SNP
Marwadi University, BS AIML, BS AIDS: ఇంటర్‌లో ఎంపీసీ గ్రూప్ కాదా.. అయినా కూడా సాఫ్ట్‌వేర్ సైడ్ వెళ్లేందుకు కంప్యూటర్ సైన్స్ నేర్చుకోవాలని అనుకుంటున్నారా? అయితే మీ కోసం మార్వాడీ యూనివర్సిటీ మంచి కోర్సులు తీసుకొచ్చింది. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
Marwadi University, BS AIML, BS AIDS: ఇంటర్‌లో ఎంపీసీ గ్రూప్ కాదా.. అయినా కూడా సాఫ్ట్‌వేర్ సైడ్ వెళ్లేందుకు కంప్యూటర్ సైన్స్ నేర్చుకోవాలని అనుకుంటున్నారా? అయితే మీ కోసం మార్వాడీ యూనివర్సిటీ మంచి కోర్సులు తీసుకొచ్చింది. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
SNP
పదో తరగతి తర్వాత విద్యార్థులు ఏ రంగంలో కొనసాగాలో డిసైడ్ అవ్వాల్సిన సమయం వస్తుంది. చాలా మంది ఇక్కడే బాగా తికమక పడతారు. ఇంటర్‌లో చేరాలా? డిప్లొమా కోర్స్ చేయాలా? లేక ఐటీఐ కాలేజీలో చేరాలా? అని బుర్ర బద్దలు కొట్టుకుంటారు. ఇక ఇంటర్‌లో చేరాలని డిసైడ్ అయిన తర్వాత.. ఏ గ్రూప్ తీసుకోవాలనే కన్‌ఫ్యూజన్. ఎంపీసీ చేస్తే ఇంజనీరింగ్, బైపీసీ చేస్తే మెడికల్ సైడ్, సీఈసీ చేస్తే ఫైనాన్స్ వైపు కెరీర్ వెళ్తుంది. అయితే.. చాలా మంది ఇంటర్ సమయంలో గందరగోళానికి గురై.. తమ ఆసక్తి, నాలెడ్జ్‌ను అంచనా వేయకుండా, వాళ్లూ వీళ్లూ చెప్పారని, లేదా ఫ్రెండ్స్ అంతా ఒక గ్రూప్ తీసుకుంటున్నారని వాళ్లతో పాటు ఏదో ఒక గ్రూప్లో జాయిన్ అయిపోతుంటారు. తీరా ఇంటర్ అయ్యాకా.. అద్భుతమైన కెరీర్ ఉండే కంప్యూటర్ సైన్స్‌లో జాయిన్ అవ్వలేమని తెలిసి బాధపడుతుంటారు.
ఇంటర్‌లో ఎంపీసీ తీసుకుని, ఎంసెట్ రాసి.. బీటెక్‌లో జాయిన్ అయిన వాళ్లకే ఈ కంప్యూటర్ సైన్స్ కోర్స్ చేసే అవకాశం ఉండేది. కానీ, ఇప్పుడు మార్వాడీ యూనివర్సిటీ ఓ అద్భుతమైన కోర్సు తీసుకొచ్చింది. టెన్త్ తర్వాత ఏ కోర్స్ చేసిన వాళ్లు అయినా, ఇంటర్‌లో ఏ గ్రూప్ చదివిన వాళ్లు అయినా సరే.. ఈ కంప్యూటర్ సైన్స్ కోర్సును నేర్చుకోవచ్చు. ‘బీఎస్ కంప్యూటర్ సైన్స్’ అనే వినూత్న కోర్సును మార్వాడీ యూనివర్సిటీ అందిస్తోంది. ఇది చాలా మంది విద్యార్థులకు ఒక సువర్ణ అవకాశం అనే చెప్పాలి. నాలుగేళ్ల ఈ కోర్సు చేస్తే.. సాఫ్ట్‌వేర్ రంగంలో ఎన్నో అద్భుతమైన అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగాలు పొందవచ్చు.
ఈ బీఎస్ కంప్యూటర్ సైన్స్‌లో రెండు రకాల కోర్సులు ఉన్నాయి.. అవి బీఎస్ ఏఐఎంఎల్, బీఎస్ ఏఐఎన్‌డీఎస్. ఇంటర్‌లో బైపీసీ గ్రూప్‌లో జాయిన్ అయి.. ఎంబీబీఎస్ తాను చేయలేమని, లేక ఇంట్రెస్ట్ లేని వాళ్లు, అలాగే సీఈసీ, ఎంఈసీ, హెచ్‌ఈసీ తీసుకుని.. కామర్స్, ఫైనాన్స్, బ్యాంక్ సెక్టార్ వైపు వెళ్లడం ఇష్టం లేని వాళ్లు కూడా ఈ కోర్సుల్లో జాయిన్ అవ్వొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ అనేవి భవిష్యత్తును శాసించే రంగాలు. అందుకే మార్వాడీ యూనివర్సిటీ బీఎస్ ఏఐఎంఎల్, బీఎస్ ఏఐఎన్‌డీఎస్ కోర్సులను డిజైన్ చేసింది. చాలా తక్కువ ఫీజుతో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడకుండా ఈ కోర్సులు ఆఫర్ చేస్తోంది. ఈ మార్వాడీ యూనివర్సిటీ గుజరాత్‌లో ఉంది. కంప్యూటర్ సైన్స్ కోర్సుల గురించి.. మరిన్ని వివరాల కోసం కింద ఉన్న వీడియో చూడండి. అందులో.. మార్వడీ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ విభాగం హెడ్ కోర్సు గురించి పూర్తి వివరాలు వెల్లడించారు.