హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్లో మీ పిల్లలను ఉచితంగా చదివించే అవకాశం.. మిస్‌ చేసుకోకండి

Hyderabad Public School: మీ పిల్లలను హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్లో చదివించాలనుకుంటున్నారా.. అది కూడా ఉచితంగా.. అయితే మీ కోసమే ఈ వార్త.

Hyderabad Public School: మీ పిల్లలను హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్లో చదివించాలనుకుంటున్నారా.. అది కూడా ఉచితంగా.. అయితే మీ కోసమే ఈ వార్త.

తమ పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలని ప్రతి తల్లీదండ్రులు కోరుకుంటారు. తమకున్నంతలో బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని భావిస్తారు. అయితే నేటి కాలంలో నాణ్యమైన విద్యా అనేది ఎంతో ఖరీదైన వ్యవహారంగా మారింది. పేరు మోసిన టాప్‌ స్కూల్లో ఎల్‌కేజీలో జాయిన్‌ చేయాలంటేనే లక్షల్లో డబ్బులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. పేద, మధ్యతరగతి తల్లిదండ్రులకు అంత పెద్ద మొత్తం చెల్లించడం అంటే.. తలకు మించిన భారమే. ఇక నేటి కాలంలో ఇంగ్లీష్‌ మీడియంలో చదవకపోతే.. పిల్లలకు మంచి భవిష్యత్తు అనేది కష్టం. అందుకే తల్లిదండ్రులు అప్పో సప్పో చేసి.. మరీ పిల్లలను ప్రైవేట్‌ ఇంగ్లీష్‌ మీడియం స్కూళ్లకు పంపుతున్నారు. అయితే డబ్బులు కట్టినా సరే నాణ్యమైన విద్య దొరకడం అనేది కష్టమే అయ్యింది.

ఇక మన రాష్ట్రంలో ఉన్నతమైన, నాణ్యమైన విద్యను అందించే కార్పొరేట్‌ స్కూల్స్‌ జాబితాలో హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ పేరు ముందు వరుసలో కనిపిస్తుంది. కేవలం మన రాష్ట్రంలోనే కాక.. సౌతిండియాలోనే టాప్‌ స్కూల్స్‌లో ఒకటిగా నిలిచింది హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌. ఇక్కడ కేవలం చదువు మాత్రమే కాక.. ఆటలు, క్రమ శిక్షణ ఇతర అన్నీ అంశాల్లో ముందు ఉండేలా తీర్చిదిద్దుతారు. సీఎం జగన్‌ సహా ఎందరో ప్రముఖులు హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్లో చదువుకున్నారు. మరి అలాంటి పాఠశాలలో మీ పిల్లలను చదివించాలని ఉందా.. అది కూడా ఉచితంగా.. ఎలా అనుకుంటున్నారా.. అయితే ఇది చదవండి.

అయితే ఈ అవకాశం అందరికీ లేదు. కేవలం హనుమకొండలో ఉన్న వారికే ఈ అవకాశం. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుపేద గిరిజన విద్యార్థిని, విద్యార్థులకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఒకటో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు హనుమకొండ జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాకు చెందిన గిరిజన విద్యార్థులకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో ఒకటో తరగతిలో చేరేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఈ ప్రకటనలో వెల్లడించారు. ఆసక్తి కలిగిన పేద గిరిజన విద్యార్థులు జిల్లాలోని గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మార్చి 11 వరకు చివరి తేదీ అని వెల్లడించారు.

అర్హతలు..

  • విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం పట్టణాల్లో ఉండే వారికి అయితే కు రూ:2,00,000,
  • అలాగే గ్రామీణ ప్రాంతాల వారికి రూ:1,50,000 కు మించరాదు.
  • ఇందుకు సంబంధించి తహసిల్దార్‌ మీ సేవ ద్వారా జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
  • విద్యార్థులు జూన్ 1,2017 నుండి 31 మే 2018 లోపు జన్మించిన వారై ఉండాలి.
  • మున్సిపల్ అధికారులు చేత లేదా తహసిల్దార్ జారీ చేసిన బర్త్‌ సర్టిఫికేట్‌ ఉండాలి.
  • నివాస ధ్రువీకరణ పత్రం తప్పనిసరి.
  • దరఖాస్తు ఫామ్‌తో పాటు మూడు పాస్ ఫోటో సైజ్ ఫోటోలు, కులం ధ్రువీకరణ పత్రాల కాపీలు అవి కూడా గెజిటెడ్ అధికారి చేత అటెస్టేషన్ చేసినవి జత చేయాలి.

ఆ తర్వాత లక్కీ డ్రా నిర్వహిస్తారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఈ లక్కీ డ్రా కార్యక్రమానికి హాజరు కావాలన్నారు. ఇందులో ఎంపిక కాబడ్డ విద్యార్థులకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చోటు దక్కుతుందన్నారు. ఆసక్తి అర్హత కలిగిన విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Show comments