నిరుపేద విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు కల్పించేందుకు ఇండియన్ ఆర్మీ ముందుకు వచ్చింది. తమ గొప్ప మనసును చాటుకుంటూ.. విద్యార్థుల కోసం సరికొత్త స్కాలర్ షిప్ పథకాన్ని ప్రకటించింది.
నిరుపేద విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు కల్పించేందుకు ఇండియన్ ఆర్మీ ముందుకు వచ్చింది. తమ గొప్ప మనసును చాటుకుంటూ.. విద్యార్థుల కోసం సరికొత్త స్కాలర్ షిప్ పథకాన్ని ప్రకటించింది.
చాలా మంది విద్యార్థులకు ఉన్నత చదువులు చదువుకోవాలని, గొప్ప గొప్ప స్థానాల్లో నిలబడాలని కలలు కంటూ ఉంటారు. అయితే వారి కలలను ఆర్థిక పరిస్థితులు వెనక్కి నెట్టేస్తుంటాయి. అలాంటి పేద, మధ్య తరగతి విద్యార్థుల కోసం ప్రభుత్వాలతో పాటుగా అనేక సంస్థలు, ఎన్జీవోలు స్కాలర్ షిప్ లు ఆఫర్ చేస్తూ ఉంటాయి. చదువుకోవాలని ఉన్నా.. చదువుకోలేని వారికి మద్ధతునిస్తూ తమ గొప్ప మనసును చాటుకుంటూ ఉంటాయి సదరు సంస్థలు. తాజాగా ఇండియన్ ఆర్మీ తన గొప్ప మనసును చాటుకుంది. నిరుపేద విద్యార్థులకు సరికొత్త స్కాలర్ షిప్ ప్రకటించింది. దానికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
నిరుపేద విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు కల్పించేందుకు ఇండియన్ ఆర్మీ ముందుకు వచ్చింది. తమ గొప్ప మనసును చాటుకుంటూ.. విద్యార్థుల కోసం సరికొత్త స్కాలర్ షిప్ పథకాన్ని ప్రకటించింది. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా చాలా మంది విద్యకు దూరం అవుతున్నారు. ఈ పరిస్థితులను నిర్మూలించడానికి ఇటు ప్రభుత్వాలు అటు సేవా సంస్థలు, బిజినెస్ మెన్స్ వంటి వారు పేద విద్యార్థులకు స్కాలర్ షిప్స్ ప్రకటిస్తున్నారు. తాజాగా ఇండియన్ ఆర్మీ సైతం పేద విద్యార్థుల కోసం స్కాలర్ షిప్ స్కీమ్ ను తీసుకొచ్చింది. అయితే ఈ స్కీమ్ జమ్మూ కశ్మీర్ లో ని నిరుపేద స్టూడెంట్స్ కు మాత్రమే వర్తిస్తుంది.
కశ్మీర్ లోయలో పేద స్టూడెంట్స్ కోసం జమ్మూ అండ్ కశ్మీర్ స్పెషల్ స్కాలర్ షిప్ స్కీమ్-2023ను ప్రారంభించింది. ఇండియన్ ఆర్మీ సద్భావన ఆపరేషన్ లో భాగంగా ఈ పథకాన్ని తీసుకొచ్చింది. విద్యా రంగంలో అపారమైన ప్రతిభ చూపించే పేద, మధ్యతరగతి స్టూడెంట్స్ కు ఈ స్కాలర్ షిప్ అందించనున్నారు. దీని వల్ల పేద, ధనిక పిల్లల మధ్య అంతరాన్ని తగ్గించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని ఇదే తమ లక్ష్యమని ఇండియన్ ఆర్మీ పేర్కొంది. ఇక ఈ స్కాలర్ షిప్ కోసం కశ్మీర్ లోయలోని వివిధ జిల్లాల నుంచి 146 మంది స్టూడెంట్స్ ను ఎంపిక చేస్తారు. ఒక్కొక్క విద్యార్థికి రూ. 1.2 లక్షల చొప్పున స్కాలర్ షిప్ అందిస్తారు.
ఈ పథకంలో భాగంగా 12 అనుబంధ యూనివర్సిటీలతో ఒప్పందం కుదుర్చుకున్నామని, స్కాలర్ షిప్ కు ఎంపికయ్యే విద్యార్థుల ఖర్చులను సంబంధిత యూనివర్సిటీలే భరిస్తాయి. దీంతో వారి ఉన్నత చదువుల కలను సాకారం చేసుకుంటారని ఇండియన్ ఆర్మీకి చెందిన ఓ అధికారి తెలిపారు. కాగా.. జమ్మూ కశ్మీర్ ప్రత్యేక స్కాలర్ షిప్ కు రెండు దశల్లో విద్యార్థులను ఎంపిక చేస్తారు. తొలుత రాత పరీక్ష, ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఇప్పటికే ఈ స్కీమ్ కోసం కుప్పారా జిల్లా నుంచి చాలా దరఖాస్తులు వచ్చాయని, వారికి రాత పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించి.. అందులో 34 మంది విద్యార్థులను ఎంపిక చేసినట్లు ఇండియన్ ఆర్మీ అధికారి తెలిపారు. మరి కశ్మీర్ పేద విద్యార్థుల కోసం స్కాలర్ షిప్ స్కీమ్ ప్రవేశపెట్టిన ఇండియన్ ఆర్మీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.