నేడే గగనంలో పాక్షిక సూర్యగ్రహణం
విశ్వంలో అరుదైనది.. దశాబ్దం తర్వాత మరల..
సూర్యగ్రహణం తెలుగు రాష్ట్రాలలో ఎంతసేపు మనం చూడవచ్చు అన్న ఆసక్తి కనబడుతుంది. ఇక సూర్య గ్రహణం ఏ ఏ ప్రాంతాలలో కనిపిస్తుంది అన్న దాని పైన కూడా చర్చ జరుగుతుంది. సాధారణంగా సూర్యుడు చంద్రుడు భూమి ఒకే సరళ రేఖ మీదికి వచ్చినప్పుడు భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు అడ్డుగా వచ్చినప్పుడు భూమి మీద కొంత భాగంలో సూర్యుడు సంపూర్ణంగా కనిపించకుండా పోతాడు మరి కొంత భాగంలో పాక్షికంగా కనిపించకుండా పోతాడు. దీనిని సూర్య గ్రహణం అని అంటారు.
హైదరాబాద్ లో, విశాఖలో సూర్యగ్రహణం కనిపించేది ఇప్పుడే ఈ సంవత్సరం సూర్య గ్రహణం అక్టోబర్ 25వ తేదీన వస్తోంది .అయితే ఈసారి తెలుగు రాష్ట్రాలలో కనిపించే సూర్య గ్రహణం పాక్షిక సూర్యగ్రహణమేనని చెబుతున్నారు. భారతదేశంలో ఈ సూర్య గ్రహణం సూర్యాస్తమయ సమయం నుండి ప్రారంభమవుతుంది. ఇక తెలుగు రాష్ట్రాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండకపోవచ్చని పండితులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణాలోని హైదరాబాదులో సాయంత్రం 4 గంటల 49 నిమిషాల నుండి గ్రహణాన్ని చూడవచ్చు. ఇక విశాఖపట్నంలో సాయంత్రం 5 గంటల1 నిమిషాల సమయంలో గ్రహణాన్ని చూడవచ్చు.
తెలుగురాష్ట్రాల్లో 49 నిముషాల పాటు పాక్షిక సూర్యగ్రహణం తెలుగు రాష్ట్రాల్లో కనిపించే సూర్య గ్రహణం పాక్షికంగానే కనిపిస్తుందని పండితులు చెబుతున్నారు. సుమారు 49 నిమిషాల పాటు గ్రహణం ఉంటుందని చెప్తున్నారు. ఈసారి ఏర్పడే పాక్షిక సూర్యగ్రహణం ఐరోపా, యూరప్, మధ్య ఆసియా ,పశ్చిమ సైబీరియా, పశ్చిమ ఆసియా మరియు ఆఫ్రికా యొక్క ఈశాన్య ప్రాంతాల నుండి కనిపిస్తుందని చెబుతున్నారు. భారత దేశంలో ఈ సూర్యగ్రహణం సూర్యాస్తమయానికి ముందు ప్రారంభమవుతుందని, అండమాన్ నికోబార్ దీవులు, ఈశాన్య భారత దేశం లోని కొన్ని ప్రాంతాలు తప్ప మిగతా అన్ని ప్రాంతాలలోనూ పాక్షిక సూర్యగ్రహణం చూడవచ్చని చెబుతున్నారు.
సూర్యగ్రహణం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు మూసివేత.. సంప్రోక్షణ అనంతరం ఆలయాలు తెరుచుకోనున్నాయి.