల్.. తన కెరీర్‌పై దృష్టి పెట్టింది. మరింత నాజుకుగా మారి, గ్లామర్ గేట్లు తెరిచేసింది. రఘువీరన్ బీటెక్-2, భాస్కర్ ఒరు రాస్కెల్, రాక్షసన్ వంటి హిట్ చిత్రాల్లో కనిపించింది. ఆ తర్వాత ఆడై అనే సినిమాలో న్యూడ్ పాత్రలో కనిపించి అభిమానులు నోరెళ్లబెట్టేలా చేసింది. ఆ తర్వాత కూడా గ్లామరస్ పాత్రల్లో మెప్పిస్తూ ప్రేక్షకులను కనువిందు చేస్తుంది. తెలుగులో పిట్టకథలు అనే వెబ్ సిరీస్‌లో కనిపించింది. అందాల ప్రదర్శనతో పాటు సినిమాలు చేయడంలో గతం కంటే మరింత స్పీడ్ పెంచిన ఈ భామ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. తన ఫోటో షూట్లు, టూర్లకు సంబంధించిన ఫోటోలను పోస్టు చేస్తూ ఉంటుంది.

ఎప్పటికప్పుడు టూర్ల పేరుతో సముద్ర ప్రాంతాలకు వెళుతూ.. బికినీలు, షార్ట్స్ వేస్తూ.. హాట్ హాట్ ఫోజులిస్తూ.. ఆ ఫోటోలను నెట్టింట్లో షేర్ చేస్తూ.. కుర్రాళ్ల మతులు పొగొడుతుంది. టెంప్టింగ్ లుక్స్‌తో మెస్మరైజ్ చేస్తూ ఎప్పుడూ ట్రెండింగ్‌లో నిలుస్తుంది. తాజాగా ఓనం సందర్భంగా కేరళ కట్టుబొట్టుతో కట్టిపడేసిన ఈ చందమామ.. తాజాగా ఓ బీచ్ ఒడ్డున సేద తీరుతూ కనిపించింది. దీనికి సంబంధించిన పిక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. మంచి బజ్ క్రియేట్ అయ్యింది. బ్లాక్ అండ్ బ్లాక్ లుక్స్‌లో సముద్రం అందాలను ఆస్వాదిస్తున్న ఈ చిన్నది ఓ విషయంలో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. అదేంటంటే ఆ ఫోటోలో బీర్ బాటిల్ కనిపించింది. ఆమెను కాకుండా ఆ పక్కన టేబుల్‌పై ఉన్న బీర్ బాటిల్ పై నెటిజన్ల కన్ను పడింది. బీర్ ఖాళీ చేసిన బాటిల్ అక్కడ ఉండటంపై కొందరు బుగ్గలు నొక్కుకుంటారు. బీర్ బాటిల్ చూడకుండానే ఫోటో షేర్ చేసిందా లేక కావాలనే చేసిందా..? అన్న సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైమైనా కొంత మంది సోషల్ సైనికులు ఫైర్ సింబల్స్ ఇస్తూ.. లవ్ యూ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Amala Paul (@amalapaul)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి