Krishna Kowshik
పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఊహించినట్లుగానే ఫలితాలు వెలువడుతున్నాయి. మెరికల్లాంటి విద్యార్థులు మంచి మార్కులు సాధిస్తున్నారు. తాజాగా
పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఊహించినట్లుగానే ఫలితాలు వెలువడుతున్నాయి. మెరికల్లాంటి విద్యార్థులు మంచి మార్కులు సాధిస్తున్నారు. తాజాగా
Krishna Kowshik
పరీక్షలు ముగిసిపోయాయి.. ఫలితాలు వెల్లడి అవుతున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్, పదోతరగతి ఫలితాలు వెలువడగా.. విద్యార్థులు ప్రతిభ కనబర్చిన సంగతి విదితమే. పేద, మధ్యతరగతికి చెందిన స్టూడెంట్స్ మంచి స్కోర్ చేశారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు కర్ణాటకలో ఎస్ఎస్ఎల్సీ (పదో తరగతి)రిజల్ట్ వచ్చాయి. ఈ ఫలితాల్లో కూడా పేద విద్యార్థులు, రైతుల పిల్లలు టాపర్స్‌గా నిలవడం విశేషం. కాగా, 625 మార్కులకు గానూ .. 625 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచింది అందరి దృష్టిని ఆకర్షించింది రైతు బిడ్డ బాగల్ కోటేకు చెందిన అంకిత బన్నప్ప కొన్నూరు. ఆ తర్వాత 624 మార్కులతో ద్వితీయ స్థానంలో నిలిచారు ఏడుగురు విద్యార్థలు. వారిలో ఒకరు బెంగళూరుకు చెంది మేధా శెట్టి.
ఈమెకు 625కు గానూ.. 624 మార్కులు వచ్చాయి. స్టేట్ సెకండ్ ర్యాంక్ రావడంతో ఉబ్బితబ్బిబ్బు అయిపోతున్నారు ఆమె పేరెంట్స్, టీచర్స్. బెంగళూరులోని బనశంకరిలోని హోలీ చైల్డ్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో చదువుకుంది మేధా. విద్యార్థిని ఇన్ని మార్కులు సాధించినందుకు అభినందనలు తెలియజేస్తున్నారు ఆమె స్కూల్ యాజమాన్యం. కానీ ఆమె ఒక్క మార్కు కోల్పోవడంపై కాస్త నిరాశ వ్యక్తం చేసింది మేధా. తాను టాపర్ అవుతానని ఊహించానని, ఒక్క మార్కు తక్కువ వచ్చి రెండో ర్యాంక్ సాధించానని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు సంస్కృతంలో ఒక్క మార్కు తక్కువ వచ్చిందని, తిరిగి రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేస్తానని చెప్పింది మేధా. ఆమె మీడియాతో మాట్లాడుతూ..టీచర్ల కృషి.. తన ఫలితమే ఈ విజయానికి కారణమని వెల్లడించింది.
ఆరు సబ్జెక్టుల్లో ఐదింటికి నూరు శాతం మార్కులు సాధించానని, సంస్కృత సబ్జెక్టులో ఒక్క మార్క్ తగ్గిందని, ఆ సబ్జెక్టులోనూ 100కి 100 మార్కులు రాశానని, ఒక్క మార్కు ఎలా తక్కువ వచ్చిందో తెలియదని పేర్కొంటూ.. రీ కౌంటింగ్ కోసం అప్లై చేస్తానని చెప్పింది. స్టేట్ ఫస్ట్ వస్తానని ఊహించానని పేర్కొంది. టీచర్లు ఏదీ చెబితే.. అలా ఫాలో అయిపోయాదానన్ని.. గంటల పాటు చదివినట్లు తెలిపింది. టీచర్స్, తల్లిదండ్రులు మద్దతుతోనే తాను సెకండ్ ర్యాంక్ సాధించినట్లు తెలిపింది. తనకు డాక్టర్ కావాలని ఉందని తెలిపింది. ఆ దిశగా అడుగులు వేస్తానని పేర్కొంది. కాగా, ఆమెకు బంధువలు, ఇతరులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.