iDreamPost
android-app
ios-app

వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్..! సెల్ఫ్ మెసేజ్ తో సహా 5 కొత్త ఫీచర్స్..!!

వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్..! సెల్ఫ్ మెసేజ్ తో సహా 5 కొత్త ఫీచర్స్..!!

వాట్సాప్​ తన యూజర్లకు కొత్త ఫీచర్స్​ అందించడం కోసం నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. మరికొన్ని రోజుల్లో వాట్సాప్​లో కొత్తగా ఐదు ఫీచర్స్​ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. అందులో సెల్ఫ్​ మెసేజ్​, మీడియాకు క్యాప్షన్​ వంటి పలురకాల ఫీచర్స్​ ఉన్నాయి. వాటి పూర్తి వివరాలు చూద్దామా మరి!

1.చాట్​ విత్​ యువర్​ సెల్ఫ్..

ఈ ఫీచర్​లో భాగంగా మన నంబర్​కు మనమే మెసేజ్ చేసుకోవచ్చు. అయితే దీనికోసం ప్రత్యేకంగా ఏ విండో ఉండదు. వాట్సాప్​లో మన సొంత నెంబర్​ను ఎంచుకున్నప్పుడు.. ఇకపై పర్సనల్​ చాట్​ అనే ప్రత్యేక బాక్స్​ కనిపిస్తుంది. వాట్సాప్​ కాంటక్ట్​ లిస్ట్​లో ఇకపై మన నెంబర్​ కూడా కనిపించనుంది. దీని ద్వారా సొంత నెంబర్​కే.. నచ్చిన ఫైల్స్​, వీడియోలు పంపించుకోవచ్చు. గతంలో.. ఒకే ఒక నెంబర్​తో వాట్సాప్​ గ్రూప్​ని క్రియేట్​ చేసి ఆ గ్రూప్​లో మీడియా ఫైల్స్​ను పంపించుకునే అవకాశం ఉంది.. ఇకపై అలా లేకుండా సొంత నెంబర్​కే మెసేజ్​ పంపించుకోవచ్చు.

2.మీడియాకు క్యాప్షన్స్..

వాట్సాప్​ యూజర్లు ఫొటోలు, వీడియోలు, GIFలను ఇతరులకు ఫార్వర్డ్ చేసేటప్పుడు​.. ఇకపై మీడియాతో పాటు సందేశాన్ని కూడా రాసి పంపే ఆప్షన్​ అందుబాటులోకి రానుంది.

3.గ్రూప్​ చాట్స్​లో ప్రొఫైల్​ ఫొటోస్​..

ఈ ఆప్షన్​తో.. గ్రూప్​లో ఏదైనా మెసేజ్​ వస్తే.. ఆ మెసేజ్​ పంపిన వారి ప్రొఫైల్​ ఫొటో కూడా కనిపిస్తుంది. ప్రైవసీ వలన వారి ప్రొఫైల్​ ఫొటో కనిపించకపోతే.. గ్రూప్​ చాట్​లో డీఫాల్ట్​గా​ ప్రొఫైల్​ క‌నిపించేలా సెట్ చేసుకోవ‌చ్చు.

4.ఇమేజ్​లకు బ్లర్​ ఆప్షన్​..

వాట్సాప్​లో ఇమేజ్​లను బ్లర్​ చేసే ఆప్షన్​ ప్రస్తుతం​ బీటా టెస్టర్లకే అందుబాటులో ఉంది. ఏదైనా ఇమేజ్​ పంపించిన‌ప్పుడు అందులోని సున్నితమైన అంశాలను బ్లర్​ చేసేందుకు ఓ ఆప్షన్​ రానుంది. దీనికోసం రెండు బ్లర్​ టూల్స్​ను వాట్సాప్​ రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. బ్లర్​ సైజ్​ను కూడా వినియోగదారులు తమకు నచ్చిన విధంగా పెట్టుకోవచ్చు.

5. డెస్క్​టాప్​లో మీడియా ఆటో డౌన్​లోడ్​..

డెస్క్​టాప్​లో మీడియా ఫైల్స్‌లో.. ఫొటోలు, వీడియోలు, పీడీఎఫ్ ఫైల్స్ వంటివి క్లిక్​ చేస్తే కానీ డౌన్​లోడ్​ కావు. ఇకపై ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు వంటివి ఆటో డౌన్​లోడ్​ చేసుకునేలా సెట్టింగ్స్​లో మార్పులు చేయనుంది.