iDreamPost
android-app
ios-app

బీటెక్ విద్యార్థులకు JNTU శుభవార్త.. ఇకపై ఆ కోర్సులు కూడా చేసేందుకు

  • Published Jul 12, 2024 | 1:32 PMUpdated Jul 13, 2024 | 12:24 PM

JNTU-BTech Students, Banking Finance Services: బీటెక్‌ విద్యార్థులకు జేఎన్‌టీయూ శుభవార్త చెప్పింది. ఇంజనీరింగ్‌తో పాటుగా ఆ కోర్సులు కూడా చేసేందుకు అవకాశం కల్పిస్తోంది. ఆ వివరాలు..

JNTU-BTech Students, Banking Finance Services: బీటెక్‌ విద్యార్థులకు జేఎన్‌టీయూ శుభవార్త చెప్పింది. ఇంజనీరింగ్‌తో పాటుగా ఆ కోర్సులు కూడా చేసేందుకు అవకాశం కల్పిస్తోంది. ఆ వివరాలు..

  • Published Jul 12, 2024 | 1:32 PMUpdated Jul 13, 2024 | 12:24 PM
బీటెక్ విద్యార్థులకు JNTU శుభవార్త.. ఇకపై ఆ కోర్సులు కూడా చేసేందుకు

ఇంజనీరింగ్‌ అంటే ఒకప్పుడు సాంప్రదాయ కోర్సులు మాత్రమే అందుబాటులో ఉండేవి. ఈసీఈ, ట్రిపుల్‌ ఈ, కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీ, మెకానికల్‌, సివిల్‌, ఏవియేషన్‌ ఇంతే.. ఈ కోర్సులు మాత్రమే అందుబాటులో ఉండేవి. అయితే మారుతున్న మార్కెట్‌ అవసరాలకు తగ్గట్టుగా ఇంజనీరింగ్‌లో కూడా కొత్త కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. ఇక నేటి కాలంలో చాలా మంది విద్యార్థులు ఒకే సారి రెండు, మూడు కోర్సులు కలిపి చదవడానికి ఇష్టపడుతున్నారు. మార్కెట్‌లో పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి. దాంతో చాలా మంది విద్యార్థులు.. సాంప్రదాయ కోర్సులపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈ క్రమంలో ఇంజనీరింగ్‌ విద్యార్థలకు జేఎన్‌టీయూ భారీ శుభవార్త చెప్పింది. ఇకపై బీటెక్‌తో పాటుగా ఇతర కోర్సులు చేసేందుకు అవకాశం కల్పిస్తోంది. ఆ వివరాలు..

జేఎన్‌టీయూ రోటిన్‌కు భిన్నంగా ఇంజనీరింగ్‌ కోర్సులతో పాటుగా బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, బీమా కోర్సులను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఉన్నత విద్యాశాఖ.. ఇంజనీరింగ్‌లో బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, బీమా(బీఎఫ్‌ఎస్‌ఐ) కోర్సును ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఈ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండటంతో.. ఇకపై బీటెక్‌లో దీనిని మైనర్ డిగ్రీగా ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. విద్యార్థులు తమ టెక్నికల్‌ బ్రాంచీతో పాటే ఈ కోర్సును కూడా చదవొచ్చు.

తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది దీన్ని పైలెట్‌ ప్రాజెక్ట్‌గా అమలు చేయనున్నారు. ఇక ఇప్పటికే కూకట్‌పల్లి జేఎన్‌టీయూలో ఈ ఏడాది నుంచి డబుల్‌ డిగ్రీ కోర్సును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఎప్పటి నుంచో ఈ డబుల్‌ డిగ్రీ కోర్సులను అమలు చేయాలని భావించిన అధికారులు.. ఈ ఏడాది వాటికి శ్రీకారం చుట్టారు. తాజాగా వర్సిటీ రిజిస్ట్రార్‌ ఈ డబుల్‌ డిగ్రీ కోర్సును ప్రారంభించారు.

నేషనల్‌ ఎడ్యుకేషన్‌లో భాగంగా జేఎన్‌టీయూలో సెకండ్‌ డిగ్రీగా బీబీఏ డీఏ(బ్యాచిలర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మిస్ట్రేషన్‌ ఇన్‌ డేటా అనాలసిస్‌) కోర్సును ప్రారంభించారు. మూడేండ్ల పాటు ఉండే ఈ కోర్సులో చేరేందుకు బీటెక్‌, బీఫార్మసీ ఫస్ట్‌, సెకండ్‌, థర్డ్‌ ఇయర్‌ చదువుతున్న విద్యార్థులు అర్హులు. ఇక ఈ కోర్సులో చేరిన విద్యార్థులను.. బీఎఫ్‌ఎస్‌ఐ ప్రతినిధులు ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. బీటెక్‌తో పాటుగా బ్యాంకింగ్‌ కోర్సులను కూడా పూర్తి చేస్తే.. మార్కెట్‌లో మంచి ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం ఉంది అంటున్నారు నిపుణులు.

ఇదిలా ఉంచితే ఇటీవలే జేఎన్‌టీయూ.. టెక్స్‌టైల్‌ ఇంజనీరింగ్‌ కోర్సు ప్రవేశపెట్టింది. అలానే సింగరేణి ప్రాంతంలో ఎక్కువగా ఉపయోగపడనున్న మైనింగ్‌ కోర్సులను ఇటీవల మంథని జేఎన్‌టీయూలో అందుబాటులోకి తెచ్చారు. ఇక ఇప్పుడంతా ఏఐ ట్రెండ్‌ నడుస్తోంది. అందుకు తగ్గట్టుగానే.. సీఎస్‌జీ(కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ డిజైన్‌), సీఎస్‌ఎం (కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌- ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ మిషన్‌ లర్నింగ్‌), సీఎస్‌డీ (కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌-డాటాసైన్స్‌), సీఎస్‌ఐ (కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ)లు సీఎస్‌ఈ (కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌) కోర్సులు అందుబాటులో ఉన్నాయి. దీని వల్ల విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉంది అంటున్నారు నిపుణులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి