యశోద 3 రోజుల వసూళ్లు – సాలిడ్..!

  • Published - 01:25 PM, Mon - 14 November 22
యశోద 3 రోజుల వసూళ్లు – సాలిడ్..!

సమంతా టైటిల్ రోల్ పోషించిన యశోద మొదటి వీకెండ్ ని దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. అపోజిషన్ పెద్దగా లేకపోవడంతో ఆ అవకాశాన్ని కలెక్షన్ల రూపంలో వాడుకుంది. బ్లాంక్ పాంథర్ వకాండ ఫరెవర్ రూపంలో మల్టీప్లెక్సుల్లో పోటీ ఇస్తుందని భావించినప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ లో సామ్ కున్న ఫాలోయింగ్ ఆ గండాన్ని దాదాపు తప్పించేసింది. కాంతార తప్ప బాక్సాఫీస్ వద్ద ఇంకే ఆప్షన్ లేకపోవడం యశోదకు దక్కిన అతి పెద్ద సానుకూలాంశం. పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా ఊర్వశివో రాక్షసివో విఫలం చెందటం సమంతా టీమ్ కు కలిసి వచ్చింది. పైగా తన జబ్బు గురించి వీడియోలో చెప్పుకున్న తీరు జనాన్ని కదిలించిన మాట వాస్తవమే.

ఇక వసూళ్ల విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో యశోద 3 రోజులకు గాను 4 కోట్ల 95 లక్షల షేర్ తెచ్చినట్టు ట్రేడ్ సమాచారం. గ్రాస్ ప్రకారం చూసుకుంటే ఇది 8 కోట్ల 75 లక్షల దాకా తేలుతుంది. ఒక్క నైజాం నుంచే అత్యధికంగా 2 కోట్ల 55 లక్షల షేర్ సాధించడం విశేషం. సీడెడ్ 48 లక్షలు, ఉత్తరాంధ్ర 60 లక్షలు, ఈస్ట్ వెస్ట్ 50 లక్షలు, గుంటూరు 33 లక్షలు, కృష్ణా 34 లక్షలు, నెల్లూరు 15 లక్షలు దాకా వచ్చాయి. తమిళ వెర్షన్ 65 లక్షలు రాబట్టగా, రెస్ట్ అఫ్ ఇండియా నుంచి 75 లక్షలు ముటాయి. ఓవర్సీస్ లో అదిరిపోయే రేంజ్లో 2 కోట్లు రాబట్టింది. హిందీలో మాత్రం యశోద ఆశించిన పెర్ఫార్మన్స్ ఇవ్వలేకపోయింది. అమితాబ్ ఉంచాయి ప్రభావముంది.

యశోదకు అసలు పరీక్ష ఈ రోజు నుంచి మొదలవుతుంది. టాక్ ఎంత బాగా వచ్చినా సోమవారం నుంచి వసూళ్లను నిలబెట్టుకోవడం ఈ మధ్య సినిమాలకు పెద్ద సవాల్ గా మారుతోంది. అందుకే సూపర్ హిట్ గా మొదలైన చిరంజీవి గాడ్ ఫాదర్ ఫైనల్ గా యావరేజ్ దగ్గర ఆగిపోయింది. యశోదకు ఆ సమస్య వస్తుందో లేదో అర్థం కావాలంటే ఇంకో రెండు మూడు రోజులు ఆగాలి. సామ్ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 11 కోట్ల 50 లక్షలని టాక్. ఇంకో 3 కోట్ల 70 లక్షల దాకా వస్తే సేఫ్ ప్రాజెక్ట్ అవుతుంది. ఈ శుక్రవారం కూడా పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేకపోవడం కలిసి వచ్చేలా ఉంది. అదే జరిగితే ఓ బేబీ లాగా ప్రాఫిట్ వెంచర్ అవుతుంది. చూడాలి ఏం చేయనుందో.

Show comments