Dharani
Twin Sisters: కవల అక్కాచెల్లెళ్లు నయా రికార్డు సాధించారు. అత్యంత కఠినమైన పరీక్షలో ఆల్ ఇండియా టాపర్స్ గా నిలిచారు. ఆ వివరాలు..
Twin Sisters: కవల అక్కాచెల్లెళ్లు నయా రికార్డు సాధించారు. అత్యంత కఠినమైన పరీక్షలో ఆల్ ఇండియా టాపర్స్ గా నిలిచారు. ఆ వివరాలు..
Dharani
కర్ణాటక ఇంటర్ ఫలితాల్లో కవల అక్కాచెల్లెళ్లు.. ఒకే మార్కులు సాధించి.. రికార్డు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా మరో ఇద్దరు ట్విన్స్ కూడా ఇదే విధమైన రికార్డు క్రియేట్ చేశారు. ఒకే పరీక్షలో ఆల్ ఇండియా టాపర్స్ గా నిలిచారు. పైగా ఇది దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్ష కావడం.. దానిలో వీరిద్దరూ టాప్ మార్క్స్ స్కోర్ చేయడం సంచలనంగా మారింది. ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. ఈ ట్విన్స్ కుటుంబం అంతా ఇలానే టాపర్స్ అంట. మరి ఇంతకు వీరి స్వస్థలం ఎక్కడ.. వీరు ఆల్ ఇండియా టాపర్స్ గా నిలిచిన పరీక్ష ఏది అంటే..
సాధారణంగా పరీక్షలు అంటేనే చాలా మంది భయపడతారు. అందునా సీఏ ఎగ్జామ్ ఎంత కఠినంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి టఫ్ పరీక్షలో ఈ ఇద్దరు ట్విన్స్.. ఆల్ ఇండియా టాపర్స్ గా నిలిచారు. వీరే ముంబైకి చెందిన ట్విన్స్ సంస్కృతి, శ్రుతి. ఎంతటి పరీక్షలైనా అవలీలగా ఉత్తీర్ణత సాధించడం వీరి నైజం. సంస్కృతి, శ్రుతి సక్సెస్ జర్నీ మీకోసం..
చార్టర్డ్ ఎకౌంటెంట్ (సీఏ) ఫైనల్ ఎగ్జామినేషన్‌లో ఇరవై రెండు సంవత్సరాల ముంబై ట్విన్స్ సంస్కృతి, శ్రుతి ఆల్ ఇండియా టాప్ టెన్ ర్యాంకుల జాబితాలో చేరారు. సంస్కృతి రెండో ర్యాంక్ సాధించగా.. శ్రుతి ఎనిమిదో ర్యాంకు సాధించింది. సాధారణంగా పరీక్షలంటే చాలా మంది భయపడతారు. కానీ ఈ ట్విన్ సిస్టర్స్ కి మాత్రం పరీక్షలంటే పండగతో సమానం. ఆ ఇష్టమే వారిని ఇప్పుడు టాపర్ లుగా నిలిపింది అంట.
ఇక ఈ ట్విన్ సిస్టర్స్ ఇద్దరికి కొరియన్ సినిమాలు చూడడం, బ్యాడ్మింటన్ ఆడటం అంటే ఎంతో ఇష్టమంట. వీరిద్దరే కాక.. ఈ కుటుంబంలో చాలా మంది సీఏలో టాపర్స్ గా నిలిచారంట. దాంతో ఈ ట్విన్ స్టిసర్స్ కుటుంబాన్ని ఫ్యామిలీ ఆఫ్ సీఏ అని పిలుస్తున్నారు. ఎందుకంటే నాన్న, అన్నయ్య, వదిన కూడా సీఏ చేశారు. ’’పరీక్షల కోసం నేను, శ్రుతి కలిసే చదువుకున్నాం. మాకు ఏ డౌట్ వచ్చినా నాన్న, అన్నయ్య వాటిని క్లారిఫై చేసేవారు. కఠినమైన పోటీ పరీక్షలు ఎదుర్కోవడానికి ఈ రకమైన సపోర్టింగ్ సిస్టమ్ అవసరం. కుటుంబ సభ్యులు ఇచ్చిన ప్రోత్సాహం వల్లే మేం ఈ విజయం సాధించాము‘‘ అంటుంది సంస్కృతి.