iDreamPost
android-app
ios-app

విద్యార్ధులకు గుడ్ న్యూస్.. JEE Advanced పై సూపర్ అప్డేట్ ఇచ్చిన కేంద్రం!

  • Published Nov 07, 2024 | 11:56 AM Updated Updated Nov 07, 2024 | 11:56 AM

JEE Advanced: విద్యార్ధులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. జేఈఈ అడ్వాన్స్డ్ అభ్యర్ధులకు సూపర్ అవకాశం ఇచ్చింది.

JEE Advanced: విద్యార్ధులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. జేఈఈ అడ్వాన్స్డ్ అభ్యర్ధులకు సూపర్ అవకాశం ఇచ్చింది.

విద్యార్ధులకు గుడ్ న్యూస్..  JEE Advanced పై సూపర్ అప్డేట్ ఇచ్చిన కేంద్రం!

దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక ఐఐటి, ఎన్‌ఐటీల్లో బీటెక్‌, బీఆర్క్‌ సీట్ల కోసం కొన్ని లక్షల విద్యార్ధులు పోటీ పడుతూ ఉంటారు. అలాంటి టాప్ సంస్థల్లో సీటు రావాలంటే ముందుగా జేఈఈ మెయిన్‌ పరీక్షలో బాగా రాణించాలి. ఆ తరువాత జేఈఈ అడ్వాన్స్డ్ లో రాణించాలి. జేఈఈ మెయిన్స్ లో అర్హత సాధించిన 1.5 లక్షల మందిని జేఈఈ ఆడ్వాన్స్‌డ్‌ రాసేందుకు అనుమతిస్తారు. అయితే తాజాగా జేఈఈ అడ్వాన్స్డ్ అభ్యర్ధులకు కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి? దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఇక ఐఐటీల్లో బీటెక్‌ సీట్లని ఫిల్ చేయడానికి జరిపే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను ఇప్పటి దాకా వరుసగా 2 సంవత్సరాలు మాత్రమే రాసేందుకు ఛాన్స్ ఉండేది. కానీ ఇక నుంచి మూడేళ్లు వరుసగా రాసుకోవచ్చని తాజాగా కేంద్రం ప్రకటించింది. ఈ ఛాన్స్ 2022-23 విద్యాసంవత్సరం ఇంటర్‌ పాసైన విద్యార్ధులకు కూడా ఉంటుంది. ఐఐటీ కాన్పుర్‌ ఈ మేరకు ప్రకటన జారీ చేసింది. అయితే అందరికీ ఈ ఛాన్స్ లేదు. 2000 అక్టోబరు 1 లేదా ఆ తర్వాత జన్మించిన వారికి మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025 పరీక్ష రాసేందుకు అర్హులని స్పష్టం చేసింది. ఇక ఈ పరీక్షలో ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్ధులకు మాత్రం అయిదేళ్ల మినహాయింపు ఉంటుంది. అంటే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ కేటగిరీలకు చెందిన అభ్యర్ధులు 1995 అక్టోబరు 1 లేదా ఆ తర్వాత పుట్టినవారు కూడా ఈ పరీక్షకు అర్హులు. సిలబస్‌లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. గత జేఈఈ సిలబస్‌ ఉంటుందని ఐఐటీ కాన్పుర్‌ వెల్లడించింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025 ఎగ్జామ్ డేట్ ని ఐఐటీ కాన్పుర్‌ ఇంకా ప్రకటించలేదు. మామూలుగా ఈ ఎగ్జామ్ ని ప్రతి సంవత్సరం మే 3వ లేదా 4వ వారంలో జరుపుతూ ఉంటారు. దాన్ని బట్టి ఈసారి మే 18 నుంచి 25 మధ్య తేదీల్లో జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

ఇక ఇదిలా ఉంటే ఐఐటీ కాన్పూర్‌ విద్యార్ధులకు మరో బంపరాఫర్‌ ఇచ్చింది. ఇంటర్నేషనల్ ఒలింపియాడ్‌లో పార్టిసిపెట్ చేసిన విద్యార్థులకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌తో సంబంధం లేకుండా ఐఐటీ కాన్పుర్‌లో ప్రవేశాలు కల్పించనున్నట్లు ప్రకటించింది. అంటే వీరికి డైరెక్ట్ గా బీటెక్, బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌ (బీఎస్‌) సీట్లు ఇస్తామని ఆ సంస్థ ప్రకటించింది. మ్యాథ్స్, ఇన్‌ఫర్మేటిక్స్‌ ఒలింపియాడ్‌లో పార్టిసిపెట్ చేసిన వారికి సీఎస్‌ఈలో 6 సీట్ల వరకు ఇవ్వనున్నట్లు పేర్కొంది. కెమిస్ట్రీ, ఎకనామిక్స్‌ సైన్సెస్, మేధమెటిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్, బయలాజికల్‌ సైన్సెస్‌ అండ్‌ బయో ఇంజినీరింగ్‌ గ్రూప్స్ లో సీట్లు ఇస్తామని తెలిపింది. ఈ సీట్లకు ప్రవేశాలు కల్పించడానికి మార్చి ఫస్ట్ వీక్ లో అప్లికేషన్స్ తీసుకుంటామని తెలిపింది. అలాగే జోసా కౌన్సెలింగ్‌ కంటే ముందుగానే ఈ ప్రవేశాలను పూర్తిచేయనున్నట్లు తెలిపింది. అయితే వీరికి అదనంగా సీట్లు ఇస్తారా? లేదా ఇప్పటికే ఉన్న సీట్ల నుంచి కేటాయిస్తారా అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. ఇదీ సంగతి. ఇక విద్యార్ధులకు JEE Advanced పై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూపర్ అప్డేట్ పై, అలాగే IIT కాన్పూర్ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.