iDreamPost
android-app
ios-app

టెన్త్ ఫస్ట్ క్లాస్ లో పాసయ్యారా?.. మంచి ఫ్యూచర్ కోసం ఈ కోర్సులు బెస్ట్!

టెన్త్ విద్యార్థులకు ఇప్పుడు మరో టెన్షన్ పట్టుకుంది. పదో తరగతి తర్వాత ఏ కోర్సులు చేయాలి. ఉపాధి అవకాశాలు త్వరగా పొందాలంటే ఏ కోర్సులు బెస్ట్ అంటూ ఆరా తీస్తున్నారు. టెన్త్ తర్వాత బెస్ట్ ఫ్యూచర్ కోసం ఏ కోర్సులు బెస్ట్ అంటే?

టెన్త్ విద్యార్థులకు ఇప్పుడు మరో టెన్షన్ పట్టుకుంది. పదో తరగతి తర్వాత ఏ కోర్సులు చేయాలి. ఉపాధి అవకాశాలు త్వరగా పొందాలంటే ఏ కోర్సులు బెస్ట్ అంటూ ఆరా తీస్తున్నారు. టెన్త్ తర్వాత బెస్ట్ ఫ్యూచర్ కోసం ఏ కోర్సులు బెస్ట్ అంటే?

టెన్త్ ఫస్ట్ క్లాస్ లో పాసయ్యారా?.. మంచి ఫ్యూచర్ కోసం ఈ కోర్సులు బెస్ట్!

పదో తరగతి ప్రతి విద్యార్థి జీవితానికి టర్నింగ్ పాయింట్ లాంటిది. అందుకే టెన్త్ లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు అటు ఉపాధ్యాయులు, ఇటు తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. ఇక ఇరు తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలు రాశారు. ఆంధ్రప్రదేశ్ లో టెన్త్ ఫలితాలు ఏప్రిల్ 22న విడుదలయ్యాయి. తెలంగాణలో ఏప్రిల్ 30న ఫలితాలను ప్రకటించనున్నారు. ఇక ఫలితాల సంగతి అటు ఉంచితే.. టెన్త్ తర్వాత నెక్ట్స్ స్టెప్ ఏంటి అని విద్యార్థులు ఆలోచిస్తున్నారు. అందరిలా ఇంటర్ లో చేరాలా? లేదా ఇతర స్పెషల్ కోర్సులు చేయాలా అనే సందిగ్థంలో పడిపోయారు. ఏ కోర్స్ తీసుకుంటే కెరీర్ లో దూసుకెళ్లొచ్చు అని ఆలోచిస్తున్నారు. మరి టెన్త్ తర్వాత ఫ్యూచర్ బంగారుమయం కావాలంటే ఏ కోర్సులు బెస్టో ఇప్పుడు చూద్దాం.

మీరు టెన్త్ ఫస్ట్ క్లాస్ లో పాసయ్యారా? నెక్ట్స్ తీసుకునే నిర్ణయం భవిష్యత్తుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఏం చదవాలన్నదానిపై పూర్తి క్లారిటీ ఉండాలి. మీకన్నా పెద్దవారి నుంచి సలహాలు తీసుకున్నా తుది నిర్ణయం మాత్రం మీదే అయి ఉండాలి. ఏ కోర్సులో చేరితే త్వరగా స్థిరపడొచ్చు. ఉపాధి అవకాశాలు పొందేందుకు చేయాల్సిన కోర్సులు ఏవే తెలుసుకోవాలి. లైఫ్ లో సెట్ అయ్యేందుకు బోలెడన్నీ కోర్సులు ఉన్నాయి. వైద్య, ఇంజినీరింగ్‌, ఫైనాన్షియల్‌ తదితర రంగాల్లో అడుగు పెట్టాలనుకునే వారు, వివిధ వృత్తి విద్యల్లో చేరాలనుకునే వారు ఇంటర్‌, ఐటీఐ, పాలిటెక్నిక్‌ తదితర కోర్సుల్లో చేరి ఫ్యూచర్ ను తీర్చిదిద్దుకోవచ్చు.

ఇంటర్‌లో వృత్తి విద్యా కోర్సులు:

ఇంటర్‌లో ఒకేషనల్‌ ( వృత్తి ) విద్యాకోర్సులున్నాయి. ఆఫీస్‌ మేనేజ్‌మెంట్‌, ఇండస్ట్రీయల్‌ మేనేజ్‌మెంట్‌, బేసిక్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌, మార్కెటింగ్‌ అండ్‌ సేల్స్‌మేన్‌, ఎక్స్‌పోర్ట్‌, ఇంపోర్ట్‌ ప్రోసిజర్‌ డాక్యుమెంటేషన్‌, ఇన్సూరెన్స్‌, డెంటల్‌, మల్టిపర్పజ్‌ హెల్త్‌ వర్కర్‌, మెడికల్‌ ల్యాబ్‌ టెక్నిషియన్‌, క్లినికల్‌ అసిస్టెంట్‌ తదితర కోర్సులున్నాయి. ఇంటర్ వొకేషనల్ కోర్సుల్లో ముఖ్యమైనవి ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సులు. వీటిల్లో టెక్నికల్ గ్రూపుల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు నేరుగా పాలిటెక్నిక్ సెకండియర్‌లో ప్రవేశం పొందవచ్చు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నిర్వహించే అప్రెంటీస్ పరీక్ష రాసే అవకాశం ఈ కోర్సులు చదివిన ఐటీఐ విద్యార్ధులకు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన రైల్వేలు, గెయిల్, సెయిల్ వంటి భారీ కంపెనీల్లో ఉపాధి అవకాశాలు పొందవచ్చు.

ఐటీఐ

ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ సాంకేతిక రంగంలో శిక్షణ ఇచ్చే సంస్థలు. ఇవి కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ (డీజీఈటీ) పర్యవేక్షణలో పనిచేస్తున్నాయి. వీటిల్లో ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, ప్లంబర్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, టర్నర్ తదితర కోర్సులు చేయొచ్చు. ఈ కోర్సులు పూర్తిచేసిన వారికి రైల్వే, ఆర్మీ, పోలీసు, పారా మిలిటరీ ఇతర సంస్థల్లో ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది. టెన్త్ తర్వాత పై చదువులపై ఇంట్రెస్ట్ లేని వారు ఐటీఐ కోర్సులతో జీవితంలో సెట్ అయిపోవచ్చు.

పాలిటెక్నిక్

ఇంజనీరింగ్‌ పాలిటెక్నిక్‌ ఈ కోర్సు కాల పరిమితి మూడేళ్లు. సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్‌కండీషనింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వంటి మూడేళ్ల కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు పూర్తిచేసిన వారు ఇంజనీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ (బీటెక్/బీఈ) కోర్సుల్లో నేరుగా రెండో సంవత్సరంలో లేటరల్ ఎంట్రీ స్కీం ద్వారా ప్రవేశాలు పొందవచ్చు. డిప్లొమా కోర్సులు పూర్తిచేసిన వారు స్వయం ఉపాధిని కూడా పొందొచ్చు. పాలిటెక్నిక్ విద్యతో పరిశ్రమల్లో ఉద్యోగాలు అందుకోవచ్చు.