iDreamPost
android-app
ios-app

Marwadi University: ఇంజనీరింగ్‌కు బెస్ట్‌ ఆప్షన్‌ ఈ యూనివర్శిటీ.. ఇక్కడ ఆ కోర్సులో జాయిన్‌ చేస్తే వద్దన్నా జాబే

  • Published Jul 06, 2024 | 12:20 PM Updated Updated Jul 12, 2024 | 12:20 PM

Marwadi University-Courses In Engineering: రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్వాడి యూనివర్శిటీ పేరు మార్మోగిపోతుంది. మరి ఈ కాలేజీలో అందుబాటులో ఉన్న కోర్సులు ఏంటి.. ప్లేస్‌మెంట్‌ అవకాశాలు ఎలా ఉన్నాయి వంటి వివరాలు మీకోసం..

Marwadi University-Courses In Engineering: రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్వాడి యూనివర్శిటీ పేరు మార్మోగిపోతుంది. మరి ఈ కాలేజీలో అందుబాటులో ఉన్న కోర్సులు ఏంటి.. ప్లేస్‌మెంట్‌ అవకాశాలు ఎలా ఉన్నాయి వంటి వివరాలు మీకోసం..

  • Published Jul 06, 2024 | 12:20 PMUpdated Jul 12, 2024 | 12:20 PM
Marwadi University: ఇంజనీరింగ్‌కు బెస్ట్‌ ఆప్షన్‌ ఈ యూనివర్శిటీ.. ఇక్కడ ఆ కోర్సులో జాయిన్‌ చేస్తే వద్దన్నా జాబే

సుమారు 15-20 ఏళ్ల క్రితం వరకు ఇంజనీరింగ్‌ విద్యకు ఇంత డిమాండ్‌ లేదు. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని వారికి ఈ కోర్సు గురించి అసలే మాత్రం అవగాహన లేదు. ఆ తర్వాత ఉన్నట్లుండి ఈ రంగంలో బూమ్‌ రావడంతో.. ఇంజనీరింగ్‌ చేసిన వారికి ఒక్కసారిగా ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. దానికి తోడు.. పెద్ద ఎత్తున ఇంజనీరింగ్‌ కాలేజీలు ఏర్పడ్డాయి. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో వేల సంఖ్యలో ఇంజనీరింగ్‌ కాలేజీలు ఉన్నాయి. ఇప్పటికి కూడా ఇంజనీరింగ్‌ విద్యకు ఫుడ్‌ డిమాండ్‌ ఉంది. మార్కెట్‌ అవసరాలకు తగ్గట్టుగా ఇంజనీరింగ్‌లో కూడా కొత్త కొత్త కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే వీటి గురించి ఇటు విద్యార్థులకు, అటు తల్లిదండ్రులకు పెద్దగా అవగాహన ఉండటం లేదు. నేటికి కూడా మన దగ్గర ఇంజనీరింగ్‌ అంటే కంప్యూటర్‌ సైన్స్‌ మాత్రమే అనుకునే వాళ్లు చాలా మంది ఉన్నారు. దాంతో ఇంజనీరింగ్‌లో ఏ కోర్సులో చేరితే బాగుంటుంది.. ప్లేస్‌మెంట్స్‌ ఎలా ఉంటాయి అనే వివరాలను అందిస్తూ.. మిగతా కాలేజీలకు భిన్నంగా వేర్వేరు కోర్సులను అందిస్తూ.. విద్యార్థులకు బంగారు భవిష్యత్తును అందిస్తోంది ఓ యూనివర్శిటీ. అదే గుజరాత్‌లోని మార్వడీ యూనివర్శిటీ.

ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ విన్నా మార్వాడి యూనివర్శిటీ పేరు మార్మోగిపోతుంది. ఇక్కడ మిగతా కాలేజీల్లో ఉన్న కోర్సులతో పాటుగా.. మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా వచ్చిన కొత్త కోర్సులను కూడా ప్రవేశపెట్టి.. విద్యార్థులకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది ఈ మార్వాడి యూనివర్శిటీ. మరి ఈ కాలేజీలో ఉన్న కొత్త కోర్సులు ఏంటి.. వాటిల్లో ఉన్న ఉద్యోగ అవకాశాలు.. మార్కెట్‌లో వాటికున్న డిమాండ్‌ వంటి తదితర వివరాల గురించి కాలేజీ యాజమాన్యం పూర్తి వివరాలు వెల్లడించింది. ఆ వివరాలు..

ఇంజనీరింగ్‌లో కెమికల్‌ ఇంజనీరింగ్‌ బ్రాంచ్‌ కూడా ఉంది. అయితే దీని గురించి రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు, తల్లిదండ్రులకు పెద్దగా అవగాహన లేదు. మన దగ్గర చాలా కాలేజీల్లో ఈ కోర్సు అందుబాటులో లేదు. కానీ గుజరాత్‌లో ఉన్న మార్వాడి యూనివర్శిటీలో కెమికల్‌ ఇంజనీరింగ్‌ కోర్సు అందుబాటులో ఉంది. ఇక్కడ ఈ కోర్సుకు ఏ స్థాయిలో డిమాండ్‌ ఉందంటే.. 100 మంది కావాలని కంపెనీలు ప్లేస్‌మెంట్స్‌ కోసం కాలేజీలకు వస్తుంటే.. కేవలం 30 మంది విద్యార్థులు మాత్రమే అందుబాటులో ఉన్నారు. వీరిని కళ్లకద్దుకుని మరీ రిక్రూట్‌ చేసుకుంటున్నాయి కంపెనీలు. ఈ క్రమంలో కాలేజీ యాజమాన్యం దీనిపై స్పందిస్తూ.. గుజరాత్‌లో సుమారు 500-800 వరకు కెమికల్‌ కంపెనీలు ఉన్నాయని.. ఇక్కడ కెమికల్‌ ఇంజనీరింగ్‌ చేసిన వారికి వద్దన్నా ఉద్యోగం లభిస్తుందని.. వారి భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా ఉండదని అంటున్నారు.

అలానే మార్వడి యూనివర్శిటీలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌కు కూడా మంచి డిమాండ్‌ ఉందని.. ఈ కోర్సుకు ఇప్పుడనే కాదు.. ఇంకో పదేళ్ల తర్వాత కూడా మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంటుందని ఇక్కడ అధ్యాపకులు చెప్పుకొచ్చారు. సోలార్‌ ప్యానెల్స్‌, ఈవీలు ఇలా ప్రతి దానిలో మెకానికల్‌ ఇంజనీర్ల అవసరం ఉంటుందని తెలిపారు. మార్వాడి యూనివర్శిటీలో మెకానికల్‌ విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తున్నాయని.. ఇక్కడ చదివే వారిలో 50 శాతం మంది విద్యార్థులు ప్లేస్‌మెంట్స్‌ వద్దని.. తమ సొంతంగా కంపెనీలు పెట్టాలని చూస్తున్నారని చెప్పుకొచ్చారు. తమ కాలేజీకి అదానీ, రిలయన్స్‌ ఇండస్ట్రీలు ప్లేస్‌మెంట్స్‌ కోసం వస్తాయని చెప్పుకొచ్చారు.

అలానే మార్వాడి యూనివర్శిటీలో ఐసీటీ (ఈసీఈకి బదులుగా) కోర్సు అందుబాటులో ఉంది. అలానే ఇంటర్లో బైపీసీ తీసుకున్న వారికి కూడా మార్వాడి యూనివర్శిటీలో ఇంజనీరింగ్‌ కోర్సు అందుబాటులో ఉంది. వారి కోసం బయాలజీ ప్లస్‌ కంప్యూటర్‌ సైన్స్‌ కలిపి.. బయోఇన్‌ఫోమేటిక్స్‌ కోర్సు తీసుకువచ్చారు. మరి ఈ కోర్సు ఎలా ఉంటుంది.. దీనిలో ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి వంటి వివరాలను అధ్యాపకులు వెల్లడించారు. ఇక పూర్తి వివరాల కోసం వీడియో చూడండి. ఇక మార్వాడి యూనివర్శిటీ మరో ప్రత్యేకత ఏంటంటే.. ఇక్కడ పని చేసే ఫ్యాకల్టీ అందరికి ఏళ్ల తరబడి అనుభవం మాత్రమే కాక.. పీహెచ్‌డీ చేసిన వారు మాత్రమే ఇక్కడ అధ్యాపకులుగా పని చేస్తున్నారంటే.. ఈ యూనివర్శిటీలో ఎంత నాణ్యమైన విద్య అందిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.