iDreamPost
android-app
ios-app

ఇక్కడ వారు లేరు కదా.. గరికపాటికి మెగాస్టార్ పంచ్.. ఏం టైమింగ్ బాస్..!

ఇక్కడ వారు లేరు కదా.. గరికపాటికి మెగాస్టార్ పంచ్.. ఏం టైమింగ్ బాస్..!

గరికపాటి, చిరంజీవ మధ్య నెలకొన్న వివాదం గురించి తెలిసిందే. తాజాగా గరికపాటిపై ఓ వేదికపై చిరు వేసిన సెటైర్లు.. వైరల్ అవుతున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి, గరికపాటి నరసింహా రావు మధ్య నెలకొన్న వివాదం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఇటీవలే ప్రముఖ అవధాని, ఉపన్యాసకుడు అయిన గరికపాటి చిరంజీవిని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. హైదరాబాద్ లో జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమానికి అతిథులుగా చిరంజీవి, గరికపాటి నరసింహా రావు హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా చిరంజీవిని ఉద్దేశిస్తూ గరికపాటి చేసిన కామెంట్స్ తీవ్రమైన చర్చకు దారి తీశాయి. మెగా అభిమానులు గరికపాటి తీరుని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు.

అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి గరికపాటి వ్యాఖ్యలపై తనదైన స్టైల్లో పంచ్ వేశారు. తాజాగా మెగాస్టార్ చిరు… ప్రముఖ సినీ జర్నలిస్ట్ ప్రభు రాసిన `శూన్యం నుంచి శిఖరాగ్రాలకు` పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఈ ఈవెంట్ జరిగింది. చిరంజీవిపై రాసిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆయనేగెస్ట్ గా హాజరయ్యారు.అయితే ఈ సందర్భంగా స్టేజ్ పై ఉన్న చిరంజీవితో ఫోటోలు దిగేందుకు మహిళలు క్యూ కట్టారు. ఈ సందర్భంగా… చిరు ఇక్కడ వారే లేరు కదా… హమ్మయ్య అంటూ..పంచ్ వేశారు. దీంతో చిరంజీవి గరికపాటిపై పంచ్ వేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.

అంతకుముందు కూడా మీడియా ఇంటరాక్షన్ లో గరికపాటి వివాదంపై చిరంజీవిని మీడియా ప్రముఖులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. గరికపాటి నరసింహారావు పెద్దాయన, ఆయన వ్యాఖ్యలపై చర్చ అనవసరం అన్నారు మెగాస్టార్. ఆయన పెద్ద పండితుడు, మంచీ చెడులకు తారతమ్యం తెలిసినవారు అన్నారు. కాబట్టి ఈ వివాదం గురించి మాట్లాడవలసిన అవసరం లేదని మరోసారి చిరంజీవి తన హుందాతనం చాటుకున్నారు. పరోక్షంగా వివాదం మరింత పెద్దది చేసే ఆలోచన లేదని చెప్పకనే చెప్పారు మెగాస్టార్. కానీ తాజాగా చిరు గరికపాటిపై వేసిన సెటైర్లు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetpasacasinocasibomiptvjojobetcasibomcasibomGrandpashabetgrandpashabethızlıcasino girişEscortes BelgiqueCasibomCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibom