iDreamPost
android-app
ios-app

పుష్ప 2 అప్డేట్స్ కోసం ఇంత హంగామానా..!

పుష్ప 2 అప్డేట్స్ కోసం ఇంత హంగామానా..!

నిన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ వీ వాంట్ పుష్ప 2 అప్ డేట్ అంటూ ర్యాలీలు ధర్నాలు చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విచిత్రంగా ఆ సినిమా తీస్తున్న మైత్రి ఆఫీస్ ముందు కాకుండా దానికేమాత్రం సంబంధం లేని గీతా ఆర్ట్స్ కార్యాలయం ముందు చేయడం గురించి రకరకాల కామెంట్స్ వచ్చి పడుతున్నాయి. పుష్ప సీక్వెల్ రెగ్యులర్ షూటింగ్ ఆలస్యమవుతున్న మాట నిజమే. ఇటీవలే కొన్ని ఈవెంట్స్ బన్నీ దీని గురించి మాట్లాడుతూనే వచ్చాడు. యూనిట్ సైతం బ్యాంకాక్ వెళ్లేందుకు ఏర్పాట్లలో ఉంది. అవతార్ 2 థియేటర్లలో ఓ చిన్న టీజర్ ని ప్లాన్ చేసి దాని చిత్రీకరణ కూడా పూర్తి చేశారనే న్యూస్ ఆల్రెడీ వచ్చేసింది.

allu arjun fans protest at geetha arts office over pushpa 2 movie updates |  పప్పులో కాలేసిన అల్లు అర్జున్ ఫాన్స్.. ఆ లాజిక్ ఎలా మిస్సయ్యారు భయ్యా? News  in Telugu

అంతా సవ్యంగా ఉన్నప్పుడు ఇప్పుడీ హడావిడి దేనికనేదే అసలు ప్రశ్న. పార్ట్ 2 మీద విపరీతమైన ఒత్తిడి ఉండటంతో దర్శకుడు సుకుమార్ స్క్రిప్ట్ విషయంలో రాజీ పడటం లేదు. అందులోనూ పెద్ద క్యాస్టింగ్ కావడంతో ఆర్టిస్టులను డేట్లను ఒక సింక్ లోకి తీసుకురావడం సవాల్ గా మారింది. రష్మిక మందన్న, ధనుంజయ్, అనసూయ ఇలా ఎవరికి వారు కాల్ షీట్లు అంత ఈజీగా ఇచ్చే పరిస్థితుల్లో లేరు. ప్రస్తుతమున్న కమిట్ మెంట్లు పూర్తి చేసుకుని ఆ తర్వాత పుష్ప 2 కి ఎక్కువ టైం ఇవ్వాలని ప్లాన్ చేసుకుంటున్నారు. అందులోనూ ఫహద్ ఫాసిల్ పాత్ర చాలా కీలకం కావడంతో అతని డేట్లు బల్క్ లో పట్టేసుకోవడం ఎంతో ముఖ్యం.

Allu Arjun Fans Protest At Geetha Arts Office For Pushpa 2 Movie Updates -  Sakshi

యూనిట్ తరఫున అప్పుడప్పుడు ఏదైనా క్లారిటీ వస్తే బాగుండేది కానీ ఓవర్ లేట్ చేయడం వల్ల వచ్చిన చిక్కే ఇదంతా. అయినా అప్ డేట్ కోసం ఇంత రచ్చ చేయడం మాత్రం అరుదే. మాములుగా సోషల్ మీడియా వేదికగా పైసా ఖర్చు లేకుండా నిర్మాణ సంస్థలను నిలదీయడం ట్రోల్ చేయడం ఎప్పటి నుంచో జరుగుతున్నదే. యువి క్రియేషన్స్, దిల్ రాజు వీళ్లంతా వాటి బారిన పడిన వాళ్లే. కానీ బ్యానర్లు కట్టుకుని, గుంపులుగా ప్రయాణపు ఖర్చులు పెట్టుకుని, సమూహాలుగా వచ్చి ఇలాంటివి చేయడం మాత్రం పుష్ప 2 విషయంలోనే జరుగుతోంది. బన్నీకి ఇదంతా తెలియకుండా పోదు. మరి మైత్రి నుంచి ఏమైనా కదలిక వస్తుందేమో చూద్దాం.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibombetparktimebetjojobet girişslot siteleriMariobetMadridbetmadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetlunabetgrandpashabetcasibomcasibomjojobetgrandpashabetjojobetgrandpashabet girişgrandpashabetgrandpashabet giriş