School Holiday-August 21st, Bharat Bandh: విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు 21 సెలవు.. కారణమిదే!

Holiday: విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు 21 సెలవు.. కారణమిదే!

August 21st Holiday-Bharat Bandh: ఇప్పటికే వరుస సెలవులు ఎంజాయ్‌ చేస్తోన్న విద్యార్థులకు మరో శుభవార్త. ఆగస్టు 21న కూడా విద్యాసంస్థలకు సెలవు అని తెలుస్తోంది. ఆ వివరాలు..

August 21st Holiday-Bharat Bandh: ఇప్పటికే వరుస సెలవులు ఎంజాయ్‌ చేస్తోన్న విద్యార్థులకు మరో శుభవార్త. ఆగస్టు 21న కూడా విద్యాసంస్థలకు సెలవు అని తెలుస్తోంది. ఆ వివరాలు..

ఆగస్టు 15 నుంచి వరుస సెలవులు రావడంతో విద్యార్థులు పండగ చేసుకుంటున్నారు. ఆగస్టు 15-19 వరకు వరుసగా 5 రోజుల పాటు సెలవులు వచ్చాయి. చాలా వరకు ఉద్యోగులకు కూడా ఈ సెలవులు వర్తిస్తాయి. స్వాతంత్య్ర దినోత్సవం, వరలక్ష్మి వ్రతం, శనివారం, ఆదివారం, రాఖీ పౌర్ణమి వంటి పండుగలు వరుసగా రావడంతో.. విద్యార్థులకు వెంటవెంటనే 5 రోజులు పాటు హాలీడేస్‌ వచ్చాయి. దాంతో చాలా మంది సొంతూళ్లకు ప్రయాణం అయ్యారు. శ్రావణమాసం ప్రారంభం కావడంతో.. వరుస పండగలు వస్తున్నాయి. ఈ నెలలో వరలక్ష్మి వ్రతం, రాఖీ పౌర్ణమి, కృష్ణాష్టమి వంటి పండుగలు వస్తున్నాయి. వీటి తర్వాత వినాయక చవితి, దసరా వంటి పండగలు క్యూ కడతాయి. దాంతో విద్యార్థులకు వరుసగా సెలవులు రానున్నాయి.

ఇక ఆగస్టులో ఇప్పటికే విద్యార్థులకు వరుసగా ఐదు రోజులు సెలవులు వచ్చాయి. ఆగస్టు 19 వరకు సెలవులు ఉండగా.. ఒక్క రోజు గ్యాప్‌తో ఆగస్టు 21, బుధవారం నాడు కూడా సెలవు రాబోతుంది అని సమాచారం. అయితే దీనిపై విద్యాశాఖ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి ఆగస్టు 21న సెలవు ఎందుకంటే.. తాజాగా సుప్రీంకోర్టు.. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణను సమర్థిస్తూ.. తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనిపై బహుజన సంఘాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఎస్సీ, ఎస్టీ రెండు వర్గాల్లో ఉప వర్గీకరణ చేపట్టాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు నిరసనగా.. ఆగస్టు 21వ తేదీన భారత్‌ బంద్‌కు భీమ్‌సేన్‌, ట్రైబర్‌ ఆర్మీ చీఫ్‌ పిలుపునిచ్చాయి.

భీమ్‌సేన్‌, ట్రైబర్‌ ఆర్మీ చీఫ్‌ బంద్‌ పిలుపునకు పలు సంఘాలు మద్దతిచ్చాయి. అంతేకాక ఆగస్టు 21న దేశంలోని అన్ని పాఠశాలలు, కాలేజీలు మూసి వేయాలని కోరుతున్నారు. ప్రభుత్వాలు దీనికి సానుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉండటంతో.. విద్యార్థులకు ఆగస్టు నెలలో మరో రోజు సెలవు జత కానుండనుంది అంటున్నారు. ఇక ఆగస్టు నాలుగో వారంలో 24 నాలుగో శనివారం.. చాలా వరకు పాఠశాలలకు సెలవు, లేదంటే హాఫ్‌ డే స్కూల్‌ ఉంటుంది. 25 ఆదివారం సెలవు. అలానే ఆగస్టు 26 కృష్ణాష్టమి సందర్భంగా సెలవు ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద ఆగస్టులో విద్యార్థులకు భారీ ఎత్తున సెలవులు వచ్చాయి.

Show comments