iDreamPost
android-app
ios-app

రామ్ సినిమాలో బాలయ్య – నిజమేనా..?

రామ్ సినిమాలో బాలయ్య – నిజమేనా..?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ దర్శకుడు బోయపాటి శీను కాంబినేషన్ లో ఓ భారీ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఒక యాక్షన్ ఎపిసోడ్ తో పాటు ఊర్వశి రౌతేలా పాల్గొన్న ఐటెం సాంగ్ ని చిత్రీకరించారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ హై వోల్టేజ్ ఎంటర్ టైనర్ లో బాలకృష్ణ ఒక ప్రత్యేక పాత్ర చేయొచ్చనే వార్త హాట్ టాపిక్ గా మారింది. బాలయ్యతో ఈ స్టోరీ డిస్కస్ చేసిన మాట వాస్తవమే కానీ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారో లేదో తెలియదు. గత రెండు దశాబ్దాల్లో తనకు మూడు పెద్ద హిట్లు సింహా, లెజెండ్, అఖండ సృష్టికర్తగా బోయపాటి మాటను బాలయ్య అంత తేలిగ్గా నో అని చెప్పరు. ఎంతలేదన్నా సానుకూలంగా ఉంటారు.

బోయపాటి - రామ్ సినిమాలో మరో స్టార్ హీరో..?

గతంలో బాలయ్య ఇలాంటి స్పెషల్ క్యామియోలు చేసిన దాఖలాలున్నాయి. మంచు మనోజ్ హీరోగా వచ్చిన ఊ కొడతారా ఉలిక్కి పడతారాలో బాలకృష్ణది ఓ అరగంట పాటు కనిపించే ప్రత్యేక పాత్రే. కాకపోతే అది డిజాస్టర్ కావడంతో సగటు ప్రేక్షకులు మర్చిపోయారేమో కానీ ఆ సినిమాలో అంతో ఇంతో బలంగా కనిపించేది ఈ క్యారెక్టరే. దాని తర్వాత మళ్ళీ అలాంటివి చేయలేదు కానీ ఇప్పుడు రామ్ కోసం కాకపోయినా బోయపాటి శీను కోసమైనా ఓకే చెప్పే ఛాన్స్ లేకపోలేదు. అఖండ బ్లాక్ బస్టర్ తర్వాత శీను మీద ఆ సక్సెస్ ని కంటిన్యూ చేయాల్సిన బాధ్యత ఉంది. మళ్ళీ వినయ విధేయ రామ లాంటి పొరపాట్లు రిపీట్ కాకూడదనే ప్లానింగ్ తో ఉన్నారు.

Ram Pothineni | బాల‌కృష్ణ అభిమానిగా రామ్‌పోతినేని.. ఏ సినిమాలో తెలుసా?

ఇక రామ్ సంగతి చూస్తే తమిళ దర్శకుడు లింగుస్వామిని గుడ్డిగా నమ్మి చేసిన ది వారియర్ దారుణ ఫలితం ఇంకా ఫ్యాన్స్ మర్చిపోలేదు. ఇస్మార్ట్ శంకర్ మాస్ ఇమేజ్ ని కాపాడుకునే క్రమంలో చేస్తున్న తప్పులు రామ్ పెద్ద మూల్యాన్ని చెల్లించేలా చేస్తున్నాయి. అందుకే బోయపాటి ప్రాజెక్టుకి టైంపట్టినా సరే వేచి చూసి మొదలుపెట్టాడు. వచ్చే ఏడాది వేసవికి టార్గెట్ పెట్టుకున్న ఈ మూవీలో నిజంగా బాలయ్య చేస్తే మాత్రం బిజినెస్ కోణంలోనూ అంచనాలు ఎక్కడికో వెళ్లిపోతాయి. అధికారిక ప్రకటన వచ్చే దాకా ఏం చెప్పలేం. బాలకృష్ణ ప్రస్తుతం సంక్రాంతికి విడుదల కాబోతున్న వీరసింహారెడ్డి ఫైనల్ స్టేజి చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom