iDreamPost
android-app
ios-app

విద్యార్థులకు గుడ్ న్యూస్.. బడికి బ్యాగ్స్ తీసుకెళ్లక్కర్లేదు

Bag Less Days: ప్రస్తుతం కాలంలోని విద్యార్థులకు పుస్తకాలు అనేవి గుదిబండగా మారుతున్నాయి. చాలా మంది విద్యార్థులు స్కూల్ బ్యాగ్ ను మోయలేక ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి తరుణంలో విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

Bag Less Days: ప్రస్తుతం కాలంలోని విద్యార్థులకు పుస్తకాలు అనేవి గుదిబండగా మారుతున్నాయి. చాలా మంది విద్యార్థులు స్కూల్ బ్యాగ్ ను మోయలేక ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి తరుణంలో విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

విద్యార్థులకు గుడ్ న్యూస్.. బడికి బ్యాగ్స్ తీసుకెళ్లక్కర్లేదు

తల్లిదండ్రులు తమ బిడ్డలకు నాణ్యమైన విద్యాను అందించాలని కోరుకుంటారు. అందుకే పిల్లల చదువు విషయంలో ఎక్కడ రాజీ పడరు. పిల్లలకు అవసరమైన ప్రతి వస్తువును అందిస్తుంటారు. ఇది ఇలా ఉంటే..నేటికాలం విద్యార్థులకు చదువు కంటే.. దానికి సంబంధించిన పుస్తకాలు భారంగా మారుతున్నాయి. వారి వయస్సుకు మించి పుస్తకాలను మోస్తున్నారు. ఈక్రమంలోనే పలు రకాల అనారోగ్య  సమస్యలకు లోనవుతున్నారు. కొందరు పిల్లలు అయితే బ్యాగ్ బరువు కారణంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర విద్యాశాఖ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. బ్యాగ్ ల నుంచి విద్యార్థులకు విముక్తి కల్పించింది. మరి..కేంద్ర విద్యాశాఖ తీసుకున్న నిర్ణయం ఏమిటి, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

కేంద్ర విద్యాశాఖ విద్యార్థులకు బిగ్ రిలీప్ ఇచ్చింది. ముఖ్యంగా 6వ తరగతి నుంచి 8వ తరగతి చదివే విద్యార్థులు స్కూల్ కి బ్యాగ్స్ తీసుకెళ్లకుండా కొత్త విధాన్ని తీసుకొచ్చింది. ఆ విద్యార్థులకు బ్యాగ్ లెస్ డేస్ అనే కొత్త విధానాన్ని అమలు చేయాలని కేంద్ర విద్యాశాఖ నిర్ణయించింది. బడికి వెళ్లి చదువుకునే పిల్లలకు వారు ఉపయోగించే బ్యాగుల బరువును కొన్ని రోజులైనా తగ్గించాలనే ఆలోచన కొన్ని రోజులుగా కేంద్రం కసరత్తు చేసింది. ఈ క్రమంలోనే తాజాగా నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) మార్గదర్శకాలను జారీ చేసింది. తాజా నిబంధనల ప్రకారం..6 నుంచి 8 తరగతుల విద్యార్థులకు  అకాడమిక్ ఇయర్ లో పది రోజులు పాఠశాలకు బ్యాగ్ తీసుకెళ్లాల్సిన పని లేదు. అలా అని..విద్యార్థులను పాఠశాలలో ఖాళీగా కూర్చోబెడతారు అని అనుకుంటే పొరపాటే.. పిల్లలకు క్షేత్ర స్థాయి పర్యటనలు చేయిస్తుంటారు.

కూరగాయల మార్కెట్లకు తీసుకెళ్లడం, స్వచ్ఛంద సంస్థలకు తీసుకెళ్లడం, పుస్తకాల ఎగ్జిబిషన్ కి, పరిశ్రమల వద్దకు, బయోగ్యాస్ ప్లాంట్స్ సందర్శన, వ్యవసాయ పొలాలకు తీసుకెళ్లడం వంటివ జరుగుతాయి.  తాజాగా ఎన్ సీఈఆర్టీ పాఠశాలలకు, టీచర్లకు చేసిన మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. అదే విధంగా బ్యాగ్ తీసుకెళ్లే పనిలేదు కాబట్టి..స్కూల్ కి లేదా తరగతులకు ఎవరైనా విద్యార్థులు డుమ్మకొడితే కఠినంగా వ్యవహరించాలనే కూడా ఉపాధ్యాయులకు మార్గదర్శకాలు ఉన్నాయి. పిల్లల్లోని నైపుణ్యాన్ని, ప్రతిభను వెలికితీసేందుకు ఈ కొత్త విధానం తీసుకొచ్చారు.

అలా కేవలం విద్యార్థుల్లోని నైపుణ్యం వెలికితీయడమే కాకుండా అందుకు తగ్గట్టుగా వారిని తీర్చిదిద్దే ఉద్దేశంతోనే ఈ బ్యాగ్ లెస్ డేస్ అనే విధాన్నాన్ని తీసుకొచ్చినట్లు కేంద్ర విద్యాశాఖ తెలిపింది. ఇలా పాఠశాలకు బ్యాగ్స్ తీసుకెళ్లకుండా ఉండటం అనేది విద్యా సంవత్సరంలో ఎప్పుడైనా అమలు చేసే వెసులుబాటును స్కూల్స్ కి ప్రభుత్వం కల్పించింది. అయితే.. రెండు లేదా మూడు దశల్లో పూర్తి చేయాలని జాతీయ విద్యా శాఖ మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. మరి..బ్యాగ్ లెస్ డేస్ విధానంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.