ఇన్నేళ్ల కెరీర్ లో మొదటిసారి జబ్బుపడి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సమంతా కొత్త సినిమా ఈ నెల 11న విడుదల కానుంది. సామ్ వ్యక్తిగతంగా హాజరయ్యే ఛాన్స్ లేకపోవడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందా లేదానే విషయంలో క్లారిటీ లేదు. గతంలో సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ ఫంక్షన్ కి ఇదే సమస్య వచ్చినప్పుడు హీరో లేకుండా పవన్ కళ్యాణ్ ని గెస్ట్ గా పిలిచి పూర్తి చేశారు. కానీ యశోద విషయంలో నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ అలాంటి ప్లాన్ లో ఉన్నట్టు కనిపించడం లేదు. టైటిల్ రోల్ పోషిస్తున్న హీరోయిన్ లేకుండా వేడుక చేయడమంటే ఇబ్బందే. పైగా వచ్చిన వాళ్ళందరూ సినిమాలో కంటెంట్ కన్నా సామ్ మీద సానుభూతినే ఎక్కువ చూపిస్తారు.
సో దాదాపు ఉండకపోవచ్చని అంటున్నారు. ఇక అసలు విషయానికి వస్తే యశోదకు ఫ్రీ గ్రౌండ్ దొరికేసింది. పోటీగా తెలుగు నుంచి పెద్దగా హైప్ ఉన్న స్ట్రెయిట్ సినిమాలేవీ లేవు. మొన్న శుక్రవారం వచ్చిన వాటిలో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఊర్వశివో రాక్షసివోతో సహా దేనికీ గట్టిగా చెప్పుకోదగ్గ వసూళ్లయితే లేవు. వీకెండ్ ని క్యాష్ చేసుకోలేకపోయాయి. మొదటివారమే ఇలా ఉంటే ఇక సెకండ్ వీక్ సిచుయేషన్ ని ఈజీగా గెస్ చేయొచ్చు. అందుకే యశోద కనక ఏ మాత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా ఓపెనింగ్స్ బాగుంటాయి. సరోగసి మాఫియా నేపదంలో మెడికల్ థ్రిల్లర్ గా రూపొందిన యశోద సమంతా కెరీర్ బెస్ట్ అవుతుందనే నమ్మకం టీమ్ లో కనిపిస్తోంది.
ఇదంతా ఓకే కానీ హాలీవుడ్ మూవీ వాకండ ఫరెవర్ నుంచి ఒక్కటే యశోదకు ఏబి సెంటర్స్ లో థ్రెట్ గా మారొచ్చు. పిల్లలు యూత్ దానికోసం ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు. ఒకవేళ యావరేజ్ టాక్ వస్తే పెద్దగా టెన్షన్ పడాల్సిన పని లేదు. మరి సానుభూతి పొజిషన్ లో ఉన్న సమంతాకు యశోద ఎలాంటి బ్రేక్ ఇస్తుందో చూడాలి. మణిశర్మ సంగీతం సమకూర్చిన ఈ యాక్షన్ డ్రామాలో సమంతా రియల్ గా కొన్ని ఫైట్లు కూడా చేసింది. హరి హరీష్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన యశోద కోసమే హాస్పిటల్ బెడ్ నుంచి సుమకు ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చిన సమంతా ఈ విషయంలోనూ తన డెడికేషన్ చూపిస్తోంది. పూర్తిగా కోలుకున్నాక ఖుషి షూట్ కొనసాగిస్తారు.