iDreamPost
android-app
ios-app

బిత్తిరి సత్తి కొత్త పాట.. రౌడీలు, పహిల్వాన్ లనే టార్గెట్..

బిత్తిరి సత్తి కొత్త పాట.. రౌడీలు, పహిల్వాన్ లనే టార్గెట్..

తనదైన స్టైల్‌లో యాంకరింగ్ చేస్తూ అభిమానుల్ని అలరించిన బిత్తిరి సత్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవికుమార్ బాగా తెలిసినవాడే.

ఇటీవల కాలంలో ఎంటర్టైన్మెంట్ ప్రపంచంలో కాస్త క్లిక్ అయినా కూడా ఊహించని స్థాయిలో ఆదాయం లభిస్తూ ఉంటుంది. చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిన బిత్తిరి సత్తి ఏ విధంగా క్లిక్కయ్యాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మీడియా న్యూస్ ఛానల్ లో సరదాగా వార్తలు చెబుతూ ప్రేక్షకులకు దగ్గరైన అతను ఆ తర్వాత సినిమాల్లోకి కూడా అడుగుపెట్టాడు. పెద్ద దర్శకులు హీరోలు కూడా ప్రస్తుతం బిత్తిరి సత్తి తో సినిమాలను ప్రమోట్ చేస్తున్నారు. ఇక సుమ కంటే ఎక్కువ ఆదాయం అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

మల్టీ టాలెంటెడ్ టెలివిజన్ రంగంలోనే కాకుండా సినిమాల్లో కూడా మెల్లగా బిత్తిరిసత్తి మంచి క్రేజ్ అందుకునే ప్రయత్నం చేశాడు. అతను గతంలో లీడ్ రోల్స్ లో కూడా కొన్ని సినిమాలు చేశాడు. పూర్తిగా తెలంగాణ యాసలో పట్టు సాధించి తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుతున్న బిత్తిరి సత్తి సింగింగ్ తో కూడా ఎంతగానో ఆకట్టుకుంటాడు. అతను పాడిన కొన్ని పాటలు కూడా యూట్యూబ్ లో మంచి వ్యూవ్స్ అందుకున్నాయి. మిమిక్రి కూడా అద్భుతంగా చేయగలడు.

ప్రస్తుతం ‘గుండగాళ్లమండి..’ అంటూ బిత్తిరిసత్తి పాడినపాట హైవోల్టేజ్ క్రియేట్ చేస్తుంది. త్వరలో విడుదల కాబోతున్న ‘దోచేవారెవరురా..’ సినిమాలో ఈ పాట కీలక పాత్ర పోషించనుంది. తాజాగా ఈ పాట డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతులమీదుగా విడువలైంది..

ఇక పాట విషయానికొస్తే.. సినిమా రంగంపై పాటలు వర్మ సినిమాలోనే చూసాం. డైరెక్టర్ లపై పాటను సునీల్ నటించిన ‘కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పల్రాజు’ సినిమాలో చూసాం. కానీ బిత్తిరిసత్తి పాడినపాట మాత్రం సినిమాలో ‘విలన్’ లపై ఓ హైప్ క్రియేట్ చేయనుంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet