iDreamPost
android-app
ios-app

కర్ణాటక 10th ఫలితాల్లో అద్భుతం! చిన్న గ్రామంలో చదివి, స్టేట్ టాపర్‌గా!

చదువుల్లో మేటిగా నిలుస్తున్నారు అమ్మాయిలు. ఇటీవల ఇరు తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన ఫలితాల్లో అమ్మాయిలు హవా సాగించిన సంగతి విదితమే. ఇప్పుడు పొరుగు రాష్ట్రంలో విడుదలైన ఫలితాల్లో కూడా వారే సత్తా చాటుతున్నారు.

చదువుల్లో మేటిగా నిలుస్తున్నారు అమ్మాయిలు. ఇటీవల ఇరు తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన ఫలితాల్లో అమ్మాయిలు హవా సాగించిన సంగతి విదితమే. ఇప్పుడు పొరుగు రాష్ట్రంలో విడుదలైన ఫలితాల్లో కూడా వారే సత్తా చాటుతున్నారు.

కర్ణాటక 10th ఫలితాల్లో అద్భుతం! చిన్న గ్రామంలో చదివి, స్టేట్ టాపర్‌గా!

ఇటీవల ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో పది, ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులు.. ఫలితాల కోసం ఎదురు చూశారు. ఊహించినట్లుగానే రిజల్ట్స్ వచ్చాయి. మంచి మార్కులు సాధించి సత్తాను చాటారు విద్యార్థులు. ముఖ్యంగా అమ్మాయిలు హవా సాగించారు. పేద ఇంట్లో పుట్టి.. ప్రభుత్వ బడుల్లో చదివిన చిన్నారులు మంచి స్కోర్ సాధించి.. వార్తల్లో నిలిచారు. మారుమూల ప్రాంతాల్లోని పిల్లలు కూడా ప్రతిభ కనబర్చి.. తల్లిదండ్రులకు, గ్రామాలకు పేరు తెచ్చారు. తాజాగా కర్ణాటకలో కూడా ఎస్ఎస్ఎల్సీ (10th class) ఫలితాలను రిలీజ్ చేసింది. ఇందులో బాగల్ కోట్‌కు చెందిన రైతు బిడ్డ అంకిత బసప్ప కొన్నూరు అనే విద్యార్థిని స్టేట్ టాపర్‌గా నిలిచింది. 625 మార్కులు గానూ.. 625 మార్కులు తెచ్చుకుని అందరి దృష్టిని ఆకర్షించింది.

అలాగే ఏడుగురు విద్యార్థులు ద్వితీయ స్థానంలో నిలిచారు. మేధా పి శెట్టి (బెంగళూరు), హర్షిత, చిన్మయ్, సిద్దాంత్, దర్శన్, శ్రీరామ్ విద్యార్థులకు 625 మార్కులకు గానూ 624 మార్కులు తెచ్చుకుని స్టేట్ సెకండ్ టాపర్స్‌గా నిలిచారు. ఇక థర్డ్ పొజిషన్‌లో నిలిచారు సుమారు 15 మంది విద్యార్థులు. వీరిలో ఒకరు అంకిత ఆనంద్ అందేవాదికర్. కాగా, ఆమె తమ గ్రామంలోనే ఫస్ట్‌గా నిలిచి తల్లిదండ్రులు, గ్రామానికి మంచి పేరు తెచ్చింది. బాగల్ కోట్ జిల్లా ముధోల తాలూకాలోని వజ్ర మట్టి గ్రామానికి చెందిన అంకిత.. స్టేట్ థర్డ్ ర్యాంక్ సాధించి.. ఆ ఊరికి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. కాగా, ఆమె మీడియాతో మాట్లాడుతూ సంతోషాన్ని వ్యక్తం చేసింది. తనకు పదో తరగతి ఫలితాల్లో 623 మార్కులు వచ్చాయని తెలిపింది.

కాగా, అంకిత మాట్లాడుతూ.. తన తల్లిదండ్రులు, టీచర్లు ఇచ్చిన ప్రోత్సాహంతో థర్డ్ ర్యాంక్ సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపింది. తాను పేపర్ బాగా రాశానని, తాను ర్యాంక్ వస్తుందని ఊహించానని తెలిపింది. కానీ థర్డ్ ర్యాంక్ వస్తుందని ఊహించలేదని, చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. తాను ఆన్ లైన్లో ట్యాషన్స్‌కు హాజరయ్యాయని, ఏదైనా డౌట్స్ ఉంటే.. టీచర్స్ అడిగి తెలుసుకునేదాన్ని అని, హార్డ్ వర్క్ చేశానని,  తల్లిదండ్రులు, అక్క ఇచ్చిన సపోర్టుతో ఈ ర్యాంక్ సాధించినట్లు తెలిపింది. తనను అందరూ కంగ్రాట్స్ చేస్తున్నారని ఆనందాన్ని వ్యక్తం చేసింది. కాగా, ఆమె తల్లిదండ్రులు కూడా కూతురు థర్డ్ ర్యాంక్ సాధించడంపై ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.