iDreamPost
android-app
ios-app

యాపిల్‌ కీలక నిర్ణయం..హే ‘సిరి’ పేరు మారుతోంది!!

యాపిల్‌ కీలక నిర్ణయం..హే ‘సిరి’ పేరు మారుతోంది!!

అమెరికన్‌ టెక్‌ దిగ్గజం యాపిల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. తన ఫోన్‌లోని వాయిస్‌ అసిస్టెంట్‌ ‘హే సిరి’ని..‘సిరి’గా మార్చనుంది. తద్వారా యూజర్లకు కావాల్సిన సమాచారాన్ని మరింత వేగవంతంగా ఇవ్వొచ్చని యాపిల్‌ యాజమాన్యం భావిస్తోంది. అందుకే తన వాయిస్‌ అసిస్టెంట్‌ పేరును కుదిస్తుంది. ఈ చిన్న పేరును మార్చేందుకు యాపిల్‌ కఠినంగా శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది.

Apple to change 'Hey Siri' command- All you need to know | Technology News  – India TV

 

యాపిల్‌ చేయబోతున్న మార్పులపై బ్లూమ్‌ బెర్గ్‌ ప్రతినిధి మార్క్‌ గుర్మాన్‌ చెప్పినట్లుగా దివెర్జ్‌ కథనాన్ని ప్రచురించింది. అందులో యాపిల్ గత కొన్ని నెలలుగా సిరి ఫీచర్‌పై హార్డ్‌ వర్క్‌ చేస్తోందని, వచ్చే ఏడాది లేదా 2024లో ఈ కొత్త ఫీచర్‌ను విడుదల చేయొచ్చుని గుర్మాన్ పేర్కొన్నారు. అదే జరిగితే ఐఫోన్‌ వినియోగదారులు సిరి అని పిలవాల్సి ఉంటుందని అన్నారు. హే’ను తొలగించడానికి కారణం యాపిల్‌ సంస్థ అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌,గూగుల్‌ సంస్థల తరహాలో వాయిస్‌ అసిస్టెంట్‌ మరింత సులభం మార్చేందుకు ఈ మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Apple to change its voice assistant trigger phrase 'Hey Siri' to 'Siri'

 

గతంలో అమెజాన్‌ వాయిస్‌ అసిస్టెంట్‌ హే అలెక్సా, మైక్రోసాఫ్ట్‌ హే కోర్టానా, గూగుల్‌ హే గూగుల్‌ ఇలా రెండు అక్షరాలతో వాయిస్‌ అసిస్టెంట్‌ పనిచేసేలా ఫీచర్‌ను బిల్డ్‌ చేశాయి. క్రమేపీ యూజర్ల ఈ వాయిస్‌ అసిస్టెంట్‌ను సిరి అని పిలించేందుకు ఇష్టపడుతున్నారు. వారి కోసం హే అనే పదాన్ని తొలగించి అలెక్సా, కోర్టానా అని జోడించాయి. ఇప్పుడు ఆ సంస్థల తరహాలో యాపిల్‌ సైతం తన వాయిస్‌ అసిస్టెంట్‌ హే సిరిని కాస్తా.. సిరిగా మార్చనుంది.