iDreamPost
android-app
ios-app

కాబోయే భర్తకు ఉండాల్సిన లక్షణాలు చెప్పిన స్టార్ హీరోయిన్! లిస్ట్ లో మీరున్నారేమో చూస్కోండి..

  • Author Soma Sekhar Published - 05:42 PM, Wed - 21 June 23
  • Author Soma Sekhar Published - 05:42 PM, Wed - 21 June 23
కాబోయే భర్తకు ఉండాల్సిన లక్షణాలు చెప్పిన స్టార్ హీరోయిన్! లిస్ట్ లో మీరున్నారేమో చూస్కోండి..

పెళ్లీడుకు వచ్చిన అమ్మాయిలకు తమకు కాబోయేవాడు అలా ఉండాలి.. ఇలా ఇండాలి అంటూ కోన్ని కోరికలు ఉంటాయి. అలాగే సెలబ్రిటీలకు సైతం తమకు కాబోయే భర్తకు ఫలానా క్వాలిటీస్ ఉండాలి అంటూ లక్షణాలు చెప్పుకొస్తారు. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ తనకు కాబోయేవాడికి ఉండాల్సిన లక్షణాలను చెప్పుకొచ్చింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు మన తెలుగు అమ్మాయే. ఇక ఈ హీరోయిన్ ఓ స్టార్ హీరోతో డేటింగ్ లో ఉందంటూ గత కొన్ని రోజులగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తనకు కాబోయే భర్తకు ఇలాంటి లక్షణాలు ఉండాలి అంటూ లిస్ట్ చెప్పుకొచ్చింది. మరి ఆ లిస్ట్ లో మీరున్నారేమో చూసుకోండి.

శోభిత ధూళిపాళ.. అచ్చమైన తెలుగమ్మాయి. గూఢాచారి సినిమా ద్వారా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ భామ. అయితే అంతకంటే ముందే బాలీవుడ్ లో అడుగుపెట్టింది. అయితే సినిమాలతో కంటే హీరో అక్కినేని నాగచైతన్యతో డేటింగ్ లో ఉందనే వార్తలతోనే వైరల్ అయ్యింది ఈ బ్యూటీ. ఓ సారి లండన్ వెకేషన్ లో, మరోసారి రెస్టారెంట్ లో ఇద్దరు కలిసి జంటగా కనిపించడంతో.. డేటింగ్ గాసిప్స్ ఇండస్ట్రీ మెుత్తం వ్యాపించాయి. అయితే ఈ వార్తలపై ఇద్దరు కూడా నోరు విప్పలేదు. ఇక తాజాగా ఈ అమ్మడు ది నైట్ మేనేజర్ 2తో ప్రేక్షకుల ముందుకురాబోతోంది.

ఈ నేపథ్యంలోనే ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..”నన్ను పెళ్లి చేసుకునే వ్యక్తికి ఇలాంటి లక్షణాలు ఉండాలి. లైఫ్ లో ఎంత ఎదిగినా గానీ ఒదిగి ఉండాలి. ఇతరుల పట్ల దయ, మంచి మనసు, సింపుల్ గా ఉండాలి. నేచర్ లవర్ అయ్యి ఉండాలి, లైఫ్ ఈజ్ షార్ట్ అనే జీవిత సత్యాన్ని అర్థం చేసుకోవాలి” ఇలాంటి లక్షణాలన్ని అతడిలో ఉండాలని చెప్పుకొచ్చింది గూఢాచారి బ్యూటీ. ఇక తనపై వస్తున్న రూమర్స్ పై కూడా స్పందించింది శోభిత. నేను ఎవరైనా నా వర్క్ గురించి మాట్లాడితే సంతోషిస్తాను. ఎందుకంటే చాలా ఆడిషన్స్ తర్వాత నాకు హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కష్టపడుతూనే ఉన్నానని శోభిత చెప్పుకొచ్చింది. డేటింగ్ లాంటి వార్తలు నన్ను ఇబ్బంది పెట్టలేవని ఆమె తెలిపింది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş