nagidream
పరీక్షలు ఎవరు కనిపెట్టారో తెలుసా? ప్రపంచంలో తొలిసారిగా పరీక్షలు నిర్వహించిన దేశం ఏదో తెలుసా? తొలిసారిగా పాఠశాలలో పరీక్షలు ఎవరు నిర్వహించారో తెలుసా?
పరీక్షలు ఎవరు కనిపెట్టారో తెలుసా? ప్రపంచంలో తొలిసారిగా పరీక్షలు నిర్వహించిన దేశం ఏదో తెలుసా? తొలిసారిగా పాఠశాలలో పరీక్షలు ఎవరు నిర్వహించారో తెలుసా?
nagidream
ఒక మనిషి తానేంటో నిరూపించుకోవడానికి పోటీ పరీక్షలు అనేవి చాలా కామన్. అందరి కంటే ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళని తోపులు అంటారు. అదే తక్కువ మార్కులు వస్తే ఓరి పాపాత్ముడా అంటారు. సర్ సర్లే ఎన్నో అనుకుంటాం. అన్నీ అనుకున్నట్టు అవుతాయా ఏమిటి? బాగా చదివే వాళ్లకి ఎగ్జామ్స్ అంటే భలే సరదా. మహా ఇష్టంగా ఫీలవుతారు. ఈ సదవడాలు, ప్యాసవ్వడాలు మన వల్ల కాదేహే అనుకునేవాళ్ళకి ఎగ్జామ్స్ అంటే పరమ బోరింగ్ కాన్సెప్ట్. అయితే ఈ రెండు రకాల మనుషులకి ఎగ్జామ్స్ ఎవరు కనిపెట్టారో తెలియాల్సిన అవసరం ఉంది. బాగా చదివే వాళ్ళు అయితే అతని ఫోటోకి దండేసి దండం పెడతారు.. ఎగ్జామ్స్ అంటే భయపడేవాళ్లు ఇతను ఇప్పుడు ఉంటే ఏం చేస్తారో వాళ్లకి ఒక క్లారిటీ ఉండే ఉంటుంది.
అసలు ఈ పరీక్షలెవడు కనిపెట్టాడురా బాబూ అని అనిపించడం వెనుక ఉన్న వ్యక్తి పేరు హెన్రీ ఏ. ఫిషల్. ఇతనే ఎగ్జామ్స్ అనే కాన్సెప్ట్ ని కనుగొన్నది. అయితే ఇతని కంటే ముందే చైనాలో ఎగ్జామ్స్ కాన్సెప్ట్ ఉంది. కానీ ఇది చైనాలో మాత్రమే ఉంటే దాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది మాత్రం ఈ హెన్రీ ఫిషలే. ప్రపంచంలో తొలిసారిగా ప్రాచీన చైనాలో తొలి ఇంపీరియల్ పరీక్షని కండక్ట్ చేశారు. ఎగ్జామ్స్ అనే కాన్సెప్ట్ ని అడాప్ట్ చేసుకుని.. జాతీయ స్థాయి ఇంపీరియల్ ఎగ్జామ్స్ ని కండక్ట్ చేసిన తొలి దేశంగా చైనా ఉంది. ఇంపీరియల్ ఎగ్జామ్స్ అంటే రాజవంశంలో సమర్థులని ఎంపిక చేయడం కోసం జరిపే పరీక్షలు. సుయి రాజవంశ కాలంలో ప్రభుత్వంతో కలిసి పని చేయడం కోసం సమర్థులైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు చైనాలో ఇంపీరియల్ ఎగ్జామ్ ని నిర్వహించారు. పరీక్షల కాన్సెప్ట్ ని ప్రపంచంలోనే తొలిసారిగా కనుగొన్నది మాత్రం సుయి రాజవంశమే.
ఆ తర్వాత 1800ల టైంలో హెన్రీ ఎ. ఫిషల్ అనే అమెరికన్, జర్మన్ ప్రొఫెసర్ ఈ ప్రపంచం కోసం ఎగ్జామ్స్ కాన్సెప్ట్ ని కనుగొన్నాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ దేశం 1806లో ఈ ఎగ్జామ్స్ కాన్సెప్ట్ ని నుంచి సొంతంగా పరీక్షలు నిర్వహించుకోవడం ప్రారంభించింది.సివిల్ సర్వీసులలో సమర్థులను ఎంపిక చేయడం కోసం పోటీ పరీక్షలు నిర్వహించేవారు. 19వ శతాబ్దం చివరిలో ఆక్స్ ఫర్డ్, కేంబ్రిడ్జ్ లాంటి యూనివర్సిటీలు ఇంగ్లాండ్ దేశాన్ని కలిసి దేశంలో పురుషుల కోసం పరీక్షలను ప్రామాణిక ప్రక్రియగా మార్చాయి. 1958 డిసెంబర్ 14న మొదటి కేంబ్రిడ్జ్ ఎగ్జామ్ ని పాఠశాలల్లో, చర్చుల్లో ఉన్న విద్యార్థులు రాశారు. ఆ ఎగ్జామ్స్ లో ఇంగ్లీష్, లెక్కలు, హిస్టరీ, లాటిన్, జర్మన్, ఫ్రెంచ్, జియోగ్రఫీ సబ్జెక్టులు ఉన్నాయి. 1867 ముందు వరకూ పాఠశాలల్లో అమ్మాయిలు పరీక్షలు రాయడానికి అనుమతి ఉండేది కాదు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ 1867లో, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ 1870లో పరీక్షలు రాసేలా చర్యలు తీసుకున్నాయి.
మన భారతదేశంలో ఎగ్జామ్స్ కాన్సెప్ట్ 1853లో వచ్చింది. ఈ సమయంలో బ్రిటిష్ పార్లమెంట్ సివిల్ సర్వెంట్లకు నామినేషన్స్ విధానాన్ని రద్దు చేసింది. అందువల్ల జాతీయ స్థాయి పరీక్షలుగా సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ ని పరిచయం చేశారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి సర్వీసుల్లో వివిధ ర్యాంకుల కోసం ఈ పరీక్షలు ప్రవేశపెట్టబడ్డాయి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్, నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎగ్జామినేషన్, జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, నీట్, సీఏటీ సహా అనేక పోటీ పరీక్షలను పరిచయం చేశారు. ప్రతి ఏటా ఈ పోటీ పరీక్షల ఆధారంగానే అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం సివిల్ సర్వెంట్స్ ని ఎంపిక చేసేది.ఆ తర్వాత పాఠశాలల్లో పరీక్షలు నిర్వహించడం మొదలుపెట్టారు. అలా ఈ పరీక్షలు అనేవి వచ్చాయి. మరి ఎగ్జామ్స్ కాన్సెప్ట్ ని ప్రపంచానికి పరిచయం చేసిన హెన్రీ ఏ. ఫిషల్ పై మీ అభిప్రాయమేమిటి? ఆయన ఫోటోకి దండేసి దండం పెడతారా? లేక సన్మానం చేస్తారా? చాలా మంది అయితే ఇతన్ని తిట్టుకుంటున్నారు. మరి మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.