iDreamPost
android-app
ios-app

టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ పాసైన వాళ్లకి పోస్టాఫీసుల్లో భారీ ఎత్తున జాబ్స్‌.. రూ. 81,100 వరకూ జీతం

  • Published Nov 09, 2023 | 2:26 PM Updated Updated Nov 09, 2023 | 2:26 PM

భారతీయ తపాలాశాఖలో భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలయ్యింది. ఎంపికైన వారికి 81,100 వరకు జీతం పొందుతారు. మరి ఈ పోస్ట్‌లకు అప్లై చేయాలంటే క్వాలిఫికేషన్‌ ఏంటి, ఎప్పటి నుంచి అప్లై చేయాలి వంటి తదితర వివరాలు..

భారతీయ తపాలాశాఖలో భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలయ్యింది. ఎంపికైన వారికి 81,100 వరకు జీతం పొందుతారు. మరి ఈ పోస్ట్‌లకు అప్లై చేయాలంటే క్వాలిఫికేషన్‌ ఏంటి, ఎప్పటి నుంచి అప్లై చేయాలి వంటి తదితర వివరాలు..

  • Published Nov 09, 2023 | 2:26 PMUpdated Nov 09, 2023 | 2:26 PM
టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ పాసైన వాళ్లకి పోస్టాఫీసుల్లో భారీ ఎత్తున జాబ్స్‌.. రూ. 81,100 వరకూ జీతం

నేటి కాలంలో ఎంత చిన్న ఉద్యోగం రావాలన్నా మినిమం డిగ్రీ చేసి ఉండాలి. టెన్త్‌, ఇంటర్‌ పాసైనవాళ్లకు ఉద్యోగాలు దొరకడం చాలా కష్టం. అయితే ఇది ప్రైవేట్‌ సెక్టార్‌కే వర్తిస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థల్లో మాత్రం నేటికి కూడా పదో తరగతి, ఇంటర్‌ అర్హతతో ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. అలా టెన్త్‌, ఇంటర్‌ పూర్తయిన వారి కోసం ఉద్యోగాలు కల్పించే సంస్థలో తపాలా శాఖ ఉంది. పదో తరగతి పాస్‌ అయిన వారికి కూడా ఉద్యోగాలు కల్పిస్తుంది ఇండియన్‌ పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌. ఈ క్రమంలో తాజాగా భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి రెడీ అవుతోంది పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌. టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ పాసైన వారు వీటికి అర్హులు. ఆ వివరాలు..

భారత సమాచార మంత్రిత్వ శాఖ పరిధిలో పని చేసే ఇండియన్‌ పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌.. భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో స్పోర్ట్స్ కోటా కింద ఉన్న 1899 పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోస్ట్‌ను అనుసరించి టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ పాసైన వారు అర్హులని వెల్లడించింది.

ఇక మొత్తం 1,899 పోస్టుల్లో.. పోస్టల్ అసిస్టెంట్-598 ఖాళీలు, సార్టింగ్ అసిస్టెంట్-143 ఖాళీలు, పోస్ట్‌మ్యాన్-585 ఖాళీలు, మెయిల్ గార్డ్-3 ఖాళీలు, ఎంటీఎస్‌-570 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాల భర్తీకి అర్హులైన క్రీడాకారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అలాగే.. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://dopsportsrecruitment.cept.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

నోటిఫికేషన్‌ వివరాలు..

  • విద్యార్హతలు : అభ్యర్థులు పోస్టును అనుసరించి టెన్త్‌, ఇంటర్మీడియట్‌, డిగ్రీ పాస్‌ అవ్వడంతో పాటు సంబంధిత క్రీడాంశంలో అర్హత సాధించి ఉండాలి.
  • వయసు : అభ్యర్థుల వయసు ఎంటీఎస్‌ పోస్టులకు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. మిగిలిన పోస్టులకు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
  • అప్లికేషన్‌ ప్రారంభం తేదీ : నవంబర్‌ 10, 2023 నుంచి అప్లై చేసుకోవచ్చు.
  • దరఖాస్తులకు చివరితేది : డిసెంబర్‌ 9, 2023 వరకు చివరి గడువు.
  • అప్లికేషన్‌ ఫీజు చెల్లించడానికి లాస్ట్‌ డేట్‌ : డిసెంబర్‌ 9, 2023

ఎవరికి ఎంత జీతం అంటే..

  • పోస్టల్‌ అసిస్టెంట్‌- లెవల్‌: వీరికి జీవం రూ.25,500-రూ.81,100
  • సార్టింగ్‌ అసిస్టెంట్‌-లెవల్‌ 4: వీరి సాలరీ రూ.25,500-రూ.81,100
  • పోస్ట్‌మ్యాన్‌-లెవల్‌ 3: వీరికి జీతం రూ.21,700-రూ.69,100
  • మెయిల్‌ గార్డ్‌-లెవల్‌ 3: వీరి సాలరీ రూ.21,700-రూ.69,100
  • మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌-లెవల్‌ 1: వీరికి జీతం రూ.18,000-రూ.56,900