iDreamPost
android-app
ios-app

కృష్ణకు మాత్రమే సాధ్యమైంది.. భవిష్యత్తులో మరో హీరోకు సాధ్యం కాదు..

కృష్ణకు మాత్రమే సాధ్యమైంది.. భవిష్యత్తులో మరో హీరోకు సాధ్యం కాదు..

ప్రపంచ సినీ చరిత్రలో ఆ రికార్డు సూపర్ స్టార్ కృష్ణకు మాత్రమే సాధ్యమైంది.. భవిష్యత్తులో మరో హీరోకు సాధ్యం కాదు.. అవును నటశేఖర కృష్ణ క్రియేట్ చేసిన ఈ రికార్డు అందుకోవడం ఇక ఎవరికీ సాధ్యం కాకపోవచ్చు. ఆయన మహాభినిష్క్రమణం సందర్భంగా ఆ రికార్డు ఏంటో చూద్దాం..

స్క్రీన్ మీద ఒక్క హీరోను చూస్తేనే ఖుషీ అయ్యే జనాలు..ఒకే రకంగా ఇద్దరు హీరోలను చూస్తే డబుల్ ఖుషీ అవుతారు. ఇక త్రిపుల్ రోల్ చేస్తే ఆ ఆనందాని అవధులు ఉండవు. ఈ రకంగా ఒకే సినిమాలో మూడు లేదా అంతకంటే ఎక్కువ పాత్రలు చేసి మెప్పించిన హీరోల్లో చాలా మంది హీరోలున్నారు. తెలుగులో సూపర్ స్టార్ కృష్ణ తెలుగులో ఎక్కువ చిత్రాల్లో త్రిపుల్ రోల్ చేసిన హీరోగా రికార్డులకు ఎక్కారు. ఈయన నటించిన త్రిపుల్ రోల్ సినిమాల విషయానికొస్తే..

 Super Star Krishna : ప్రపంచ సినీ చరిత్రలో ఆ రికార్డు సూపర్ స్టార్ కృష్ణకు మాత్రమే సాధ్యమైంది.. భవిష్యత్తులో మరో హీరోకు సాధ్యం కాదు.. అవును నటశేఖర కృష్ణ క్రియేట్ చేసిన ఈ రికార్డు అందుకోవడం ఇక ఎవరికీ సాధ్యం కాకపోవచ్చు. ఆయన మహాభినిష్క్రమణం సందర్భంగా ఆ రికార్డు ఏంటో చూద్దాం..  (File/Photo)

కుమార రాజా.. సూపర్ స్టార్ కృష్ణ తొలిసారి త్రిపాత్రాభినయం చేసిన తొలి చిత్రం ‘కుమారాజా’. ఈ సినిమా. ఈ చిత్రం కన్నడలో రాజ్‌కుమార్ హీరోగా నటించిన ‘శంకర్ గురు’ సినిమాకు రీమేక్. ఈ సినిమాను తెలుగులో కృష్ణ.. తెలుగులో తండ్రి ఇద్దరు కొడుకులుగా త్రిపాత్రాభినయం చేసారు. పి.సాంబశివరావు డైరెక్ట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది.

డాక్టర్ సినీ యాక్టర్.. సూపర్ స్టార్ కృష్ణ రెండోసారి త్రిపాత్రాభినయం చేసిన మూవీ ‘డాక్టర్ సినీ యాక్టర్’. ఈ సినిమాలో కృష్ణ, తనయుడు, మేనల్లుడుగా త్రిపాత్రాభినయం చేసారు. మేనమామ పోలికలున్న మేనల్లుడు పాత్రలో కృష్ణ నటించారు. ఇందులో ఒక హీరో డాక్టర్‌గా నటిస్తే.. మరొకరు యాక్టర్‌గా నటించారు. తండ్రి పాత్ర చేసిన కృష్ణ డాక్టర్ పాత్రలో నటించడం విశేషం. ఈ సినిమాను విజయ నిర్మల డైరెక్ట్ చేసారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు విజయం సాధించింది.

 స్క్రీన్ మీద ఒక్క హీరోను చూస్తేనే ఖుషీ అయ్యే జనాలు..ఒకే రకంగా ఇద్దరు హీరోలను చూస్తే డబుల్ ఖుషీ అవుతారు. ఇక త్రిపుల్ రోల్ చేస్తే ఆ ఆనందాని అవధులు ఉండవు. ఈ రకంగా ఒకే సినిమాలో మూడు లేదా అంతకంటే ఎక్కువ పాత్రలు చేసి మెప్పించిన హీరోల్లో చాలా మంది హీరోలున్నారు. తెలుగులో సూపర్ స్టార్ కృష్ణ తెలుగులో ఎక్కువ చిత్రాల్లో త్రిపుల్ రోల్ చేసిన హీరోగా రికార్డులకు ఎక్కారు. ఈయన నటించిన త్రిపుల్ రోల్ సినిమాల విషయానికొస్తే.. (Twitter/Photo)

పగపట్టిన సింహం.. కృష్ణ మూడోసారి త్రిపాత్రాభినయం చేసిన సినిమా ‘పగపట్టిన సింహం’. ఈ సినిమాను పి.చంద్రశేఖర్ రెడ్డి డైరెక్ట్ చేసారు. ఈ సినిమాలో కృష్ణ.. గూండాగా.. పోలీస్ ఆఫీసర్‌గా.. లాయర్‌గా మూడు పాత్రల్లో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది.

సిరిపురం మొనగాడు.. కృష్ణ నాలుగో సారి త్రిపాత్రాభినయం చేసిన మూవీ ‘సిరిపురం మొనగాడు’. ఈ సినిమాను కే.యస్.ఆర్. దాస్ డైరెక్ట్ చేసారు. ఈ సినిమాలో కృష్ణ తండ్రీ కొడుకులుగా పోలీస్ ఆఫీసర్‌గా.. విలన్‌గా మూడు పాత్రల్లో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.

Krishna Passed Away: ఆ ఒక్క సినిమాతో ఇండస్ట్రీ షేక్.. వరుసగా 12 సినిమాలు ఫ్లాప్

బంగారు కాపురం.. సూపర్ స్టార్ కృష్ణ ఐదోసారి త్రిపాత్రాభినయం చేసిన మూవీ ‘బంగారు కాపురం’. ఈ చిత్రంలో కృష్ణ.. తండ్రీ ఇద్దరు కుమారులుగా నటించారు. ఈ చిత్రం ఒక రకంగా రాముడు భీముడు తరహాలో ఉంటోంది. పి.చంద్రశేఖర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది.

రక్త సంబంధం.. విజయ నిర్మల దర్శకత్వంలో కృష్ణ.. తండ్రీ ఇద్దరు తనయులుగా త్రిపాత్రాభినయం చేసిన మూవీ రక్త సంబంధం. ఈ సినిమా తమిళంలో శివాజీ గణేషన్ త్రిపుల్ రోల్లో యాక్ట్ చేసిన ‘దైవమగన్’ సినిమాకు రీమేక్. ఈ సినిమాను తెలుగులో ‘కోటీశ్వరుడు’ పేరుతో డబ్ చేసారు కూడా. ఆ తర్వాత కృష్ణ ఆరో సారి త్రిపాత్రాభినయం చేసారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సరైన విజయాన్ని అందుకోలేదు.

సూపర్‌ స్టార్‌ కృష్ణ రేర్‌ ఫోటోస్‌ః శోభన్‌బాబు, కృష్ణంరాజు, శ్రీదేవి, చిరు, బాలయ్య, పవన్‌, ప్రభాస్‌, మహేష్‌లతో | superstar krishna rare photos with sridevi sobhanbabu ...

బొబ్బలి దొర.. సూపర్ స్టార్ కృష్ణ హీరోగా త్రిపాత్రాభినయం చేసిన ఏడో చిత్రం ’బొబ్బిలి దొర’. బోయపాటి కామేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కృష్ణ సరసన విజయ నిర్మల, సంఘవి నటించారు. ఈ సినిమాలో కృష్ణ అన్నాదమ్ములుగా నటించారు. మరో కృష్ణ ఒక హీరో కుమారుడి పాత్రలో నటించారు. ఈ సినిమా బాక్పాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. మొత్తంగా భారతీయ సినీ పరిశ్రమలో.. కాదు కాదు.. ప్రపంచ సినీ చరిత్రలో ఎక్కువ సినిమాల్లో త్రిపాత్రాభినయం చేసిన హీరోగా సూపర్ స్టార్ కృష్ణ రికార్డులకు ఎక్కారు.