iDreamPost
android-app
ios-app

కార్తీ ఖాతాలో సూపర్ సీక్వెల్స్

కార్తీ ఖాతాలో సూపర్ సీక్వెల్స్

మాములుగా ఒక హిట్ మూవీకి సీక్వెల్ తీయడమంటే అంత సులభం కాదు. ఎందుకంటే వీటికి సక్సెస్ ఛాన్స్ చాలా తక్కువ. పాతికేళ్ల క్రితం మనీ అనే చిన్న సినిమాకు కొనసాగింపుగా మనీ మనీ తీస్తే ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఆ తర్వాత ఇలాంటి వరసలో చాలా డిజాస్టర్లు వచ్చాయి. కిక్ 2, మన్మథుడు 2, సర్దార్ గబ్బర్ సింగ్, సత్య 2, గాయం 2 ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని ఉదాహరణలున్నాయి. ఇవేవి మొదటి భాగాలకు కొనసాగింపు కాదు. కేవలం టైటిల్స్ క్రేజ్ ని వాడుకుని బిజినెస్ చేయాలని చూసినవి. కంటెంట్ మరీ దారుణంగా ఉండటంతో ప్రేక్షకులు వీటిని డిజాస్టర్లు చేసి పెట్టారు. అందుకే నెంబర్ 2 అంటే దర్శకులకు టెన్షన్.

కానీ కార్తీ దీనికి భిన్నమైన రూట్ లో వెళ్తున్నాడు. ఇటీవలే పొన్నియన్ సెల్వన్ 1తో తమిళ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న ఈ టాలెంటెడ్ హీరో ఆల్రెడీ పార్ట్ 2 షూటింగ్ పూర్తి చేశాడు. వచ్చే వేసవిలో ఇది రిలీజ్ కానుంది. విజయ్ తో చేయబోయే మూవీ పూర్తి చేశాక దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఖైదీ 2 మొదలుపెడతాడు. విక్రమ్ లో సూర్య పోషించిన రోలెక్స్ క్యారెక్టర్ ని ఇందులో జోడిస్తారనే ప్రచారం ఆల్రెడీ తమిళ మీడియాలో బలంగా జరుగుతోంది. దీపావళి సినిమాల్లో సర్ప్రైజ్ హిట్ అందుకున్న సర్దార్ కి కంటిన్యుయేషన్ 2 ఉంటుందని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు సో మొత్తం మూడు సీక్వెల్స్ లో కార్తీ రాబోయే రెండేళ్లలో కనిపించబోతున్నాడు.

ఇవి కాకుండా కొన్నేళ్ల క్రితం వచ్చిన నాన్ మహాన్ ఆల్ల(నా పేరు శివ), మదరాసు(తెలుగు డబ్బింగ్ రిలీజ్ కాలేదు)లను కొనసాగించేందుకు వాటి దర్శకులు ప్లాన్ లో ఉన్నట్టుగా టాక్ ఉంది కానీ వాటికి చాలా టైం పట్టేలా ఉంది. మొత్తానికి ఏ స్టార్ కి అచ్చిరాని సీక్వెల్స్ కార్తీకి మాత్రం బాగా వర్కౌట్ అయ్యేలా కనిపిస్తోంది. ఊహించిన దానికన్నా సర్దార్ ఎక్కువ సక్సెస్ అవ్వడమే కాకుండా ఒక్క తెలుగులోనే చాలా త్వరగా బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాల బాట పట్టింది. అందుకే ఇక్కడి అభిమానులంటే కార్తీకి ప్రత్యేకమైన ప్రేమ. ఆ మధ్య కాష్మోరా లాంటి ఫ్లాపులతో మార్కెట్ డౌన్ అయినా తిరిగి ఇప్పుడు రికవర్ అయినట్టేనని చెప్పాలి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom