iDreamPost
android-app
ios-app

నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్‌ 1 పోస్టులను పెంచిన రేవంత్‌ ప్రభుత్వం

  • Published Feb 01, 2024 | 11:25 AM Updated Updated Feb 07, 2024 | 8:06 AM

TSPSC Group 1: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్‌ శుభవార్త చెప్పింది. గ్రూప్‌ 1 నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. అంతేకాక పోస్టుల సంఖ్యను కూడా పెంచనున్నట్లు సమాచారం. ఆ వివరాలు..

TSPSC Group 1: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్‌ శుభవార్త చెప్పింది. గ్రూప్‌ 1 నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. అంతేకాక పోస్టుల సంఖ్యను కూడా పెంచనున్నట్లు సమాచారం. ఆ వివరాలు..

  • Published Feb 01, 2024 | 11:25 AMUpdated Feb 07, 2024 | 8:06 AM
నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్‌ 1 పోస్టులను పెంచిన రేవంత్‌ ప్రభుత్వం

నిరుద్యోగలకు రేవంత్‌ సర్కార్‌ శుభవార్త చెప్పింది. లక్షల మంది ఏళ్ల తరబడి ఎదురు చూస్తోన్న టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్‌ 1 పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేస్తోంది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనే గ్రూప్‌ 1 నోటిఫికేషన్‌ వచ్చింది. కానీ పేపర్‌ లీకేజ్‌, పరీక్ష నిర్వహణలో లోపం వంటి అంశాల కారణంగా.. ఇప్పటికే రెండుసార్లు గ్రూప్‌-1 పరీక్ష రద్దయ్యింది. ఈ క్రమంలో రేవంత్‌  సర్కార్‌ గ్రూప్‌ 1 రీ నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 1వ తేదీన విడుదల చేయనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి గురువారం నాడు కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

అంతేకాక మరో గుడ్‌ న్యూస్‌ ఏంటంటే.. గ్రూప్‌ 1 పోస్టులను పెంచుతున్నారు. గతంలో ఉన్న 503 పోస్టులకు మరో 60 పోస్టులు కలిపి మొత్తం 563 పోస్టులకు గాను టీఎస్‌పీఎస్‌సీ కొత్త గ్రూప్ 1 నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. మంగళవారం నాడు ప్రభుత్వం గ్రూప్‌ 1 పోస్ట్‌ల సంఖ్య పెంచుతూ ప్రకటన చేసింది. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ విడుదలకానున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. గ్రూప్‌ 1 పోస్టులు పెంచడంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

group 1 posts increased

గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. 2022 ఏప్రిల్‌లో 503 గ్రూప్‌-1 పోస్ట్‌ల భర్తీ కోసం టీఎస్‌పీఎస్‌సీ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో 3,50,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 2022 అక్టోబర్‌లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించగా.. 2,80,000 మంది హాజరయ్యారు. అయితే.. ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలైనా.. పేపర్ లీకేజ్ కారణంగా మొదటిసారి గ్రూప్‌-1 పరీక్ష రద్దయ్యింది.

దాంతో 2023 జూన్‌లో మరోసారి గ్రూప్‌-1 పరీక్ష నిర్వహించారు. అయితే బయోమెట్రిక్‌ అంశంలో వివాదం కారణంగా.. పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో.. పరీక్షల నిర్వహణలోని లోపాల నేపథ్యంలో గ్రూప్‌-1 పరీక్షను రద్దు చేయాలని కోర్టు తీర్పునిచ్చింది. అయితే దీనిపై టీఎస్‌పీఎస్‌సీ బోర్డు సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించింది. కానీ.. కోర్టులో ఇంత వరకు వాదనలు జరుగలేదు. ఇంతలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఉద్యోగ నియామక ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది.

ఇక ఎన్నికల వేళ తమను గెలిపిస్తే.. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయి.. కాంగ్రెస్ గవర్నమెంట్‌ ఏర్పడింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత గ్రూప్‌ 1 పరీక్షల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతేకాక కొత్త పోస్టులు కలిపి గ్రూప్‌ 1 రీ నోటిఫికేషన్ విడుదల చేయాలని సీఎం రేవంత్ నిర్ణయించారు.