iDreamPost
android-app
ios-app

పక్కదారి పడుతున్న రీ రిలీజులు..

పక్కదారి పడుతున్న రీ రిలీజులు..

పాత సినిమాలను కొత్త రీ మాస్టర్ ప్రింట్లతో చూసుకోవడం ఏ హీరో అభిమానులకైనా కిక్ ఇచ్చే విషయమే. అందులోనూ ఇరవై ఏళ్ళ క్రితం బ్లాక్ బస్టర్స్ ని థియేటర్లలో మిస్ అయిన ఇప్పటి కుర్రకారు వాటిని చూడాలన్న ఉత్సుకత కలిగి ఉండటం తప్పేం కాదు. అందుకే తమ్ముడు, జల్సా, ఒక్కడు, చెన్నకేశవరెడ్డి లాంటి వాటికి భారీ స్పందన దక్కింది. ఇటీవలే నువ్వే నువ్వే లాంటి స్టార్లు లేని మూవీకి సైతం కేవలం త్రివిక్రమ్ బ్రాండ్ మీద ఏ సెంటర్స్ లో మంచి ఓపెనింగ్స్ దక్కాయి. హిట్ చిత్రాలు వేసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే ఈ క్రేజ్ ని క్యాష్ చేసుకుందామని డిజాస్టర్లను యావరేజ్ లను తీసుకొచ్చి రుద్దే ప్రయత్నం చేయడం మాత్రం కరెక్ట్ కాదు.

4కే వెర్షన్‌లో `బిల్లా` రీ రిలీజ్‌.. వసూళ్లన్ని ఆ ఫౌండేషన్‌కి విరాళం  ప్రకటించిన కృష్ణంరాజు కూతురు..

గత నెల ప్రభాస్ పుట్టినరోజుని పురస్కరించుకుని బిల్లా వేశారు. సరే అదంటే బాగానే ఆడింది కాబట్టి ఫ్యాన్స్ కి చూపించడం న్యాయమే. దానికి వారం ముందు రెబెల్ స్క్రీన్ చేశారు. డార్లింగ్ కెరీర్లోనే అతి పెద్ద సూపర్ ఫ్లాప్ ఇది. అప్పట్లో దర్శకుడు లారెన్స్ నిర్మాతల మధ్య వివాదానికి దారి తీసింది. ఇప్పుడేమో జూనియర్ ఎన్టీఆర్ బాద్షాని 18న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఇది మరీ పాత సినిమా అయితే ఏదో అనుకోవచ్చు. బ్రహ్మానందంతో శ్రీను వైట్ల చేయించిన కామెడీ, రెండు మూడు పాటలు తప్ప మరీ గొప్పగా ఆడిన దాఖలాలు పెద్దగా లేవు. దీని బదులు ఏ సింహాద్రి, ఆదినో వేసుంటే తారక్ అభిమానుల జోష్ మాములుగా ఉండేది కాదు. కానీ వాటిని లేట్ చేశారు.

Pokiri, Okkadu, Jalsa and Indra: Is the trend of re-releases of old-time  blockbusters here to stay?

సోషల్ మీడియా వేదికగా ఇవి ఫ్యాన్స్ మధ్య ఎమోషన్స్ ని ఆడుకునేలా ప్రేరేపిస్తున్నాయి. యుట్యూబ్ లో చూస్తేనే విసుగొచ్చే కొన్ని సినిమాలను ఇలా రిలీజ్ చేయడం వల్ల ఒకవేళ థియేటర్ ఫుల్ కాకపోతే ఇతర హీరోల అభిమానులు తమను ట్రోలింగ్ చేస్తారన్న ఉద్దేశంతో అదే పనిగా ఆ షోలకు వెళ్తున్న వాళ్ళు కోకొల్లలు. కొన్ని చోట్ల ఉత్సాహం ఎక్కువైపోయి స్క్రీన్లు చింపడం, స్క్రీన్లు కాల్చడం లాంటివి జరిగాయి. ట్రెండ్ ఏదైనా సరే అది మితిమీరనంత వరకు బాగానే ఉంటుంది. చూస్తున్నారు కదాని ఫలితంతో సంబంధం లేకుండా ప్రతిదాన్ని రిలీజ్ చేయడానికి వెళ్తే తర్వాత తేడా కొట్టేస్తుంది. వదలాల్సిన క్లాసిక్స్ చాలానే ఉండగా ఏమిటో ఈ విచిత్ర ప్లానింగ్.