iDreamPost
android-app
ios-app

సర్వీస్ మోటోతో వచ్చిన యూనివర్సిటీ.. ఇక్కడ చేరితే జాబ్ పక్కా!

Marwadi University From Rajkot Gujarat: మీ పిల్లల ఉన్నత చదువుల కోసం ఒక మంచి యూనివర్సిటీ వెతుకుతున్నారా? అయితే ఈ మార్వాడీ యూనివర్సిటీ గురించి మీరు తెలుసుకోవాల్సిందే. అక్కడ అందించే సేవలు, చెబుతున్న కోర్సుల గురించి ఒకసారి తెలుసుకోండి.

Marwadi University From Rajkot Gujarat: మీ పిల్లల ఉన్నత చదువుల కోసం ఒక మంచి యూనివర్సిటీ వెతుకుతున్నారా? అయితే ఈ మార్వాడీ యూనివర్సిటీ గురించి మీరు తెలుసుకోవాల్సిందే. అక్కడ అందించే సేవలు, చెబుతున్న కోర్సుల గురించి ఒకసారి తెలుసుకోండి.

సర్వీస్ మోటోతో వచ్చిన యూనివర్సిటీ.. ఇక్కడ చేరితే జాబ్ పక్కా!

ప్రస్తుతం పిల్లల చదువు అనేది తల్లిదండ్రులకు పెద్ద యజ్ఞంలా మారిపోయింది. అంటే.. వారికి ఫీజులు కట్టడం ఒక ఎత్తు అయితే.. వారికోసం ఒక మంచి ఎడ్యుకేషన్ ఇన్ స్టిట్యూట్ ని వెతకడం కూడా పెద్ద ప్రహసనంగా మారిపోయింది. ఇలాంటి తరుణంలో తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు ఒక అద్భుతమైన యూనివర్సిటీ దొరికేసింది. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ యూనివర్సిటీ పేరు బాగా వైరల్ అవుతోంది. వారికి రెండు తెలుగు రాష్ట్రాల్లో 14 ప్రాంతాల్లో ఆఫీసులు కూడా ఉన్నాయి. మీరు ఆ ఆఫీసుల్లో అడ్మిషన్ కూడా తీసుకోవచ్చు. అయితే క్యాంపస్ చూడకుండానే అడ్మిషన్ ఎలా అనే ప్రశ్న రావచ్చు. అందుకే ఇప్పటికే అక్కడికి వెళ్లిన ఈ తల్లిదండ్రుల మాటలు వింటే మీకే అర్థమైపోతుంది.

ఇప్పుడు చెప్పుకుంటున్న ఈ యూనివర్సిటీ పేరు మార్వాడీ యూనివర్సిటీ. ఇది గుజరాత్ లోని రాజ్ కోట్ లో ఉంది. ఈ యూనివర్సిటీకి ఉన్న ప్రత్యేక గుర్తింపు ఏంటంటే NAAC ర్యాంకింగ్స్ లో A+ గ్రేడ్ సొంతం చేసుకుంది. అలాగే గుజరాత్ ప్రభుత్వం నుంచి గ్రాంటెడ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ స్టేటస్ ని కూడా సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ యూనివర్సిటీ గురించి ఎందుకు ప్రస్తావన వచ్చింది అంటే.. ఏకంగా 600 మంది తెలుగు విద్యార్థులు వారి తల్లిదండ్రులతో సహా గుజరాత్ లో ఉన్న ఈ వర్సిటీకి వెళ్లారు. అక్కడ ఏకంగా 3 రోజులపాటు ఉండి ఆ క్యాంపస్ గురించి అన్నీ విషయాలు తెలుసుకున్నారు.

క్యాంపస్ లో ఉండే ఫుడ్, సౌకర్యాలు, తరగతి గదులు, టీచింగ్ స్టాఫ్ ఇలా అన్నీ తెలుసుకున్నారు. అది కూడా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా. అందరినీ యూనివర్సిటీ వాళ్లే సొంత ఖర్చులతో తీసుకెళ్లారు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు చెప్తున్న మాటలు రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ మార్వాడీ యూనివర్సిటీకి ప్రత్యేకతల గురించి మాట్లాడుకోవాలి అంటే.. ఇక్కడ 360 డిగ్రీ ఎడ్యుకేషన్ లభిస్తుంది. మీ పిల్లలకు వరల్డ్ క్లాస్ విద్యను అందిస్తారు. అలాగే ఈ వర్సిటీలో ఏకంగా 54 దేశాలకు చెందిన విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ యూనివర్సిటీలో మీకు ఇంజినీరింగ్, అగ్రికల్చర్, బీబీఏ, బీసీఏ, ఫార్మసీ, ఎల్ఎల్ బీ, మేనేజ్మెంట్ వంటి వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

అలాగే ఇక్కడ ఇన్ టర్న్ షిప్, క్యాంపస్ ప్లేస్మెంట్ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. వీళ్లు వందకి వందశాతం ప్లేస్మెంట్ గ్యారెంటీ కూడా ఇస్తున్నారు. అయితే ఇదంతా విన్న తర్వాత కచ్చితంగా ఫీజు ఎక్కువ ఉంటుంది అని మీరు అనుకోవచ్చు. కానీ, వీళ్ల ఫీజు మాత్రం మధ్యతరగతి వాళ్లు కూడా తమ పిల్లలను చదివించుకునే అంత తక్కువ అని గర్వంగా చెప్పుకుంటున్నారు. తాము విద్యను వ్యాపారం చేయడానికి రాలేదని.. విద్యను సర్వీస్ గా భావించి ఈ యూనివర్సిటీ రన్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇంకా ఈ యూనివర్సిటీ గురించి, అక్కడికి వెళ్లిన తల్లిదండ్రుల మాటలు వినడాని ఈ వీడియో పూర్తిగా చూసేయండి.