nagidream
Learn This AI Skill and Earn Lakhs: లక్షలు సంపాదించాలంటే ఇంజనీరింగ్ చేయాలి. ఎంటెక్ చేయాలి.. గొప్ప చదువులు చదవాలి అనే రోజులు పోయాయి. ఇప్పుడు ఎవరి దగ్గర స్కిల్ ఉంటే వారే కింగ్ అండ్ క్వీన్స్ అనే రోజులు వచ్చేశాయి. అంతా ఏఐ మహిమ. ఈ ఏఐ టూల్ నేర్చుకుంటే ఎలాంటి డిగ్రీ అవసరం లేకపోయినా కంపెనీలు లక్షల్లో ప్యాకేజ్ ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు.
Learn This AI Skill and Earn Lakhs: లక్షలు సంపాదించాలంటే ఇంజనీరింగ్ చేయాలి. ఎంటెక్ చేయాలి.. గొప్ప చదువులు చదవాలి అనే రోజులు పోయాయి. ఇప్పుడు ఎవరి దగ్గర స్కిల్ ఉంటే వారే కింగ్ అండ్ క్వీన్స్ అనే రోజులు వచ్చేశాయి. అంతా ఏఐ మహిమ. ఈ ఏఐ టూల్ నేర్చుకుంటే ఎలాంటి డిగ్రీ అవసరం లేకపోయినా కంపెనీలు లక్షల్లో ప్యాకేజ్ ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు.
nagidream
ప్రస్తుతం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) హవా నడుస్తోంది. ప్రతీ రంగంలోనూ ఏఐ ప్రాధాన్యత పెరిగిపోయింది. భవిష్యత్తులో ఏఐ టూల్స్ నేర్చుకోవడం అనేది కంపల్సరీ అయిపోతుందని.. నేర్చుకోని వారి జీవితం అగమ్యగోచరంగా మారుతుందని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ విషయంలో అనేక భయాలు, ఆందోళనలు ఉన్నాయి. ఏఐ మన ఫ్యూచర్ ని ఎలా ప్రభావితం చేయబోతుంది? ఏఐని తట్టుకుని నిలబడగలమా? వెనకబడిపోతామా? అన్న భయంతో ఇప్పటి నుంచి చాలా మంది ఏఐ స్కిల్స్ ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో గ్లోబల్ టెక్నాలజీ ఇన్నోవేటర్ ఐబీఎం ఎగ్జిక్యూటివ్ ఏఐకి సంబంధించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు.
సీఎన్బీసీ నివేదిక ప్రకారం.. 96 శాతం కంపెనీలు తమ సంస్థల నిర్వహణలో ఏఐని తీసుకొచ్చే పనిలో ఉన్నాయని అన్నారు. మూడింట రెండు వంతుల మంది ఉద్యోగులు తాము అసలు ఎప్పుడూ ఏఐ టెక్నాలజీతో పని చేయలేదని.. 2024 మార్చి నెలలో స్లాక్ వర్క్ ఫోర్స్ ల్యాబ్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. అయితే ఏఐ స్కిల్స్ ని నేర్చుకోవడం మానేస్తే కెరీర్ పురోగతిని కోల్పోతారని ఐబీఎం గ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ వర్క్ ఫోర్స్ డెవలప్మెంట్ వైస్ ప్రెసిడెంట్ లిడియా లోగాన్ హెచ్చరిస్తున్నారు. ఏఐలో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కి అత్యధిక డిమాండ్ ఉందని.. ఈ స్కిల్ ని నేర్చుకోవాలని సూచిస్తున్నారు. ఈ స్కిల్ కి డిగ్రీ కూడా అవసరం లేదని చెబుతున్నారు.
ప్రస్తుతం ఎక్కువ ప్రాచుర్యం పొందిన ఏఐ సాధనాల్లో ఒకటైన చాట్ జీపీటీనీ వాడుతున్నట్లైతే.. ప్రాంప్ట్ లు ఎంత ఖచ్చితంగా ఉంటే ప్రతిస్పందనలు అంత బాగా వస్తాయి. అందుకే బోల్డ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కి ఇంత డిమాండ్ ఉందని అన్నారు. ప్రాంప్ట్ ఇంజనీర్ జాబ్ ఎలా ఉంటుందంటే.. తన ఉద్యోగి లేదా క్లయింట్ కి విలువైన సమాచారం పొందడానికి చాట్ జీపీటీ, లార్జ్ లాంగ్వేజ్ మోడల్ వంటి ఏఐ చాట్ బాట్ లకు సరైన ప్రశ్నలను లేదా సూచనలను రూపొందిస్తారు. ప్రాంప్ట్ ఇంజనీర్లకు, ప్రొడక్ట్ మేనేజర్స్ వంటి సరికొత్త ఉద్యోగాలకు డిగ్రీ కంటే కూడా టెక్నికల్, సాఫ్ట్ స్కిల్స్ కే ప్రాధాన్యత ఉంటుందని లోగాన్ వెల్లడించారు.
లింక్డ్ ఇన్, ఇన్ డీడ్ వంటి వెబ్ సైట్స్ ప్రకారం.. కంపెనీలు ప్రాంప్ట్ ఇంజనీర్ కి ఏడాదికి సగటున రూ. 39.3 లక్షల జీతం ఇస్తాయట. 2 నుంచి 5 ఏళ్ల అనుభవం ఉంటే ఏడాదికి 6 లక్షల నుంచి 12 లక్షల జీతం ఇస్తాయట. ఐదేళ్ల అనుభవం ఉన్న సీనియర్ కైతే 12 లక్షల నుంచి 20 లక్షల జీతం ఇస్తాయట. ఫ్రెషర్ కైతే 2 లక్షల వరకూ ఉండవచ్చునట.